Begin typing your search above and press return to search.

విలాస‌వంత‌మైన బంగ్లాను అద్దెక్కిచ్చి మ‌రో ఇంట్లోకి!

సెల‌బ్రిటీలు విలాస‌వంత‌మైన బంగ‌ళాల్లో జీవించ‌డం స‌హ‌జం. త‌మ స్థాయికి త‌గ్గ‌ట్టు జీవితాన్ని గ‌డుపు తుంటారు.

By:  Srikanth Kontham   |   11 Sept 2025 5:00 AM IST
విలాస‌వంత‌మైన బంగ్లాను అద్దెక్కిచ్చి మ‌రో ఇంట్లోకి!
X

సెల‌బ్రిటీలు విలాస‌వంత‌మైన బంగ‌ళాల్లో జీవించ‌డం స‌హ‌జం. త‌మ స్థాయికి త‌గ్గ‌ట్టు జీవితాన్ని గ‌డుపు తుంటారు. ఈ క‌ల్చ‌ర్ ఎక్కువ‌గా బాలీవుడ్ సెల‌బ్రిటీల్లో క‌నిపిస్తుంది. కానీ ద‌క్షిణాది న‌టులు మాత్రం చాలా సింపుల్ గానే లైఫ్ ని లీడ్ చేస్తుంటారు. స్థాయిని చెప్పుకునే ప్ర‌య‌త్నాలు ఎక్క‌డా చేయ‌రు. చిరంజీవి, బాల‌కృష్ణ‌, వెంక‌టేష్‌, నాగార్జున ఇలా సీనియ‌ర్ హీరోల నుంచి మ‌హేష్‌, ఎన్టీఆర్, బ‌న్నీ , ప్ర‌భాస్ ఇలా త‌ర్వాత త‌రం హీరోల వ‌ర‌కూ సింపుల్ గానే క‌నిపిస్తారు. ఇళ్ల పేరిట పెద్ద పెద్ద భ‌వంతులు నిర్మించ‌రు.

విలాస‌వంత‌గా ఉండ‌టం కంటే సౌక‌ర్యం ఉంటే చాల‌నుకుంటారు. అటు కోలీవుడ్, మాలీవుడ్, శాండిల్ వుడ్ ఇలా ఏ న‌టుల ఇళ్ల గురించి మాట్లాడినా? షారుక్ ఖాన్ మ‌న్న‌తలా ఎవ‌రి భ‌వంతి హైలైట్ కాదు. తాజాగా రాధికా శ‌ర‌త్ కుమార్ కూడా ఓ పెద్ద భవంతిని వ‌దిలేసి చిన్న ఇంట్లోకి షిప్ట్ అయిన‌ట్లు తెలిపారు. ఈ దంద‌తుల‌కు చెన్నై ఈసీఆర్ లో విలాస‌వంత‌మైన భ‌వంతి ఉంది. 15వేల చ‌ద‌ర‌పు అడుగుల్లో విస్త‌రిం చింది ఉంది. ఆ ఇంటికి ఏడు ద్వారాలున్నాయి. కొన్నేళ్ల‌గా అందులోనే నివ‌సిస్తున్నారు.

కానీ ఇంట్లో ఉందేది రాధికా-శ‌ర‌త్ కుమార్ మాత్ర‌మే కావ‌డంతో? ఆ ఇంటిని వీడాల‌ని నిర్ణ‌యించు కున్నా రు. ఇంట్లో 15 మంది మంది పని వాళ్లు ఉన్నా? రోజు ఇంటిని చూసుకోవ‌డం, రాత్రి స‌మ‌యంలో ఆ ద్వారాల‌ వ‌ద్ద ఉన్న త‌లుపుకు గ‌డియ‌లు పెట్ట‌డం ఇబ్బందిగా మారుతుంద‌ని శ‌ర‌త్ కుమార్ తెలిపారు. పిల్ల‌ల‌కు పెళ్లిళ్లు అయి పోవ‌డం..కోడుకు కూడా విదేశాల్లో ఉండ‌టంతో అంత పెద్ద ఇంట్లో ఇద్ద‌రు ఉండ టం కూడా అయిష్టంగా పేర్కొన్నారు. ఆ కార‌ణంగా ఓ సాప్ట్ వేర్ కంపెనీకి ఇంటిని అద్దెకిచ్చేసినట్లు తెలిపారు.

ప్ర‌స్తుతం రాధికా శ‌ర‌త్ కుమార్ ఇద్ద‌రూ సినిమాల‌తో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. త‌మిళ చిత్రాల‌తో పాటు, తెలుగు సినిమాల్లోనూ న‌టిస్తున్నారు. ఇంకా ఇత‌ర భాష‌ల్లో అవ‌కాశాలు వ‌చ్చినా ప‌ని చేస్తున్నారు. త‌ల్లిదండ్రులుగా పిల్ల‌ల‌కు అన్నిర‌కాల బాధ్య‌త‌లు నెర‌వేర్చారు. క‌లిసి సినిమాలు చేయ‌డం, అప్పు డ‌ప్ప‌డు డెకేష‌న్ల‌కు వెళ్ల‌డం వంటి వాటితో జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు.