స్పిరిట్: వంగా బ్రదర్ ఆ రేంజ్ లో సవాల్ చేశారంటే..
సినిమా ఎలా ఉంటుందో చెప్పడానికి ఇంకా టైమ్ ఉన్నా.. ప్రొడ్యూసర్ ప్రణయ్ రెడ్డి వంగా చేసిన ఒక్క కామెంట్ మాత్రం స్పిరిట్ పై డిబేట్ స్టార్ట్ చేసింది.
By: M Prashanth | 12 Sept 2026 11:00 PM ISTసినిమా రిలీజ్ కు ముందు హైప్ రావడం కామన్.. కానీ ఓ మూవీ రివ్యూలను ఎదుర్కొంటుందనే విషయంలోనే ఫుల్ కాన్ఫిడెన్స్ చూపించడం మాత్రం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు రెబల్ స్టార్ ప్రభాస్ స్పిరిట్ విషయంలో ఇదే జరుగుతోంది. సినిమా ఎలా ఉంటుందో చెప్పడానికి ఇంకా టైమ్ ఉన్నా.. ప్రొడ్యూసర్ ప్రణయ్ రెడ్డి వంగా చేసిన ఒక్క కామెంట్ మాత్రం స్పిరిట్ పై డిబేట్ స్టార్ట్ చేసింది.
తాను నిర్మించిన రోమాంచకం సినిమాపై వచ్చిన విమర్శల గురించి రీసెంట్ గా మాట్లాడిన ప్రణయ్ రెడ్డి.. సినిమా వెనుక ఉండే కష్టాన్ని రివ్యూలు రాసేవాళ్లు కూడా అర్థం చేసుకోవాలని అన్నారు. ఒక స్టోరీని దర్శకుడు స్క్రీన్ పైకి తీసుకురావడానికి చాలా కష్టపడతారని చెప్పారు. కానీ కొందరు రివ్యూల్లో చిన్న చిన్న విషయాలను కూడా పట్టుకుని సినిమాను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తం చేశారు.
అంతేకాదు.. అసలు సవాల్ ను స్పిరిట్ మూవీ దగ్గరికి తీసుకొచ్చారు. నిజంగా అంత స్టామినా ఉంటే.. స్పిరిట్ ను రివ్యూలతో తగ్గించి చూపించగలరా అంటూ విమర్శకులకు సవాల్ విసిరారు. సినిమా విడుదలైన తర్వాత చూద్దామనే రేంజ్ లో ఆయన మాట్లాడటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కానీ ఇక్కడే అసలు పాయింట్ ఉంది. సాధారణంగా నిర్మాతలు తమ సినిమాపై విమర్శలు వస్తే వాటిని ఖండించే వరకు మాత్రమే వెళ్తారు.
కానీ స్పిరిట్ విషయంలో మాత్రం ప్రణయ్ రెడ్డి చేసిన కామెంట్స్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. రివ్యూలు, విమర్శలు వచ్చినా సినిమాను నిలబెట్టేంత కంటెంట్ తమ దగ్గర ఉందనే నమ్మకం ఆయన మాటల్లో కనిపిస్తోంది. అందుకే ఆ కామెంట్ స్పిరిట్ పై అంచనాలను మరో రేంజ్ కు తీసుకెళ్తోంది. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్, సందీప్ రెడ్డి వంగా లాంటి దర్శకుడు కాంబోలో వస్తున్న సినిమా కావడంతో మొదటి నుంచే దీనిపై భారీ హైప్ ఉంది.
ఇప్పుడు నిర్మాత చేసిన సవాల్ దాన్ని ఇంకాస్త పెంచింది. ముఖ్యంగా సందీప్ సినిమాలపై ప్రేక్షకుల్లో అంచనాలు వేరు. ఆయన స్టోరీ, రోల్స్, యాక్షన్ మాత్రమే కాదు తనదైన టేకింగ్ తో మెప్పిస్తారు. అలాంటి దర్శకుడి నుంచి ప్రభాస్ తో వస్తున్న సినిమా కావడంతో స్పిరిట్ ఎలా ఉండబోతోందనే ఇంట్రెస్ట్ ఇప్పటికే ఉంది. ఇప్పుడు దానికి తోడు నిర్మాతే చేతనైతే సినిమా రివ్యూలతో తగ్గించి చూపండనే రేంజ్ లో సవాల్ విసరడంతో.. అసలు సినిమాలో ఏముందనే ప్రశ్న మరింత పెరిగింది.
ఇక నిజంగానే స్పిరిట్ టీమ్ తమ కంటెంట్ పై అంత గట్టి నమ్మకంతో ఉందా? అన్నది సినిమా విడుదలైన తర్వాతే తెలుస్తుంది. అయితే ఒక్కటి మాత్రం క్లియర్ అని చెప్పాలి. స్పిరిట్ ఇంకా థియేటర్లలోకి రాకముందే.. దాని చుట్టూ డిబేట్ రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పుడు సినిమా విడుదలకు ముందే నిర్మాత నుంచి సవాల్ రావడంతో.. ఇక స్పిరిట్ పై వచ్చే ఫస్ట్ రివ్యూలు, ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉంటాయన్నది వేచి చూడాలి.
