పెద్ది కోసం ఆమెను రంగంలోకి దింపుతున్నారా?
ఐటెం సాంగ్స్ కాస్తా స్పెషల్ సాంగ్స్ అయ్యాయి. అందుకే ఈ స్పెషల్ సాంగ్స్ చేయడానికి హీరోయిన్లు కూడా వెంటనే ఒప్పేసుకుంటున్నారు.
By: Sravani Lakshmi Srungarapu | 5 Aug 2025 9:00 PM ISTపాత రోజుల్లో ఐటెం సాంగ్స్ చేయడానికి స్పెషల్ గా హీరోయిన్లు ఉండేవాళ్లు. సిల్క్ స్మిత, జయమాలిని, జ్యోతి లక్ష్మి, అనురాధ ఇలా ఎంతోమంది భామలు ఐటెం సాంగ్స్ కోసమే ఉండేవారు. ఆ తర్వాత బాలీవుడ్ భామలు, విదేశీ అమ్మాయిలతో ఈ సాంగ్స్ ను చేయించారు. ఇప్పుడు కాలంతో పాటూ ట్రెండ్ కూడా మారిపోయింది. హీరోయిన్లే వాటిలో నటిస్తున్నారు.
ఐటెం సాంగ్స్ కాస్తా స్పెషల్ సాంగ్స్ అయ్యాయి. అందుకే ఈ స్పెషల్ సాంగ్స్ చేయడానికి హీరోయిన్లు కూడా వెంటనే ఒప్పేసుకుంటున్నారు. రెమ్యూనరేషన్ కు రెమ్యూనరేషన్, క్రేజ్ కు క్రేజ్ వస్తుండటంతో ఎవరూ వీటికి నో చెప్పదలచుకోవడం లేదు. దానికి తోడు హీరోయిన్లు ఈ స్పెషల్ సాంగ్స్ చేయడంతో సినిమాకు కూడా మరింత హైప్ ఏర్పడుతుంది. అందుకే దర్శకనిర్మాతలు కూడా ఆడియన్స్ టేస్ట్ కు ప్రాధాన్యతనిస్తూ స్టార్ హీరోయిన్లతో ఆ స్పెషల్ సాంగ్స్ ను చేయిస్తున్నారు.
పుష్పలో మెరిసిన సమంత
పుష్ప సినిమాలో ఊ అంటావా సాంగ్ లో కనిపించి సమంత నేషనల్ వైడ్ పాపులరవగా, ఆ తర్వాత కిస్సిక్ అంటూ పుష్ప2లో శ్రీలీల నటించి తన క్రేజ్ ను పెంచుకుంది. హీరోయిన్లతో స్పెషల్ సాంగ్స్ చేస్తే మంచి రెస్పాన్స్ వస్తుండటంతో మేకర్స్ దానిపై ఫోకస్ పెట్టారు. అందులో భాగంగానే ఇప్పుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బుచ్చి బాబు సాన దర్శకత్వంలో వస్తోన్న పెద్ది సినిమాలో ఓ హీరోయిన్ ను తీసుకుంటున్నట్టు వార్తలొస్తున్నాయి.
గ్లోబల్ స్టార్ సరసన శ్రీలీల
మంచి హైప్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఓ స్పెషల్ ఫోక్ సాంగ్ ను ప్లాన్ చేస్తుండగా ఆ సాంగ్ కోసం కిస్సిక్ బ్యూటీ శ్రీలీల ఎంపికైనట్టు తెలుస్తోంది. రామ్ చరణ్ మంచి డ్యాన్సర్ కావడంతో శ్రీలీల అయితే అతడిని మ్యాచ్ చేయగలదని, దాంతో పాటూ ప్రస్తుతం శ్రీలీలకు మంచి డిమాండ్ ఉండటంతో ఆమెనే మేకర్స్ ఫిక్స్ చేశారని అంటున్నారు. రీసెంట్ గా జూనియర్ సినిమాలో వైరల్ వయ్యారి అంటూ తన డ్యాన్స్ మూమెంట్స్ తో ఓ ఊపు ఊపిన శ్రీలీల మరి పెద్ది సినిమాలో స్పెషల్ సాంగ్ చేస్తుందో లేదో చూడాలి. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుండగా, ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 27న పెద్ది ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
