Begin typing your search above and press return to search.

'స్పిరిట్'లో మెగాస్టార్.. క్లారిటీ ఇచ్చినా ఆగని గాసిప్స్.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, క్రేజీ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో వస్తున్న 'స్పిరిట్' సినిమాపై రోజుకో వార్త నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

By:  M Prashanth   |   26 Jan 2026 12:05 PM IST
స్పిరిట్లో మెగాస్టార్.. క్లారిటీ ఇచ్చినా ఆగని గాసిప్స్.
X

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, క్రేజీ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో వస్తున్న 'స్పిరిట్' సినిమాపై రోజుకో వార్త నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాలో ఒక పవర్‌ఫుల్ క్యామియో రోల్ చేస్తున్నారనే వార్త సోషల్ మీడియాలో గట్టిగానే వైరల్ అవుతోంది. ప్రభాస్‌కు తండ్రిగా సుమారు 15 నిమిషాల పాటు చిరంజీవి కనిపిస్తారని, ఇది సినిమాకే హైలైట్ అవుతుందని రకరకాల కథనాలు పుట్టుకొస్తున్నాయి.

మెగాస్టార్‌తో సినిమా చేయాలనేది సందీప్ వంగా కల అని అందరికీ తెలిసిందే. ఆయన తన ఆఫీస్‌లో కూడా చిరంజీవి వింటేజ్ పోస్టర్‌ను పెట్టుకుని తన అభిమానాన్ని చాటుకున్నారు. ఈ క్రమంలోనే 'స్పిరిట్' వంటి భారీ ప్రాజెక్టులో చిరంజీవి కూడా ఉంటే బాక్సాఫీస్ లెక్కలు మారిపోతాయని ఫ్యాన్స్ ఊహించుకుంటున్నారు. అయితే ఈ అంచనాలు ఎంత పెరిగితే సినిమాకు అంత రిస్క్ అనే చర్చ కూడా నడుస్తోంది.

నిజానికి ఈ గాసిప్స్ పై సందీప్ రెడ్డి వంగా ఇదివరకే చాలా క్లియర్ గా క్లారిటీ ఇచ్చారు. ఒక సినిమా ప్రమోషన్ లో పాల్గొన్నప్పుడు ఈ ప్రశ్న ఎదురవ్వగా.. 'స్పిరిట్'లో మెగాస్టార్ ఉన్నారనేది కేవలం ఫేక్ న్యూస్ అని ఆయన తేల్చి చెప్పారు. ఒకవేళ మెగాస్టార్‌తో సినిమా చేసే అవకాశం వస్తే.. ఇలాంటి చిన్న పాత్రలు కాకుండా ఆయనతో ఒక సోలో ఫిల్మ్ చేస్తానని కూడా వంగా చాలా స్పష్టంగా తన మనసులోని మాటను బయటపెట్టారు.

దర్శకుడు అంత స్పష్టంగా చెప్పినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఈ గాసిప్స్ ఆగడం లేదు. కేవలం వ్యూస్ కోసం లేదా బజ్ క్రియేట్ చేయడం కోసం పాత వార్తలనే మళ్ళీ కొత్తగా సర్క్యులేట్ చేస్తున్నారు. గతంలో లోకేష్ కనగరాజ్ సినిమాల విషయంలో కూడా ఇలాగే అంచనాలు పెంచేసి చివరకు ఆడియన్స్ డిజప్పాయింట్ అయ్యేలా చేశారు. 'స్పిరిట్' విషయంలో కూడా అదే పునరావృతం కాకుండా ఉండాలంటే ఫ్యాన్స్ ఇలాంటి రూమర్లను నమ్మకపోవడమే మంచిది.

సందీప్ వంగా తన సినిమాల విషయంలో చాలా క్లారిటీగా ఉంటారు. ఏదైనా సర్ ప్రైజ్ ఉంటే అది థియేటర్లోనే చూపించాలని ఆయన కోరుకుంటారు. ప్రస్తుతానికి మెగాస్టార్ ఈ ప్రాజెక్టులో లేరన్నది వాస్తవం. ప్రభాస్ ఒక ఇంటెన్స్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్న ఈ సినిమా షూటింగ్ అప్‌డేట్స్ కోసం వెయిట్ చేయడమే ఉత్తమం. అనవసరమైన గాసిప్స్ సినిమా చూసే విధానాన్ని మార్చే ప్రమాదం ఉంది. ఇక సినిమాను 2027లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారు.