Begin typing your search above and press return to search.

'స్పిరిట్' కోసం 40 కోట్ల తో స్పెష‌ల్ సెట్!

తాజాగా `స్పిరిట్` షూటింగ్ కూడా అంతర్జాతీయ లోకేష‌న్స్ లో జ‌రుగుతోంది. ఇప్పటికే మెక్సికో లో కొన్ని స‌న్నివేశాలు కూడా ప్లాన్ చేసాడు.

By:  Srikanth Kontham   |   19 Feb 2026 8:00 PM IST
స్పిరిట్ కోసం 40 కోట్ల తో స్పెష‌ల్ సెట్!
X

సందీప్ రెడ్డి వంగా సెట్స్ వేయ‌డం కంటే? రియ‌ల్ లొకేష‌న్స్ పైనే ఎక్కువ‌గా ఆధార ప‌డ‌తాడు. రియ‌ల్ లొకేష‌న్ అయితే స‌న్నివేశంలో వాస్త‌విక‌త ఉంటుంద‌ని బ‌లంగా న‌మ్ముతాడు. వీలైనంత వ‌ర‌కూ అలాంటి వాతావ‌ర‌ణం కోస‌మే చూస్తాడు. త‌ప్ప‌ని ప‌క్షంలో సెట్స్ వేస్తుంటాడు. అలాగ‌ని సెట్స్ కి అత‌డేమి వ్య‌తిరేకం కాదు. గ‌తంలో ప‌ని చేసిన సినిమాల‌కు సెట్స్ వేసాడు. తొలి సినిమా `అర్జున్ రెడ్డి` సినిమాలోని మెడికల్ కాలేజీ సీన్లు, హౌస్ సీన్ల కోసం సెట్లు వేయకుండా, హైదరాబాద్‌లోని రియల్ బిల్డింగ్‌లలో షూటింగ్ చేశారు. ఆ స‌న్నివేశాలు తెర‌పై ఎంతో నేచుర‌ల్ గా పండాయి.

అలాగే `యానిమ‌ల్` సినిమా కోసం రణబీర్ కపూర్ ఇంటి బంగ్లా సీన్ల కోసం కూడా పక్కా ప్లానింగ్‌తో రియల్ లొకేషన్లను ఎంచుకున్నారు. ఇందులో ఆఫీస్ సెటప్ , కొన్ని కీలక సన్నివేశాల కోసం మాత్రమే అవసరమైన మేర సెట్లు నిర్మించారు. అలాగే సందీప్ సెట్ కంటే రియ‌ల్ సౌండింగ్ కి ఎక్కువ ప్రాధాన్య‌త ఇస్తాడు. సందీప్ షూటింగ్ చేసేటప్పుడు ఆ లొకేషన్‌లో వచ్చే సహజమైన శబ్దాలను రికార్డ్ చేస్తాడు. ఇది సినిమాలో వాస్త‌విక‌త‌ను పెంచుతుంద‌ని న‌మ్ముతాడు. సెట్స్ వేస్తే ఇలాంటి నేచుర‌ల్ అంబియెన్స్ రాద‌న్న‌ది అత‌డి న‌మ్మ‌కం.

తాజాగా `స్పిరిట్` షూటింగ్ కూడా అంతర్జాతీయ లోకేష‌న్స్ లో జ‌రుగుతోంది. ఇప్పటికే మెక్సికో లో కొన్ని స‌న్నివేశాలు కూడా ప్లాన్ చేసాడు. అయితే ఇది కాఫ్ స్టోరీ కావ‌డంతో అవ‌స‌రం మేర కొన్ని భారీ సెట్లు కూడా వేయిస్తున్నాడు. ఇప్పటికే పోలీస్ స్టేషన్ సెట్టింగ్స్ వేసి వాటిలో కొన్ని స‌న్నివేశాలు చిత్రీక‌రించారు.

ఈ నేప‌థ్యంలో తాజాగా మ‌రో భారీ సెట్ వేయించ‌డానికి రెడీ అవుతున్ట‌న్లు తెలిసింది. ఇందులో కీల‌క‌మైన యాక్ష‌న్ స‌న్నివేశాలు ప్లాన్ చేసాడుట‌. దీనిలో భాగంగా ఈ సెట్ నిర్మాణం కోసం దాదాపు 40 కోట్ల వ‌ర‌కూ బ‌ట్జెట్ కేటాయిస్తున్నారుట‌.

ప్ర‌భాస్ పై కొన్ని హంటింగ్ స‌న్నివేశాలు చిత్రీక‌రించాల్సి ఉందిట‌. దీనిలో భాగంగా ఔడ్ డోర్ లో షూటింగ్ క‌ష్ట‌మ‌వుతుంద‌ని భావించి సెట్ కు వెళ్తున్న‌ట్లు తెలిసింది. అదే నిజ‌మైతే సందీప్ కెరీర్ లో ఇదే భారీ సెట్ అవుతుంది. ఇంత వ‌ర‌కూ ఏ సినిమా సెట్ కు 40 కోట్లు కేటాయించ‌లేదు. అంతేకాదు ఇంత భారీ ఖ‌ర్చుతో సెట్లు కేవ‌లం కొన్ని సినిమాల‌కు మాత్ర‌మే వేస్తుంటారు. ప్ర‌త్యేకించి పీరియాడిక్ స్టోరీ నేప‌త్యం గ‌ల చిత్రాల‌కే సెట్ ప‌రంగా భారీగా ఖ‌ర్చు అవుతుంది. క‌మ‌ర్శియ‌ల్ చిత్రాల‌కు అన్ని కోట్లు ఖ‌ర్చు చేయ‌రు. కానీ సందీప్ రెడ్డి రాజీ ప‌డ‌టే టైపు కాదు. సీన్ పరంగా ఎంత ఖ‌ర్చు చేయాల‌న్నా? ఆలోచించ‌డు. తాను అనుకున్న విధంగా లోకేషన్ రావ‌డం కోసం ఎంతైనా ఖ‌ర్చు చేస్తాడు. ఈ నేప‌థ్యంలో `స్పిరిట్` సెట్ సినిమాలో హైలైట్ అవ్వ‌డం ఖాయం.