Begin typing your search above and press return to search.

యానిమ‌ల్‌కి మించి స్పిరిట్‌లో ఆ సీన్స్‌?

రౌడీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ, షాలిని పాండే జంట‌గా సందీప్ రెడ్డి వంగ రూపొందించిన సెన్సేష‌న‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ `అర్జున్‌రెడ్డి`.

By:  Ravindar Gorantla   |   15 April 2026 5:00 PM IST
యానిమ‌ల్‌కి మించి స్పిరిట్‌లో ఆ సీన్స్‌?
X

రౌడీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ, షాలిని పాండే జంట‌గా సందీప్ రెడ్డి వంగ రూపొందించిన సెన్సేష‌న‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ `అర్జున్‌రెడ్డి`. ఈ సినిమాలో లిప్ లాక్ సీన్‌లపై వివాదం చెల‌రేగ‌డం తెలిసిందే. అ త‌రువాత కూడా ఇందులోని ఇంటిమ‌సీ సీన్‌ల‌పై కూడా విమ‌ర్శ‌లొచ్చాయి. అయినా స‌రే సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద పాథ్ బ్రేకింగ్ బ్లాక్ బ‌స్ట‌ర్‌గా నిలిచి సంచ‌ల‌నం సృష్టించింది. హీరోగా విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు తిరుగులేని గుర్తింపుని తెచ్చి పెట్టింది. ద‌ర్శ‌కుడిగా సందీప్‌రెడ్డి వంగ‌కు క‌ల్ట్ మూవీస్ డైరెక్ట‌ర్‌గా పాపులారిటీని అందించింది.

ఈ సినిమాతో బాలీవుడ్‌కు వెళ్లిన సందీప్ దీన్నే అక్క‌డ `క‌బీర్‌సింగ్` పేరుతో చేసి అక్క‌డ కూడా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌తో పాటు కాంట్ర‌వ‌ర్సీల‌ని కూడా ఎదుర్కోవ‌డం తెలిసిందే. దీని త‌రువాత ర‌ణ్‌బీర్ క‌పూర్ క‌థానాయ‌కుడిగా చేసిన మూవీ `య‌నిమ‌ల్‌`, ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టించిన ఈ సినిమా తండ్రీ కొడుకుల ఎమోష‌న‌ల్ జ‌ర్నీ, తండ్రి కోసం పంతం ప‌ట్టిన ఎంత వ‌ర‌కైనా వెళ్లే కొడుకు స్టోరీగా దీన్ని సందీప్ తెర‌కెక్కించాడు. అయితే ఇందులో ర‌ష్మిక‌తో పాటు త్రిప్తి దిమ్రీతో ర‌ణ్‌వీర్ చేసిన ఇంట‌మసీ సీన్‌ల‌పై, ర‌ణ్‌బీర్ ఎక్స్‌ప్రెష‌న్స్‌పై కూడా విమ‌ర్శ‌లొచ్చాయి.

సందీప్ త‌న సినిమాల్లో లేడీస్‌ని కించ‌ప‌రుస్తున్నాడ‌ని ప‌లువురు విమ‌ర్శ‌లు గుప్పించారు. దీనిపై సందీప్ కూడా ఘాటుగానే స్పందించ‌డంతో `య‌నమ‌ల్‌` మూవీ నేష‌న‌ల్ వైడ్‌గా ట్రెండ్ అయింది. ప్ర‌స్తుతం సందీప్ పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌తో `స్పిరిట్‌` మూవీని రూపొందిస్తున్నాడు. త్రిప్తి దిమ్రి హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఇందులో ప్ర‌భాస్ ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా క‌నిపించ‌నున్నాడు.

కీల‌క‌మైన విల‌న్ క్యారెక్ట‌ర్‌లో వివేక్ ఓబెరాయ్ న‌టిస్తుండ‌గా, మ‌రో కీల‌క క్యారెక్ట‌ర్‌లో ప్ర‌కాష్ రాజ్ క‌నిపించ‌నున్నారు. ఇదిలా ఉంటే `అర్జున్‌రెడ్డి, యానిమ‌ల్ సినిమాల్లోని ఇంటిమ‌సీ సీన్‌ల‌తో హాట్ టాపిక్‌గా మారిన సందీప్ రెడ్డి వంగ మ‌రి `స్పిరిట్‌`లోనూ అలాంటి సీన్‌ల‌ని కంటిన్యూ చేస్తున్నాడా? అనే చ‌ర్చ జ‌రుగుతోంది. అయితే త్రిప్తి దిమ్రీని ఆ కార‌ణం వ‌ల్లే హీరోయిన్‌గా తీసుకున్నాడ‌ని, యానిమ‌ల్‌కి మించి ఇంటిమ‌సీ సీన్‌లు ఇందులో ఉంటాయ‌ని ఇన్ సైడ్ టాక్‌.

రెగ్యుల‌ర్ టెంప్లెట్ స్టోరీ టెల్లింగ్‌కి పూర్తి అవేగా క‌థ‌ల‌ని చెప్ప‌డంతో దిట్ట‌గా పేరు తెచ్చుకున్న సందీప్ రెడ్డి వంగ `స్పిరిట్‌`లోనూ మ‌రింత తీవ్ర‌మైన భావోద్వేగాల‌ని ఆవిష్క‌రిస్తున్నార‌ట‌. అంతే కాకుండా ఇంటిమ‌సీ సీన్‌ల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా మారిన వంగ ఈ మూవీలోనే అంత‌కు మించి అనే స్థాయిలో ఇంటిమ‌సీ సీన్‌లని డిజైన్ చేసిన‌ట్టుగా చెబుతున్నారు. ప్ర‌భాస్‌, త్రిప్తి దిమ్రీల‌పై వ‌చ్చే సీన్‌లు ఫ్యాన్స్ చేత థియేట‌ర్ల‌లో కేక‌లు పెట్టిస్థాయ‌ని తెలుస్తోంది. ప్ర‌భాస్ `రాధేశ్యామ్‌`లో పూజా హెగ్డేతో ఓ ఇంట‌మ‌సీ సీన్‌లు చేశారు. దానికి మించి వంగ మార్కు సీన్‌లు `స్పిరిట్‌`లో ఉంటాయ‌ని, ప్ర‌భాస్ నుంచి ఊహించ‌ని సీన్‌ల‌ని ఇందులో చూపించి సందీప్ రెడ్డి వంగ షాక్ ఇవ్వ‌బోతున్నాడ‌ని ఇన్ సైడ్ టాక్‌.