ఇండియాలో టాప్ 5 హాలీవుడ్ మూవీస్.. స్పైడర్ మ్యాన్ లెక్క ఎలా ఉందంటే..
బాక్సాఫీస్ దగ్గర రికార్డులు క్రియేట్ అయ్యేదే బ్రేక్ అవ్వడానికి అన్నట్టుగా ఉంది టామ్ హాలండ్ స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే సినిమా కలెక్షన్స్ జోరు.
By: M Prashanth | 5 Aug 2026 7:03 PM ISTబాక్సాఫీస్ దగ్గర రికార్డులు క్రియేట్ అయ్యేదే బ్రేక్ అవ్వడానికి అన్నట్టుగా ఉంది టామ్ హాలండ్ స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే సినిమా కలెక్షన్స్ జోరు. జూలై 30న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా అటు గ్లోబల్ మార్కెట్ తో పాటు ఇటు ఇండియాలో కూడా బాక్సాఫీస్ ను ఒక ఊపు ఊపేస్తోంది. అసలు ఏమాత్రం అంచనాలకు అందని రేంజ్ లో వసూళ్లను అందుకుంటూ ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది.
మొదటి రోజు నుంచే ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. అవెంజర్స్: ఎండ్ గేమ్ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేసి, ఇండియాలో ఒక నాన్ ఇండియన్ సినిమాకు అత్యధిక ఓపెనింగ్ డే కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా చరిత్ర సృష్టించింది. రిలీజ్ అయిన తొలి రోజే ఏకంగా 72.44 కోట్ల రూపాయల గ్రాస్, అంటే 60.60 కోట్ల నెట్ వసూలు చేసి అందరి మైండ్ బ్లాక్ అయ్యేలా చేసింది.
ఈ జోరు గ్లోబల్ వైడ్ గా ఇంకా గట్టిగా ఉంది. ఆరు రోజుల్లోనే 1.05 బిలియన్ డాలర్లు అంటే దాదాపు 9,900 కోట్ల రూపాయలు రాబట్టి బిలియన్ డాలర్ల క్లబ్ లో అడుగుపెట్టింది. ఎండ్ గేమ్ 5 రోజుల్లో ఈ ఫీట్ సాధిస్తే, ఆ తర్వాత అంత ఫాస్ట్ గా ఆ మార్క్ చేరుకున్న రెండో సినిమాగా స్పైడర్ మ్యాన్ నిలిచింది. అవెంజర్స్ లాగా మల్టీ స్టారర్ కాకుండా ఒక సింగిల్ సూపర్ హీరోతో ఈ ఫీట్ సాధించడం మామూలు విషయం కాదు. ఆగస్టు 5 నాటికి ఇండియాలో కూడా 362.61 కోట్ల గ్రాస్, 303.25 కోట్ల నెట్ కలెక్ట్ చేసింది.
ఇండియాలో అత్యధిక నెట్ కలెక్షన్స్ సాధించిన హాలీవుడ్ సినిమాలు
అవతార్: ది వే ఆఫ్ వాటర్ (2022) - 390.60 కోట్లు
అవెంజర్స్: ఎండ్ గేమ్ (2019) - 373.22 కోట్లు
స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే (2026) - 303.25 కోట్లు*
అవెంజర్స్: ఇన్ఫినిటీ వార్ (2018) - 227.43 కోట్లు
స్పైడర్ మ్యాన్: నో వే హోమ్ (2021) - 212.00 కోట్లు
ఈ టాప్ 5 నంబర్స్ గమనిస్తే ఇండియాలో హాలీవుడ్ సినిమాలు 300 కోట్ల నెట్ మార్క్ దాటడం అనేది ఎంత కష్టమో అర్థం అవుతుంది. కానీ ఈ కొత్త స్పైడర్ మ్యాన్ మాత్రం ఇండియన్ మార్కెట్ లో ఆ 300 కోట్ల క్లబ్ ను అత్యంత వేగంగా చేరుకున్న హాలీవుడ్ సినిమాగా రికార్డ్ సెట్ చేసింది. ఆడియన్స్ ను అంతలా థియేటర్లకు రప్పిస్తూ దూసుకుపోతోంది.
ఇంటర్నేషనల్ లెవెల్ తో పాటు మన దగ్గర కూడా టికెట్ సేల్స్ ఈ స్థాయిలో జరుగుతున్నాయి అంటే టామ్ హాలండ్ సూపర్ హీరో క్యారెక్టర్ కు ఉన్న క్రేజ్ ఎలాంటిదో ఇట్టే తెలుస్తోంది. ఇదే ఊపు కంటిన్యూ అయితే టాప్ లో ఉన్న అవతార్ 2 రికార్డును కూడా స్పైడర్ మ్యాన్ బ్రేక్ చేసే ఛాన్స్ గట్టిగానే కనిపిస్తోంది.
