Begin typing your search above and press return to search.

ఇండస్ట్రీని రూల్ చేస్తున్న హీరోయిన్స్.. సింగిల్ మూవీతో రికార్డ్స్ బ్రేక్!

సినిమా ఇండస్ట్రీలో కేవలం హీరోలు మాత్రమే బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయగలరనే రోజులు ఎప్పుడో పోయాయి.

By:  Madhu Reddy   |   7 July 2026 4:00 AM IST
ఇండస్ట్రీని రూల్ చేస్తున్న హీరోయిన్స్.. సింగిల్ మూవీతో రికార్డ్స్ బ్రేక్!
X

సినిమా ఇండస్ట్రీలో కేవలం హీరోలు మాత్రమే బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయగలరనే రోజులు ఎప్పుడో పోయాయి. ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో హీరోయిన్లు కూడా తమ లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో వందల కోట్ల వసూళ్లు రాబడుతూ బాక్సాఫీస్ దగ్గర తిరుగులేని రూలింగ్ చూపిస్తున్నారు. 'లోక' సినిమా రికార్డు కలెక్షన్ల నుండి రీసెంట్ ‘మా ఇంటి బంగారం’ వరకు, మహిళా ప్రధాన చిత్రాలు ఎంతగా కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయో తెలిపే ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం..

బాక్సాఫీస్ టాప్‌లో 'లోకః' రికార్డ్ ర్యాంపేజ్:

ఈ జాబితాలో అస్సలు ఊహించని రేంజ్‌లో రికార్డులను బద్దలు కొడుతూ అగ్రస్థానంలో నిలిచింది ‘లోక’ చిత్రం. ఇక ఈ సినిమా ఏకంగా రూ. 302 కోట్ల భారీ వసూళ్లను రాబట్టి నంబర్ వన్ పొజిషన్‌లో నిలిచింది. లేడీ ఓరియంటెడ్ సినిమాలకు మార్కెట్ ఎంత స్ట్రాంగ్‌గా ఉందో చెప్పడానికి ఈ కలెక్షన్ల ర్యాంపేజ్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్.

మహానటి మ్యాజిక్.. సమంత దూకుడు:

మరోవైపు, కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో వచ్చిన బయోపిక్ డ్రామా ‘మహానటి’ రూ. 85 కోట్లతో తెలుగు రీజియన్‌లో ఏడేళ్ల పాటు టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఇక రీసెంట్‌గా వచ్చిన సమంత యాక్షన్ అండ్ ఫ్యామిలీ డ్రామా ‘మా ఇంటి బంగారం’ థియేటర్లలో పూనకాలు తెప్పిస్తూ రూ. 82 కోట్లు పైన రాబట్టి ఇంకా స్టిల్ రన్ అవుతుంది. ఇక టాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన సోలో ఫిమేల్ సెంట్రిక్ చిత్రంగా ఇది సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. వీటితో పాటు మలయాళ చిత్రం ‘సూక్ష్మదర్శిని’ కూడా రూ. 54 కోట్లతో గట్టి పోటీ ఇస్తోంది.

లేడీ సూపర్ స్టార్ అనుష్క ట్రిపుల్ ధమాకా:

టాలీవుడ్‌లో లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ ఎవరంటే అందరికీ గుర్తొచ్చే పేరు అనుష్క శెట్టి. ఈ లీడర్‌బోర్డ్‌లో ఆమె ఏకంగా మూడు భారీ హిట్లతో తన పవర్‌ను నిరూపించుకుంది. కాకతీయ సామ్రాజ్య నేపథ్యంతో వచ్చిన హిస్టారికల్ డ్రామా ‘రుద్రమదేవి’ రూ. 81 కోట్లు, అప్పట్లోనే ఓపెనింగ్స్ పరంగా బెంచ్‌మార్క్ సెట్ చేసిన కల్ట్ క్లాసిక్ హారర్ ‘అరుంధతి’ రూ. 68 కోట్లు, మరియు సస్పెన్స్ థ్రిల్లర్ ‘భాగమతి’ రూ. 65 కోట్లు వసూలు చేశాయి. ఇక ఈ మూడు సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర తనకు ఎవరూ సాటి లేరని అనుష్క ప్రూవ్ చేసింది.

కలెక్షన్ల రేసులో తగ్గేదే లే:

ఒకప్పుడు కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం అనుకున్న హీరోయిన్లు.. ఇప్పుడు వన్-మెన్ షోలా సినిమాలను తమ భుజాల మీద వేసుకుని నడిపిస్తున్నారు. కథ నచ్చితే ఆడియన్స్ థియేటర్లకు భారీగా తరలివస్తారని ఈ సినిమాల సక్సెస్ నిరూపించింది. ఇక హీరోల సినిమాలకు ఏమాత్రం తీసిపోకుండా, కలెక్షన్ల రేసులో తాము కూడా ‘రూలర్స్’ అని నిరూపిస్తున్న మన సౌత్ హీరోయిన్స్ నటనకు, వారి స్టార్ పవర్‌కు నిజంగా హాట్సాఫ్ చెప్పాల్సిందే..