కొత్త సినిమాల ఓపెనింగ్స్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూపులు!
ప్రస్తుతం టాలీవుడ్ ఇతర సౌత్ ఇండస్ట్రీలలోని పలువురు అగ్ర హీరోల కొత్త సినిమాల ప్రారంభోత్సవాలు.. అధికారిక ప్రకటనల కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
By: Srikanth Kontham | 5 Aug 2026 2:55 PM ISTటాలీవుడ్ నుంచి శాండల్‌వుడ్ వరకు ఉన్న స్టార్ హీరోల సినిమాల కోసం అభిమానులు ఎప్పుడూ ఆసక్తిగా ఎదరు చూస్తుంటారు. స్టార్ హీరోల తాజా చిత్రాలు విడుదలైన వెంటనే.. వారి తదుపరి ప్రాజెక్ట్‌లు ఎప్పుడు ప్రారంభమ వుతాయనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంటుంది. ప్రస్తుతం టాలీవుడ్ ఇతర సౌత్ ఇండస్ట్రీలలోని పలువురు అగ్ర హీరోల కొత్త సినిమాల ప్రారంభోత్సవాలు.. అధికారిక ప్రకటనల కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో పలువురు స్టార్ హీరోల లైనప్ ..వారి తదుపరి చిత్రాల అప్‌డేట్స్ హాట్ టాపిక్‌గా మారాయి.
యువ హీరో అఖిల్ ఇటీవలే `లెనిన్` చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి తనదైన శైలిలో అలరించారు. ఈ సినిమా తర్వాత అఖిల్ కెరీర్‌లో అత్యంత విభిన్నమైన కథాంశాన్ని ఎంచుకునే పనిలో ఉన్నారు. అఖిల్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏ దర్శకుడితో ఉండబోతుంది? ఆ సినిమా లాంచింగ్ ఎప్పుడు ఉంటుందనే విషయాలపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. యువ హీరో నుంచి రాబోయే తదుపరి చిత్రంపై ఇండస్ట్రీలోనూ అభిమానుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విషయానికి వస్తే ఇటీవలే 'పెద్ది' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద ప్రత్యేకతను చాటుకున్నారు. ఆ సినిమా ఇచ్చిన జోరుతో చరణ్ తదుపరి సినిమాల లైనప్‌ను వ్యూహాత్మకంగా ప్లాన్ చేస్తున్నారు. సుకుమార్ తో ఇప్పటికే ప్రాజెక్ట్ లాక్ అయింది. కానీ ప్రారంభోత్సవం జరగలేదు. చరణ్ చేతికి గాయం కావడంతో ఎనిమిది వారాల పాటు విశ్రాంతి తీసుకుంటారు. అనంతరం ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. అంత వరకూ ఫ్యాన్స్ కు ఎదురు చూపులు తప్పవు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయ బాధ్యతలతో పాటు వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూనే వస్తున్నారు. ఆయన లైనప్‌లో ఉన్న చిత్రాలు వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయి. అయితే పవన్ కళ్యాణ్ నటించాల్సిన కొత్త సినిమాల పూర్తి స్థాయి షెడ్యూల్స్ .. వాటి తదుపరి అప్‌డేట్స్ ఎప్పుడు వస్తాయా ? అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రాజకీయాలతో పాటు సినిమా రంగంలోనూ పవన్ వేగంపై అందరి దృష్టి ఉంది.
శాండల్‌వుడ్ రాకింగ్ స్టార్ యశ్ `టాక్సిక్` చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి వేగంగా సిద్ధమవుతున్నారు. ఈ సినిమాపై పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు ఉన్నాయి. గీతు మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం తర్వాత యశ్ చేయబోయే కొత్త ప్రాజెక్ట్స్ ఏంటి? నెక్స్ట్ లైనప్ ఎలా ఉండబోతుందనే దానిపై కన్నడతో పాటు తెలుగు, హిందీ పరిశ్రమల్లో ఉత్కంఠ నెలకొంది. అలాగే బాలీవుడ్ రామాయణంలో రావణాసురడి పాత్ర ను యష్ పోషించడంతో? ఆ పాత్రలో ఎంత గొప్పగా ఒదిగిపోయారు? అన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఈ సినిమా విజయం సాధిస్తే యశ్ ఇమేజ్ అంతకంతకు రెట్టింపు అవుతుంది.
