Begin typing your search above and press return to search.

​మార్వెల్ బ్రాండ్.. స్పైడర్ మ్యాన్ తీసుకొచ్చిన మార్పు!

హాలీవుడ్ లో ఒకప్పుడు మార్వెల్ నుంచి ఏ సినిమా వచ్చినా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ షేక్ అయిపోయేది.

By:  M Prashanth   |   31 July 2026 9:08 AM IST
​మార్వెల్ బ్రాండ్.. స్పైడర్ మ్యాన్ తీసుకొచ్చిన మార్పు!
X

హాలీవుడ్ లో ఒకప్పుడు మార్వెల్ నుంచి ఏ సినిమా వచ్చినా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ షేక్ అయిపోయేది. కానీ ఈమధ్య కాలంలో సూపర్ హీరో సినిమాలకు క్రేజ్ తగ్గింది అనే కామెంట్స్ గట్టిగా వినిపించాయి. ముఖ్యంగా ది మార్వెల్స్, ఆంట్ మ్యాన్ అండ్ ది వాస్ప్: క్వాంటమేనియా లాంటి చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాయి. దీంతో ఆడియన్స్ కు ఈ సూపర్ హీరో ఫార్మాట్ బోర్ కొట్టేసిందనే విమర్శలు ఎక్కువయ్యాయి. సరిగ్గా ఇలాంటి టైమ్ లో స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే సినిమా సాధించిన ఓపెనింగ్స్ ఆ విమర్శలకు చెక్ పెట్టాయి.

​గతంలో వచ్చిన కొన్ని చిత్రాలు డిజప్పాయింట్ చేయడంతో మార్వెల్ బ్రాండ్ ఇమేజ్ కాస్త డౌన్ అయిందనే టాక్ వినిపించిన మాట నిజమే. కానీ మిగతా సూపర్ హీరోలతో పోలిస్తే స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్ కి ఉన్న క్రేజ్ వేరు. ఈ కొత్త పార్ట్ లో ఏం చూపించబోతున్నారు అనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో మొదటి నుంచీ ఉంది. ఆ క్యూరియాసిటీయే ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర భారీ ఓపెనింగ్స్ రావడానికి మెయిన్ రీజన్ గా మారింది. భారతదేశంలో తొలిరోజే ఈ సినిమా సాధించిన 61 కోట్ల నెట్ కలెక్షన్స్ ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచాయి.

​గతంలో వచ్చిన అవెంజర్స్ ఎండ్ గేమ్ పేరిట ఉన్న బిగ్గెస్ట్ ఓపెనింగ్ రికార్డును సైతం ఈ చిత్రం దాటేసింది. సాధారణంగా వర్కింగ్ డే అయిన గురువారం రోజే థియేటర్లలోకి వచ్చి ఈ స్థాయిలో వసూళ్లు రాబట్టడం విశేషం. కేవలం మల్టీప్లెక్స్ లలోనే కాకుండా చిన్న టౌన్లలోని సింగిల్ స్క్రీన్స్ లో కూడా హౌస్ ఫుల్ బోర్డులు కనిపించాయి. చిన్నపిల్లల నుంచి యూత్ వరకు ఈ ఫ్రాంచైజీపై ఉన్న ఆసక్తే ఈ ఫస్ట్ డే రికార్డుకు కారణం.

​అడ్వాన్స్ బుకింగ్స్, ఫస్ట్ డే క్యూరియాసిటీతో ఈ రేంజ్ లో ఓపెనింగ్స్ రావడం ఒకెత్తయితే, ఈ సినిమా మార్కెటింగ్ స్ట్రాటజీ కూడా బాగా వర్కౌట్ అయింది. ఇండియాలోని అన్ని ప్రధాన భాషల్లో డబ్బింగ్ చేసి గ్రాండ్ గా రిలీజ్ చేయడం వీకెండ్ కి ముందే భారీ వసూళ్లను సాధించడానికి హెల్ప్ అయింది. ప్రచారంతో జనాల్లో హైప్ క్రియేట్ చేయడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారు.

​అంతేకాకుండా హాలీవుడ్ కంటెంట్ కు ఇండియాలో పెరుగుతున్న మార్కెట్ కు ఈ సినిమా వసూళ్లే మళ్ళీ దైర్యం ఇచ్చాయి. గత కొన్ని సినిమాల ఫలితాల వల్ల మార్వెల్ ఫేజ్ లో కాస్త స్లోడౌన్ వచ్చినప్పటికీ, స్పైడర్ మ్యాన్ లాంటి పవర్ ఫుల్ బ్రాండ్ తో మళ్లీ ఆడియన్స్ ను థియేటర్లకు రప్పించగలిగారు. ఫస్ట్ డే వసూళ్ల లెక్కలు చూస్తే సూపర్ హీరో సినిమాలపై జనాల్లో ఇంకా ఇంట్రెస్ట్ తగ్గలేదని అర్థమవుతోంది. ​ఈ మైండ్ బ్లాకింగ్ ఓపెనింగ్స్ తో మార్వెల్ ఫ్రాంచైజీకి మళ్లీ మంచి హైప్ వచ్చినట్లే కనిపిస్తోంది. అయితే ఈ మొదటి రోజు క్యూరియాసిటీ కలెక్షన్లు రాబోయే రోజుల్లో కూడా ఇలాగే కొనసాగుతాయా లేదా అనేది చూడాలి.