Begin typing your search above and press return to search.

సందీప్ స్పిరిట్.. రెబల్ స్టార్ ని మార్చేస్తున్నారా..?

రెబల్ స్టార్ ప్రభాస్ సందీప్ వంగ కాంబినేషన్ లో స్పిరిట్ సినిమా వస్తుంది. ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో క్రేజీ మూవీగా ప్లాన్ చేస్తున్నారు.

By:  Ramesh Boddu   |   4 Nov 2025 10:00 PM IST
సందీప్ స్పిరిట్.. రెబల్ స్టార్ ని మార్చేస్తున్నారా..?
X

రెబల్ స్టార్ ప్రభాస్ సందీప్ వంగ కాంబినేషన్ లో స్పిరిట్ సినిమా వస్తుంది. ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో క్రేజీ మూవీగా ప్లాన్ చేస్తున్నారు. స్పిరిట్ సినిమా నుంచి ఇప్పటికే ఒక ఆడియో ప్రోమో ఇప్పటివరకు ఎవరు కూడా ట్రై చేయని విధంగా చేశాడు సందీప్ వంగ. ఐతే ఈసారి సందీప్ వంగ ప్రభాస్ ట్యాగ్ లైన్ ని ఇండియా బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని ఇచ్చాడు. ప్రభాస్ కి అసలైతే రెబల్ స్టార్ అనే ట్యాగ్ ఉంది. కానీ స్పిరిట్ కోసం ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్ అని పెట్టడం అంతటా డిస్కషన్ పాయింట్ అయ్యింది.

ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్..

ఇదే ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ గా బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ని సంబోధిస్తారు. ఐతే రెబల్ స్టార్ కి స్పిరిట్ కోసం ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని పెట్టడం షారుఖ్ ఫ్యాన్స్ ని అప్సెట్ చేస్తుంది. ఐతే స్పిరిట్ ఆడియో ప్రోమోకి ఎలివేషన్ కోసం అలా పెట్టారా లేదా సినిమాలో కూడా ప్రభాస్ ట్యాగ్ రెబల్ స్టార్ కి బదులుగా ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని కొనసాగిస్తారా అన్నది తెలియాల్సి ఉంది.

సందీప్ వంగ ఏం చేసినా సరే సంథింగ్ స్పెషల్ గా ఉంటుంది. అతను చేసే సినిమాల్లో వైలెన్స్ ఎక్కువ ఉన్నా కూడా ఆడియన్స్ దాన్ని యాక్సెప్ట్ చేసేలా స్క్రీన్ ప్లే చూపిస్తాడు. యానిమల్ తో సందీప్ ప్రతిభ బాలీవుడ్ ఆడియన్స్ కి బీభత్సంగా నచ్చేసింది. ఆ సినిమా తర్వాత సందీప్ నుంచి వస్తున్న సినిమా కాబట్టి స్పిరిట్ సినిమాపై ఇంకాస్త క్రేజ్ ఏర్పడింది.

సందీప్ వంగ స్పిరిట్ లో త్రిప్తి డిమ్రి..

ఇక ఇప్పుడు సినిమా ప్రమోషన్స్ లోనే ట్యాగ్ మార్చేసి సెన్సేషన్ అనిపిస్తున్నాడు. మరి నిజంగానే రెబల్ స్టార్ ట్యాగ్ మార్చేసి ప్రభాస్ కి ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ట్యాగ్ ఇస్తున్నారా లేదా స్పిరిట్ కోసం అది కూడా ఫస్ట్ ప్రమోషన్ కాబట్టి అలా పెట్టారా అన్నది చూడాలి. ఇక ఈ ట్యాగ్ విషయంలో అటు ప్రభాస్ ఫ్యాన్స్, ఇటు షారుఖ్ ఫ్యాన్స్ మధ్యలో ఎక్స్ లో చిన్నపాటి డిస్కషన్ నడుస్తుంది. ఫ్యాన్స్ లో ఇలాంటి ఫైట్ కామన్ అనిపించినా కూడా కచ్చితంగా ఇది నెక్స్ట్ లెవెల్ కి వెళ్లకుండా ఉంటే బెటర్ అని చెప్పొచ్చు.

ప్రభాస్ సందీప్ వంగ స్పిరిట్ లో త్రిప్తి డిమ్రి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో వివేక్ ఒబెరాయ్ సినిమా కూడా నటిస్తున్నాడు. స్పిరిట్ సందీప్ వంగ ప్లానింగ్ ఎలా ఉన్నా ఆడియన్స్ లో మాత్రం సినిమాపై విపరీతమైన క్యూరియాసిటీ ఉంది.