Begin typing your search above and press return to search.

డార్లింగ్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే అప్డేట్.. స్పెష‌ల్ గా ప్లాన్ చేసిన వంగా!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ కెరీర్‌లో అత్యంత భారీ అంచనాలున్న ప్రాజెక్టుల లిస్ట్ లో ముందున్న సినిమా స్పిరిట్.

By:  Sravani Lakshmi Srungarapu   |   25 May 2026 11:13 AM IST
డార్లింగ్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే అప్డేట్.. స్పెష‌ల్ గా ప్లాన్ చేసిన వంగా!
X

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ కెరీర్‌లో అత్యంత భారీ అంచనాలున్న ప్రాజెక్టుల లిస్ట్ లో ముందున్న సినిమా స్పిరిట్. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌పై ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ హైప్ నెలకొంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికరమైన అప్డేట్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. వచ్చే నెల మొద‌టి వారంలో ప్రభాస్- త్రిప్తి డిమ్రీ కాంబినేషన్‌లో ఓ స్పెషల్ సాంగ్ షూట్ చేయడానికి మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ సాంగ్ కోసం ప్రత్యేకంగా భారీ సెట్స్ నిర్మిస్తున్నారని, విజువల్ గ్రాండియర్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా మేకర్స్ భారీ బడ్జెట్ కేటాయించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సాంగ్ గురించి వినిపిస్తున్న అంచనాలు చూస్తుంటే.. ఇది ఇండియన్ సినిమాల్లోనే మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ స్పెషల్ సాంగ్ అవుతుందా? అనే చర్చ కూడా మొదలైంది.

ఈ పాట కేవలం గ్లామర్ ఎలిమెంట్ కోసం కాకుండా, సినిమాపై హైప్ పెంచే విధంగా దీన్ని తెర‌కెక్కించ‌నున్నార‌ని తెలుస్తోంది. ముఖ్యంగా ప్రభాస్- త్రిప్తి డిమ్రీ కెమిస్ట్రీని కొత్త స్థాయిలో చూపించేలా సందీప్ రెడ్డి వంగా దీన్ని స్పెష‌ల్ గా ప్లానింగ్ చేశార‌ట‌. తృప్తి పాత్ర కూడా సాధారణ హీరోయిన్ తరహాలో కాకుండా కథను ముందుకు నడిపించే కీలక పాత్రగా ఉండబోతుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. గ్లామర్‌తో పాటూ ఎమోషనల్ డెప్త్ కలిగిన పాత్రలో ఆమె కనిపించబోతుండటం ఆసక్తిని మరింత పెంచుతోంది.

మరోవైపు ఈ సినిమాలో ప్రభాస్ లుక్‌పై కూడా భారీ చర్చ సాగుతోంది. ఇప్పటివరకు చూడని రఫ్ & వైల్డ్ పోలీస్ అవతార్‌లో ప్రభాస్ కనిపించబోతున్నార‌ని సమాచారం. స‌లార్ తర్వాత మరోసారి పూర్తిస్థాయి రౌడీ ఎనర్జీతో ఆయన స్క్రీన్‌పై కనిపించనున్నార‌నే టాక్ ఫ్యాన్స్‌లో ఎక్స్‌పెక్టేషన్స్‌ను అమాంతం పెంచేసింది. భారీ ఫిజిక్, స్పెష‌ల్ స్టైలింగ్, బాడీ లాంగ్వేజ్, ఇంటెన్స్ యాక్షన్‌తో ప్రభాస్ ఈ సినిమాలో పూర్తిగా కొత్త అవతార్‌లో దర్శనమివ్వనున్నార‌ట. కాప్ రోల్ కోసం స్పెష‌ల్ గా ట్రైనింగ్ కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇక డైరెక్ట‌ర్ సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాను సాధారణ పోలీస్ స్టోరీగా కాకుండా డార్క్, ఇంటెన్స్, ఎమోషనల్ ట్రీట్‌మెంట్‌తో రూపొందిస్తున్నార‌ట. అర్జున్ రెడ్డి, యానిమ‌ల్ సినిమాల తర్వాత ఆయన నుంచి మరోసారి షాకింగ్ మరియు రా వ‌ర‌ల్డ్ ప్రేక్షకుల ముందుకు రాబోతుందనే అంచనాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా పాత్రల ఎమోషన్స్, హింస, మానసిక సంఘర్షణలను చూపించే విషయంలో సందీప్ స్టైల్‌కు ఇప్పటికే ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇప్పుడ‌దే టేకింగ్‌ను భారీ పాన్ ఇండియా స్కేల్‌లో తీసుకురావడానికి ఆయన సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

మ్యూజిక్ పరంగా కూడా ఈ సినిమా స్పెష‌ల్ గా నిలవనుంది. హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రామేశ్వ‌ర్- సందీప్ కాంబినేష‌న్ మరోసారి రిపీట్ అవుతుండటంతో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. టీ సిరీస్ మ‌రియు భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను గ్లోబల్ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. హాలీవుడ్ స్టైల్ యాక్షన్ విజువల్స్, భారీ ప్రొడక్షన్ వాల్యూస్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మేకింగ్‌తో స్పిరిట్‌ను ప్రభాస్ కెరీర్‌లో మరో మైలురాయి సినిమాగా నిలబెట్టే ప్రయత్నం జరుగుతోంది.