బాలయ్యకి చక్రవర్తి అనుకుంటే బాలు మ్యూజిక్
ఎస్పీ బాలు కేవలం గాయకుడు మాత్రమే కాదు డబ్బింగ్ ఆర్టిస్ట్, మ్యూజిక్ డైరెక్టర్. ఆయన తన కెరీర్ మొత్తంలో యాభై సినిమాలకు పైగా సంగీత దర్శకత్వం వహించారు.
By: Satya P | 5 April 2026 9:36 AM ISTఎస్పీ బాలు కేవలం గాయకుడు మాత్రమే కాదు డబ్బింగ్ ఆర్టిస్ట్, మ్యూజిక్ డైరెక్టర్. ఆయన తన కెరీర్ మొత్తంలో యాభై సినిమాలకు పైగా సంగీత దర్శకత్వం వహించారు. అందులో మెగాస్టార్ చిరంజీవి బాలకృష్ణ, నాగార్జున వంటి స్టార్లకు కూడా మ్యూజిక్ చేసి హిస్టరీ క్రియేట్ చేశారు. అయితే మాస్ హీరోలకు ఎస్పీబీ మాస్ టచ్ ఇస్తూ క్లాస్ మ్యూజిక్ ఇవ్వడం విశేషం. ఆ పాటలు కూడా జనాదరణ పొందాయి. ఇదిలా ఉంటే బాలయ్య వంటి పక్కా మాస్ హీరోకి ఎస్పీబీ మ్యూజిక్ చేయడం అంటే అది పెద్ద విశేషమే అని చెప్పాలి. అది ఎలా జరిగింది, ఏమిటి అంటే వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్లాష్ బ్యాక్ గా ఉంటుంది.
చక్రవర్తి ప్లేస్ లోకి :
సురేష్ ప్రొడక్షన్స్ బాలయ్యతో మొదటిసారిగా కధానాయకుడు మూవీని తీసి సూపర్ హిట్ కొట్టింది. అది జరిగిన తరువాత రెండవ ప్రయత్నంగా రాము అని కుటుంబ కధా చిత్రం మాస్ యాక్షన్ మిక్స్ చేసి తీసింది. ఈ మూవీకి వై నాగేశ్వరరావు డైరెక్టర్. ఇక శారద, జగ్గయ్య సత్యనారాయణ సహా టాప్ మోస్ట్ తారాగణం ఈ మూవీలో నటించారు. హీరోయిన్ గా రజని ని ఫిక్స్ చేశారు. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా మొదట చక్రవర్తిని అనుకున్నారు. ఎందుకంటే 1980 తరువాత నుంచి సురేష్ ప్రొడక్షన్స్ కి చక్రవర్తి ఆస్థాన సంగీత దర్శకుడిగా ఉంటూ వచ్చారు. ఇక ఈ సినిమాకు ఆయన్నే అనుకోవడం ఆయన సైతం ఓకే చెప్పడం జరిగిపోయాయి.
బిజీగా ఉండడంతో :
ఇక ఈ సినిమాకు సంబంధించి చక్రవర్తి సరేనని చెప్పినా బిజీ కారణంగా పని చేయలేకపోయారు. దాంతో మ్యూజిక్ కి ఎవరిని అనుకుంటున్న సమయంలో ఎస్పీ బాలుకే ఆ చాన్స్ ని చివరికి ఇచ్చారు. బాలూ అప్పటికే మయూరి వంటి క్లాసికల్ మూవీకి సంగీతం సమకూర్చి నంది అవార్డును గెలుచుకున్నారు. దాంతో పాటు చిరంజీవి మగధీరుడు సినిమాకు కూడా మ్యూజిక్ చేసి స్టార్లకు సైతం రెడీ అన్నట్లుగా జోరు చూపించారు. దాంతో బాలయ్య మూవీకి కూడా అలా అనూహ్యంగా చాన్స్ వచ్చింది.
పాటలు హిట్ :
ఇక బాలూ ఈ సినిమాకు మంచి సంగీతమే అందించారు. అందులో వానేమి చేస్తుందిలే అంటూ సాగే రైనీ మాస్ సాంగ్ కి క్యాచీ ట్యూన్స్ ఇచ్చి ఎవర్ గ్రీన్ గా ఆ సాంగ్ ని నిలబెట్టారు. ఇక మిగిలిన సాంగ్స్ కూడా బాలయ్య సినిమాల స్థాయి తగ్గకుండానే మంచి మ్యూజిక్ అందించి ఆ చిత్ర విజయంలో భాగం అయ్యారు. అయితే బాలయ్య వంటి మాస్ హీరోకి బాలు సంగీతమా అని ఆయన ఫ్యాన్స్ అయితే మొదట్లో డౌట్ వ్యక్తం చేసినా చివరికి ఆడియో మంచి హిట్ కావడం సినిమాలో కూడా పాటలు అన్నీ సన్నివేశానికి తగినట్లుగా కుదరడంతో ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇక రాము మూవీ వంద రోజులు పూర్తి చేసుకుని బాలయ్య కెరీర్ లో మరో మంచి చిత్రంగా నిలిచింది. అయితే ఆ తరువాత ఎందుకో బాలయ్య బాలూ మ్యూజిక్ కాంబోలో మరో మూవీ రాకపోవడం విశేషమే అని అంతా అంటారు.
