అసలు సిసలు రెబలిజం.. స్పిరిట్ మెంటల్ ఎక్కించేస్తాడా..?
ఐతే అర్జున్ రెడ్డిలో విజయ్ దేవరకొండ, యానిమల్ లో రణ్ బీర్ కపూర్ ని చూసిన ఆడియన్స్ స్పిరిట్ లో ప్రభాస్ ని ఎలా చూపిస్తాడు అన్న దానిపై డిస్కస్ చేస్తున్నారు.
By: Ramesh Boddu | 3 Nov 2025 11:38 AM ISTయానిమల్ తర్వాత సందీప్ రెడ్డి వంగ చేస్తున్న సినిమా స్పిరిట్. రెబల్ స్టార్ ప్రభాస్ తో సందీప్ సినిమా అని అనౌన్స్ చేయగానే ఫ్యాన్స్ లో ఎక్స్ పెక్టేషన్స్ పీక్స్ కి చేరాయి. ముఖ్యంగా ప్రస్తుత ట్రెండ్ కి తగినట్టుగా సందీప్ చేస్తున్న సినిమాలు నెక్స్ట్ లెవెల్ అనిపిస్తున్నాయి. సందీప్ సినిమాలను ఇష్టపడే ఆడియన్స్ అతని క్యారెక్టరైజేషన్ కి ఎడిక్ట్ అవుతున్నారు. ఐతే అర్జున్ రెడ్డిలో విజయ్ దేవరకొండ, యానిమల్ లో రణ్ బీర్ కపూర్ ని చూసిన ఆడియన్స్ స్పిరిట్ లో ప్రభాస్ ని ఎలా చూపిస్తాడు అన్న దానిపై డిస్కస్ చేస్తున్నారు.
స్పిరిట్ బలమైన కథ.. సందీప్ వంగ రెబలిజం..
మామూలుగానే రెబల్ స్టార్ కటౌట్ ఒక రేంజ్ లో ఉంటుంది. దానికి తగినట్టుగా బలమైన కథ కథనాలు ఉంటే అది వేరే లెవెల్ అన్నట్టే. స్పిరిట్ కోసం సందీప్ వంగ కూడా అదే రేంజ్ లో అసలు సిసలైన రెబలిజం అంటే ఏంటో చూపిస్తారని తెలుస్తుంది. సందీప్ ప్లానింగ్.. ఎగ్జిక్యూషన్ అంతా కూడా పర్ఫెక్ట్ ప్లానింగ్ తో వెళ్తున్నాడు. స్పిరిట్ సినిమాకు కూడా అదే పంథా కొనసాగిస్తున్నాడని తెలుస్తుంది.
రీసెంట్ గా సినిమాకు సంబంధించిన అప్డేట్ ని ఏ.ఐ టెక్నాలజీ వాడి చేసి షాక్ ఇచ్చాడు. స్పిరిట్ సినిమా అటెంప్ట్ కూడా ప్రభాస్ కెరీర్ లోనే డిఫరెంట్ అని టాక్. ముఖ్యంగా సందీప్ వంగ ఆ సినిమాలో రాసిన ఫ్లాష్ బ్యాక్ సీన్స్ అయితే రెబల్ ఫ్యాన్స్ ఎవరు సీట్లలో కూర్చోరని టాక్. వైల్డ్ క్యారెక్టర్ తో ప్రభాస్ వీర లెవెల్ చూపిస్తాడని అంటున్నారు.
ఫ్లాష్ బ్యాక్ లీక్స్ పై రెబల్ ఫ్యాన్స్ సూపర్ ఎగ్జైటెడ్..
ప్రభాస్ స్పిరిట్ సినిమాలో త్రిప్తి డిమ్రి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాకు హర్షవర్దన్ రామేశ్వరన్ మ్యూజిక్ అందిస్తున్నారు. సినిమా నుంచి మరిన్ని అప్డేట్స్ రావాల్సి ఉండగా ప్రభాస్ క్యారెక్టరైజేషన్, ఫ్లాష్ బ్యాక్ లీక్స్ పై రెబల్ ఫ్యాన్స్ అయితే సూపర్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు. చూస్తుంటే ప్రభాస్ స్పిరిట్ తో మరోసారి పాన్ ఇండియా షేక్ చేసే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. ఈ సినిమాను 2027 లో రిలీజ్ చేసేలా ప్లానింగ్ చేస్తున్నారట.
ప్రభాస్ కెరీర్ ఇప్పటివరకు బాహుబలి ముందు ఆ తర్వాత అన్నట్టు ఉంది. ఐతే సందీప్ వంగ స్పిరిట్ చేశాక ఇంతకన్నా ప్రభాస్ ఎలివేషన్స్ ఇచ్చే డైరెక్టర్ మరెవరు ఉండరు అనిపించేలా మెంటల్ ఎక్కించేస్తాడని అంటున్నారు. మరి సందీప్ వంగ ప్లానింగ్ ఏమో కానీ ఈ లీక్స్ ద్వారానే ఫ్యాన్స్ కి పూనకాలు వచ్చేస్తున్నాయి. ప్రభాస్ రాజా సాబ్ సినిమా 2027 సంక్రాంతికి రిలీజ్ లాక్ అయ్యింది. హను రాఘవపుడితో చేస్తున్న ఫౌజీ కూడా నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ రిలీజ్ ప్లాన్ ఉంది. ఈ రెండు సినిమాలతో రెబల్ స్టార్ బాక్సాఫీస్ పై మరోసారి తన మాస్ స్టామినా చూపించాలని ఫిక్స్ అయ్యాడు.
