Begin typing your search above and press return to search.

స్పిరిట్ వర్క్ ఎంత వరకు వచ్చిందంటే..

ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో వస్తున్న 'స్పిరిట్' సినిమా కోసం ఫ్యాన్స్ గట్టిగానే వెయిట్ చేస్తున్నారు.

By:  M Prashanth   |   21 Aug 2026 10:37 PM IST
స్పిరిట్ వర్క్ ఎంత వరకు వచ్చిందంటే..
X

ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో వస్తున్న 'స్పిరిట్' సినిమా కోసం ఫ్యాన్స్ గట్టిగానే వెయిట్ చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ ప్రాజెక్ట్ నుంచి ఎలాంటి వీడియో అప్ డేట్ లేకపోవడంతో కాస్త క్యూరియాసిటీ పెరిగింది. అయితే సెప్టెంబర్ 3న రిలీజ్ కాబోతున్న 'రోమాంచకం' ప్రెస్ మీట్ లో నిర్మాత ప్రణయ్ వంగాను స్పిరిట్ గురించి అడగ్గా.. ఆయన కొన్ని క్రేజీ విషయాలను రివీల్ చేశారు.

ముందుగా సినిమా గురించి మాట్లాడుతూ అందరికీ ఒక సర్ ప్రైజ్ ఇచ్చారు. స్పిరిట్ సినిమా షూటింగ్ అప్పుడే 40 శాతం పూర్తయిందని ప్రణయ్ క్లారిటీ ఇచ్చారు. మిగిలిన షూటింగ్ ను కూడా రెండు మూడు నెలల్లో కంప్లీట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం ప్రభాస్ 'ఫౌజీ' సినిమా పనుల్లో ఉన్నారని, ఆ సినిమా నుంచి రాగానే స్పిరిట్ బ్యాలెన్స్ షూట్ మొత్తం అయిపోగొట్టేస్తామని ఆయన చెప్పారు.

ఇక యాక్షన్ సీన్స్ లో ప్రభాస్ కు డూప్ ను వాడతారా అన్న ప్రశ్నకు ప్రణయ్ ఆన్సర్ ఇస్తూ.. ప్రస్తుతానికి అయితే డూప్స్ ఏమీ వాడలేదని క్లియర్ చేశారు. ప్రభాస్ షూటింగ్ కు భలే కోఆపరేట్ చేస్తున్నారని, హీరో కరెక్ట్ మూడ్ లో ఉన్నప్పుడు సీన్ కంటిన్యూ చేయడం సందీప్ కు అలవాటు అని చెప్పారు. అలా ప్రభాస్ ఏకంగా రెండు మూడు సార్లు 16 గంటల పాటు నాన్ స్టాప్ గా షూటింగ్ చేశారని చెప్పి ఆయన డెడికేషన్ ను మెచ్చుకున్నారు.

ఈ సినిమాలో హీరోయిన్ గా దీపికా పదుకొణె ప్లేస్ లోకి త్రిప్తి దిమ్రి రావడం పట్ల కూడా ప్రణయ్ స్పందించారు. త్రిప్తి ఫెంటాస్టిక్ పెర్ఫార్మర్ అని, సందీప్ రాసుకున్న ఆ పాత్రకు ఆమె పర్ఫెక్ట్ గా సెట్ అవ్వడంతో ఆ రోల్ ఆమెకు దక్కిందని చెప్పారు. అలాగే సెట్స్ లో ప్రభాస్ ఫుడ్ పెడతారా అని అడగ్గా.. ఆయన సెట్స్ కు అన్ని రకాల వెరైటీ ఫుడ్స్ పంపిస్తూనే ఉంటారని నవ్వుతూ చెప్పారు.

యానిమల్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న స్పిరిట్ కూడా అదే రేంజ్ లో ఉంటుందా అన్న ప్రశ్నకు.. స్క్రీన్ మీద చూస్తే ఆ విషయం మీకే తెలుస్తుందని ప్రణయ్ కాన్ఫిడెంట్ గా ఆన్సర్ ఇచ్చారు. స్పిరిట్ కూడా బాక్సాఫీస్ దగ్గర గట్టిగానే తన లెక్క తేలుస్తుందని అన్నారు. ఇక ఆగస్టు 25న జరగబోయే 'రోమాంచకం' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు సందీప్ రెడ్డి వంగా వస్తున్నట్లు ఆయన కన్ఫర్మ్ చేశారు.

చివర్లో అర్జున్ రెడ్డి కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతుందా అని మీడియా అడగ్గా.. విజయ్ దేవరకొండతో సందీప్ మళ్లీ సినిమా చేసే ఛాన్స్ ఉందని ప్రణయ్ హింట్ ఇచ్చారు. విజయ్ కూడా మళ్లీ కలిసి పనిచేద్దామని అడిగారని, సందీప్ కు సరైన ఐడియా వస్తే ఫ్యూచర్ లో ఆ ప్రాజెక్ట్ కచ్చితంగా వర్కౌట్ అవుతుందని ఆయన క్లారిటీ ఇచ్చారు.