Begin typing your search above and press return to search.

కాఖీ ధ‌రించిన‌ స్టార్ ఇంతేనా? ఇంత‌కు మించా?

ప్ర‌భాస్ కథానాయ‌కుడిగా సందీప్ రెడ్డి వంగా ద‌ర్శ‌క‌త్వంలో `స్పిరిట్` మొద‌లైన సంగ‌తి తెలిసిందే. సినిమా షూటింగ్ కూడా మొద‌లైంది.

By:  Srikanth Kontham   |   5 Dec 2025 10:18 PM IST
కాఖీ ధ‌రించిన‌ స్టార్ ఇంతేనా? ఇంత‌కు మించా?
X

ప్ర‌భాస్ కథానాయ‌కుడిగా సందీప్ రెడ్డి వంగా ద‌ర్శ‌క‌త్వంలో `స్పిరిట్` మొద‌లైన సంగ‌తి తెలిసిందే. సినిమా షూటింగ్ కూడా మొద‌లైంది. ప్ర‌భాస్ కూడా సెట్స్ కు వెళ్ల‌డం ప్రారంభించాడు. ప్ర‌స్తుతం డార్లింగ్ జపాన్ టూర్ లో ఉన్నాడు తిరిగొచ్చిన త‌ర్వాత `స్పిరిట్` షూటింగ్ లో బిజీ అవుతాడు. అప్ప‌టి నుంచి నిర్విరామంగా షూటింగ్ లో పాల్గొంటాడు. ఇదంతా రొటీన్ మ్యాట‌ర్. మ‌రి `స్పిరిట్` లో డార్లింగ్ లుక్ ఎలా ఉండ‌బోతుంది? అన్న‌దే ఆస‌క్తిక‌రం. `స్పిరిట్` లో ప్ర‌భాస్ పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషిస్తున్నాడు. మ‌రి సందీప్ లుక్ ప‌రంగా కొత్త‌గా ట్రై చేస్తాడా? లేక తాజా లుక్ లోనే కాఖీ వేయిస్తాడా? అన్న‌ది చూడాలి.

రెండు సినిమాల్లో ఒకేలా:

ప్ర‌స్తుతం ప్ర‌భాస్ జపాన్ టూర్ లో ఉన్న ఫోటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. ఇందులో `రాజాసాబ్` లుక్ లోనే క‌నిపిస్తున్నాడు. ఆ సినిమా కోసం స్లిమ్ గా మారిన సంగ‌తి తెలిసిందే. వాటిలో వింటేజ్ డార్లింగ్ క‌నిపిస్తున్నాడు. `స‌లార్`, `క‌ల్కి` చిత్రాల్లో లుక్ ప‌రంగా పెద్ద‌గా మార్పులు చేయ‌లేదు. ఉన్న లుక్ తోనే చుట్టేసారు. కానీ మారుతి మాత్రం త‌న క‌థ‌కు త‌గ్గ‌ట్టు మౌల్డ్ చేసుకున్నాడు. `పౌజీ` కోసం హ‌ను రాఘ‌వ‌పూడి లుక్ ప‌రంగా పెద్ద‌గా క‌స‌ర‌త్తులు చేయ‌లేదు. త‌న కాన్సెప్ట్ త‌గ్గ‌ట్టు డిజైన్ చేసుకుని ప‌ట్టాలెక్కించాడు.

`యానిమ‌ల్` లుక్ కొత్త‌గా:

దీంతో సందీప్ లుక్ ప‌రంగా ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకుంటాడు? అన్న‌దే చ‌ర్చ‌. సందీప్ తొలి సినిమా `అర్జున్ రెడ్డి`లో హీరో కాలేజ్ స్టూడెంట్ కావ‌డంతో? అదే లుక్ లో విజ‌య్ ని హైలైట్ చేసాడు. క్యారెక్ట‌ర్ ని మాత్ర‌మే స్ట్రాంగ్ గాచూపించాడు. కానీ `యానిమ‌ల్` విష‌యానికి వ‌చ్చే స‌రికి అందులో హీరో ర‌ణ‌బీర్ క‌పూర్ కి ఓ కొత్త లుక్ ఇచ్చాడు. లాంగ్ హెయిర్ స్టైల్...క‌ళ్ల‌కు అద్దాలు...స‌న్నివేశాల‌కు త‌గ్గ‌ట్టు హీరో వెయిట్ లాస్ అవ్వ‌డం..గెయిన్ అవ్వ‌డం జ‌రిగింది. పూర్తిగా క్యారెక్ట‌ర్ కు....ఆ సినిమా టైటిల్ కు త‌గ్గ‌ట్టు ర‌ణ‌బీర్ లుక్ లో చాలా మార్పులే చేసాడు.

డార్లింగ్ కోసం స్పెష‌ల్ లుక్:

తాజాగా `స్పిరిట్` పోలీస్ స్టోరీ అయినా ? ఆ క‌థ‌ను సందీప్ కొత్త‌గానే చెబుతాడు. రెగ్యుల‌ర్ పోలీస్ స్టోరీల‌కు భిన్నంగా ఆ చిత్రం ఉంటుంది. ప్ర‌భాస్ పాత్ర చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. పోలీస్ సిస్ట‌మ్ అన్న‌ది కూడా హీరో చేతుల్లో ఉంటుంది. అవ‌స‌రం మేర సందీప్ హీరో ఆ సిస్ట‌మ్ ను బ్రేక్ చేసేలా ఉంటాడు. వీట‌న్నింటిని ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని సందీప్ హీరో లుక్ విష‌యంలోనూ వ్య‌వ‌హ‌రించాల్సి ఉంటుంది. మ‌రి ప్ర‌భాస్ ని ఎంత స్టైలిష్ గా..ఇన్నో వేటిగ్ గా చూపిస్తాడు? అన్న‌ది చూడాలి.