Begin typing your search above and press return to search.

రూ.500 కోట్ల క్లబ్.. ఇప్పటి వరకు సౌత్ మూవీస్ ఎన్నంటే?

అయితే ప్రతిష్ఠాత్మక రూ.500 కోట్ల క్లబ్ లో ఇప్పటికే వివిధ దక్షిణాది సినిమాలు చేరాయి. అరుదైన మార్క్ ను అందుకున్నాయి.

By:  M Prashanth   |   1 Sept 2025 12:00 PM IST
రూ.500 కోట్ల క్లబ్.. ఇప్పటి వరకు సౌత్ మూవీస్ ఎన్నంటే?
X

రూ.500 కోట్లు.. రూ.1000 కోట్ల క్లబ్.. ఇప్పుడు చాలా మంది స్టార్ హీరోలు తమ సినిమాలతో వాటిలో చేరాలని టార్గెట్ ను పెట్టుకుంటున్నట్టు కనిపిస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద తాము నటించిన చిత్రాలు.. భారీ వసూళ్లు సాధించాలని కోరుకుంటున్నారు. కానీ కొందరు అనుకున్నట్లు సాధిస్తున్నారు. మరికొందరు నిరాశ పరుస్తున్నారు.

అదే సమయంలో ఇప్పుడు సౌత్ సినిమాల లెక్క.. ఒకప్పుడు వేరు.. ఇప్పుడు వేరు. ఇండియన్ బాక్సాఫీస్ ను శాసిస్తున్నాయని చెప్పాలి. ఇప్పటికే ఎన్నో దక్షిణాది చిత్రాలు.. వేరే లెవెల్ లో ఆడియన్స్ ను అలరించాయి. ఎన్నో రికార్డులు క్రియేట్ చేశాయి. నార్త్ కు గట్టి పోటీనిస్తూ సందడి చేస్తున్నాయి. బాక్సాఫీస్ వద్ద వేల కోట్లు సాధిస్తున్నాయి.

అయితే ప్రతిష్ఠాత్మక రూ.500 కోట్ల క్లబ్ లో ఇప్పటికే వివిధ దక్షిణాది సినిమాలు చేరాయి. అరుదైన మార్క్ ను అందుకున్నాయి. రీసెంట్ గా కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ మరోసారి తాను ఇటీవల నటించిన కూలీ మూవీతో రూ.500 కోట్ల క్లబ్ లో చేరారు. మరి ఇప్పటి వరకు ఎన్ని సౌత్ మూవీస్ ఆ మార్క్ ను అందుకున్నాయంటే?

రూ.500 కోట్ల మార్క్ ను దాటిన రీసెంట్ మూవీ కూలీ అయితే.. ఫస్ట్ సౌత్ సినిమా మాత్రం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన బాహుబిల్ ది బిగినింగ్. పదేళ్ల క్రితం థియేటర్స్ లో రిలీజైన ఆ మూవీ ఓ రేంజ్ లో మెప్పించింది. తెలుగుతోపాటు దక్షిణాది ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసింది. అయితే 500 కోట్ల గ్రాసర్స్ క్లబ్‌లో దక్షిణ భారత సినిమాలు ఇవే

బాహుబలి 2

పుష్ప 2

ఆర్ఆర్ఆర్

కేజీఎఫ్ 2

కల్కి 2898 ఏడీ

2.0

సలార్

బాహుబలి ది బిగినింగ్

జైలర్

లియో

కూలీ

పొన్నియిన్ సెల్వన్: పార్ట్ 1

ఇటీవల కూలీ మూవీ రూ.500 కోట్ల క్లబ్ లో చేరగా.. వసూళ్ళ పరంగా మాత్రం జాబితాలో పొన్నియిన్ సెల్వన్ తొలి భాగం కన్నా ముందు ఉంది. ఇప్పటి వరకు ప్రభాస్, రజినీకాంత్ మాత్రమే మూడు రూ.500 కోట్ల గ్రాసర్‌ లను సాధించిన హీరోలుగా నిలిచారు. లిస్ట్ ప్రకారం అది స్పష్టంగా తెలుస్తోంది. అదే సమయంలో వారిద్దరితోపాటు పలువురు స్టార్ హీరోలు.. భారీ సినిమాల్లో నటిస్తున్నారు. మరి ఆయా చిత్రాలు ఎంత వసూలు చేస్తాయో.. రూ. 500 కోట్ల క్లబ్ లో ఎన్ని చేరుతాయో చూడాలి.