Begin typing your search above and press return to search.

మెగా రెబల్ బీభత్సం.. థియేటర్లు ఏమవుతాయో..!

ఏంటి మెగాస్టార్ చిరంజీవి ఏంటి ప్రభాస్ సినిమాలో చేయడం ఏంటని షాక్ అవ్వొచ్చు. సందీప్ వంగ ఈ సినిమాలో చిరుని స్పెషల్ అప్పియరెన్స్ గా ప్లాన్ చేస్తున్నారట.

By:  Ramesh Boddu   |   28 Aug 2025 8:00 PM IST
మెగా రెబల్ బీభత్సం.. థియేటర్లు ఏమవుతాయో..!
X

సందీప్ వంగ నెక్స్ట్ బిగ్ వెంచర్ స్పిరిట్ పై ఒక్కో న్యూస్ ఆడియన్స్ కి సూపర్ హై ఇస్తుంది. రెబల్ స్టార్ ప్రభాస్ తో స్పిరిట్ మూవీ చేస్తున్న సందీప్ వంగ ఆ సినిమా విషయంలో పెద్ద ప్లానింగ్ తోనే వస్తున్నాడని అనిపిస్తుంది. సినిమాలో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో కనిపిస్తాడని తెలిసిందే. ఐతే ఈ సినిమాకు సంబంధించిన ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రెబల్ స్టార్ ప్రభాస్, సందీప్ వంగ కాంబోలో వస్తున్న స్పిరిట్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి కూడా నటిస్తారట.

ప్రభాస్ సినిమాలో చిరంజీవి..

ఏంటి మెగాస్టార్ చిరంజీవి ఏంటి ప్రభాస్ సినిమాలో చేయడం ఏంటని షాక్ అవ్వొచ్చు. సందీప్ వంగ ఈ సినిమాలో చిరుని స్పెషల్ అప్పియరెన్స్ గా ప్లాన్ చేస్తున్నారట. సందీప్ వంగ ఎంత పెద్ద మెగాస్టార్ చిరంజీవి అభిమానో తెలిసిందే. అతని ఆఫీస్ లో కూడా చిరంజీవి ఫోటో ఉంటుందంటే ఇక చెప్పాల్సింది ఏముంటుంది. అంతేకాదు చిరు సినిమాల ప్రభావం వల్లే తాను డైరెక్టర్ గా మారానని చెప్పాడు సందీప్ వంగ.

యానిమల్ సినిమా తర్వాత ప్రభాస్ తో సందీప్ వంగ చేస్తున్న స్పిరిట్ సినిమాలో స్పెషల్ క్యామియోస్ ప్లాన్ చేస్తున్నాడట. అదేంటి సందీప్ వంగ కూడా లోకేష్ కనకరాజ్ బాటలో వెళ్తున్నాడా అంటే.. అసలు కాదు పాత్రకు ఎలాంటి స్టార్ అవసరమో అలాంటి వాళ్లని తెస్తుంటాడు సందీప్ వంగ. ఊరకనే స్టార్ ని తీసుకుని నెట్టేసే టైప్ కాదు. యానిమల్ సినిమాతో అనిల్ కపూర్ కి మంచి రోల్ ఇచ్చాడు.

బాబీ డియోల్ మళ్లీ బిజీ స్టార్ అయ్యాడంటే..

అంతేకాదు బాబీ డియోల్ కి మరో లైఫ్ ఇచ్చాడు సందీప్ వంగ. యానిమల్ తర్వాత బాబీ డియోల్ మళ్లీ బిజీ స్టార్ అయ్యాడంటే అది ఆయన వల్లే. సో సందీప్ వంగ కథలో ఈ హీరో కావాలంటే ఆ హీరో ఇమేజ్ కి తగిన ఇంపార్టెన్స్ ఉంటుంది. అది సరే అసలు స్పిరిట్ లో చిరంజీవి రోల్ అంటే మాత్రం థియేటర్లు దద్దరిల్లిపోయాయి.

ఈ కాంబో కుదరడం అంత ఆషామాషీ విషయం కాదు. ఐతే క్యామియో అయినా చిరంజీవి కన్విన్స్ అయితే మాత్రం ఇక ఆ మెగా రెబల్ మూవీ రికార్డులకు అందరు సైడ్ అవ్వాల్సిందే. స్పిరిట్ లో మెగాస్టార్ బజ్ బాగున్నా అసలు ఇది జరిగే ఛాన్స్ ఎంతవరకు ఉంటుంది అన్నది చూడాలి. మరి మెగా కాంపౌండ్ నుంచి ఈ అప్డేట్స్ పై ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.