Begin typing your search above and press return to search.

ఫ్రాంచైజ్ కల్ట్ పవర్ అంటే ఇదే… ఒక్క పేరుతోనే థియేటర్లపై దండయాత్ర!

By:  Madhu Reddy   |   29 July 2026 3:41 PM IST
ఫ్రాంచైజ్ కల్ట్ పవర్ అంటే ఇదే… ఒక్క పేరుతోనే థియేటర్లపై దండయాత్ర!
X

ఈ గురువారం విడుదల కాబోతున్న ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ సినిమా క్రేజ్ చూసి బాక్సాఫీస్ వర్గాలు షాక్ అవుతున్నాయి. ప్రత్యేకంగా ప్రచారాలు చేయకపోయినా సరే, 'స్పైడర్ మ్యాన్' అనే ఒకే ఒక్క బ్రాండ్ నేమ్‌తో భారతదేశంలో అడ్వాన్స్ బుకింగ్స్‌లో రికార్డులు క్రియేట్ అవ్వడం హాలీవుడ్ సూపర్ హీరోలకున్న గ్లోబల్ డిమాండ్‌ను ప్రతిబింబిస్తోంది. హైదరాబాద్ మల్టీప్లెక్స్‌లలో ఎమ్మెల్యేలు సిఫార్సు చేసినా టికెట్లు దొరకని పరిస్థితి ఉందంటే ఈ సాలీడు మనిషి మేనియా ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

బాక్సాఫీస్ వద్ద తుఫాన్ కలెక్షన్లు ఖాయం:

ఈ సిరీస్ లో సినిమాలు రావడం కొత్త కాకపోయినా, ఈసారి అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తుంటే హైప్ మామూలుగా లేదు. మొదటి రోజే ఇండియా వ్యాప్తంగా రూ. 30 కోట్ల నుంచి రూ. 50 కోట్లు లేదా అంతకుమించి భారీ ఓపెనింగ్స్ సాధించడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక ఇటీవల పెద్దగా విజువల్ గ్రాండియర్స్ ఏవీ థియేటర్లలోకి రాకపోవడంతో, గ్రాండ్ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ కోసం సినీ ప్రియులు ఈ సినిమాపై విపరీతంగా ఎగబడుతున్నారు.

ఇతర సినిమాలకు పొంచి ఉన్న ముప్పు:

స్పైడర్ మ్యాన్ జోరు చూసి మిగతా సినిమాల నిర్మాతలు టెన్షన్‌ పడుతున్నారు. పాజిటివ్ టాక్‌తో నడుస్తున్న ‘చెన్నై లవ్ స్టోరీ’కి ఏ-సెంటర్లలో ఈ హాలీవుడ్ బొమ్మ నుంచి గట్టి పోటీ ఎదురుకానుంది. ఇక టాక్ బాగున్నా సరే, క్లాస్, మాస్ తేడా లేకుండా అధిక శాతం జనం స్పైడర్ మ్యాన్ షోలకే క్యూ కట్టేలా ఉన్నారు.

కొత్త సినిమాలపై తీవ్ర ప్రభావం:

ఈ హాలీవుడ్ దండయాత్ర ప్రభావం కొత్తగా వస్తున్న సినిమాలపైనా పడేలా ఉంది. జయకృష్ణ ఘట్టమనేని అరంగేట్ర చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’ టీమ్ కంటెంట్‌పై నమ్మకంతో వస్తున్నప్పటికీ, స్పైడర్ మ్యాన్ వేవ్‌ను తట్టుకోవడం సవాలుగా మారింది. సుమంత్ నటించిన ‘న్యూటన్ థర్డ్ లా’కి కూడా ఇదే సమస్య ఎదురుకానుంది. అందుకేనేమో ఈ క్రేజ్ ఊహించే బాలీవుడ్ పెద్ద సినిమాలేవీ ఈ వారంలో రేసులో లేకుండా జాగ్రత్త పడ్డాయి.

'ది ఒడిస్సీ'ని మించేలా అరాచకం:

గతంలో 'ది ఒడిస్సీ' వంటి స్లో యాక్షన్ డ్రామానే మన దేశంలో కేవలం పది రోజుల్లో రూ. 100 కోట్లు కొల్లగొట్టింది. అలాంటిది ఇండియాలో భారీ ఫ్యాన్ బేస్ ఉన్న 'స్పైడర్ మ్యాన్' సినిమాకు గనక పాజిటివ్ టాక్ వస్తే బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోయడం ఖాయం. హాలీవుడ్ ఫ్రాంచైజ్ కల్ట్ పవర్ అంటే ఏంటో ఈ సినిమా మరోసారి నిరూపిస్తోంది.

బిగ్ స్క్రీన్‌పై సాలీడు మనిషి రచ్చ:

ఎలాంటి ప్రమోషన్లు లేకపోయినా బ్రాండ్ నేమ్‌తోనే బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఒక్క స్పైడర్‌మ్యాన్‌కే చెల్లింది. థియేటర్లలో ఈ హాలీవుడ్ వండర్ సృష్టిస్తున్న విజువల్ హంగామా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి కొత్త రికార్డులను తిరగరాస్తుందో చూడాలి.