Begin typing your search above and press return to search.

కోలీవుడ్‌లో బిజీ అవుతున్న టాలీవుడ్ భామలు!

పరిశ్రమలో విజయమే ఏకైక ప్రామాణికం. ఒక్క సక్సెస్ కెరీర్ గ్రాఫ్‌ను ఆకాశానికి తీసుకెళ్తే.. వరుస ఫ్లాపులు అవకాశాలను ఒక్కసారిగా తగ్గించేస్తాయి.

By:  Srikanth Kontham   |   26 Jun 2026 4:00 PM IST
కోలీవుడ్‌లో బిజీ అవుతున్న టాలీవుడ్ భామలు!
X

పరిశ్రమలో విజయమే ఏకైక ప్రామాణికం. ఒక్క సక్సెస్ కెరీర్ గ్రాఫ్‌ను ఆకాశానికి తీసుకెళ్తే.. వరుస ఫ్లాపులు అవకాశాలను ఒక్కసారిగా తగ్గించేస్తాయి. గతంలో టాలీవుడ్ నుంచి ఈ పరిస్థితిని ఎదుర్కొన్న ఎందరో కథానా యికలు కోలీవుడ్ వైపు అడుగులు వేసి అక్కడ స్టార్స్‌గా వెలిగిపోయారు. తాజాగా అదే సీన్ రిపీట్ అవుతోంది. ఒకప్పుడు టాలీవుడ్‌లో వెలిగిన పలువురు స్టార్ హీరోయిన్లు ఇక్కడ ఆశించిన విజయాలు లేక, అవకాశాలు తగ్గుముఖం పట్టడంతో తమిళ చిత్ర పరిశ్రమ వైపు చూస్తున్నారు. కోలీవుడ్ మేకర్స్ కూడా టాలీవుడ్ భామలకు క్రేజీ ప్రాజెక్టులతో రెడ్ కార్పెట్ వేస్తున్నారు.

`శ్రీనివాస కళ్యాణం`, `ప్రతిరోజూ పండగే` వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రాశీ ఖన్నాకు కొం త కాలంగా తెలుగులో సరైన సక్సెస్ దక్కలేదు. ఆమె నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవడంతో ఇక్కడ ఆఫర్లు తగ్గాయి. దీంతో అమ్మ‌డు ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా తమిళం -హిందీ ప్రాజెక్టులపై దృష్టి పెట్టారు. ల‌క్కీ గా అవ‌కాశాలు బాగానే వ‌రిస్తున్నాయి. ఇప్ప‌టికే కొంత మంది కోలీవుడ్ స్టార్ హీరోల సరసన న‌టించింది. ఈ నేప‌థ్యంలో తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలోనూ మంచి పాత్రను దక్కిం చుకున్నట్లు సమాచారం. ఈ ఒక్క ఆఫర్ అమ్మ‌డి తమిళ కెరీర్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.

`ఉప్పెన` లాంటి సెన్సేషనల్ డెబ్యూతో ఓవర్ నైట్ స్టార్‌డమ్ తెచ్చుకున్న కృతి శెట్టి పరిస్థితి కూడా ఇలాగే మారింది. మొదటి మూడు సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న కన్నడ కస్తూరికి ఆ తర్వాత టాలీవుడ్ పూర్తిగా కలిసిరాలేదు. వరుస ఫ్లాపులు ఆమె కెరీర్ స్పీడ్‌కు బ్రేకులు వేశాయి. టాలీవుడ్‌లో కొత్త అవకాశాలు తగ్గడంతో కోలీవుడ్ వైపు రూట్ మార్చింది. ప్రస్తుతం అక్కడ మోస్ట్ బిజీ హీరోయిన్లలో ఒకరిగా మారుతోంది. తమిళ్ ఆడియన్స్ కృతి శెట్టి లుక్స్ -యాక్టింగ్‌కు ఫిదా అవుతుండటంతో అమ్మ‌డికి లైనప్ గట్టిగానే సెట్ అవుతోంది.

ఇదే కోవలో టాలీవుడ్‌లో సెన్సేషనల్ డాన్సర్ గా ఊపేసిన శ్రీలీల కూడా కోలీవుడ్‌పైనే ఆశలు పెట్టుకున్నారు. `ధమాకా` వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత బ్యాక్-టు-బ్యాక్ స్టార్ హీరోల సినిమాల్లో నటించినప్పటికీ కథల్లో బలం లేకపోవడం వల్ల ఆ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. దీంతో టాలీవుడ్‌లో అమ్మ‌డి క్రేజ్ కాస్త తగ్గింది. అయితే, తమిళ చిత్ర పరిశ్రమ శ్రీలీల‌ టాలెంట్‌ను గుర్తించి వెల్కమ్ చెప్పింది. ప్రస్తుతం కోలీవుడ్ వర్సటైల్ స్టార్ ధనుష్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం `ఓం` హీరోయిన్‌గా నటిస్తోంది. ధనుష్ లాంటి పవర్‌హౌస్ పక్కన అవకాశం రావడం శ్రీలీల కెరీర్‌కు కోలీవుడ్‌లో గ్రాండ్ ఎంట్రీ అని చెప్పొచ్చు.

సౌత్ ఇండస్ట్రీలలో హీరోయిన్ల మార్పిడి అనేది ఎప్పటి నుంచో ఉన్నదే. తెలుగులో ఫేడ్ అవుట్ అవుతున్న తరు ణంలో తమిళంలోకి వెళ్లడం లేదా తమిళంలో క్రేజ్ తగ్గినప్పుడు టాలీవుడ్‌కు రావడం సక్సెస్ ఫుల్ కెరీర్ స్ట్రాటజీగా మారుతోంది. ఎందుకంటే ఒక ఇండస్ట్రీలో ఫ్లాపులు వచ్చినా నటన , గ్లామర్ పరంగా వారికి ఉన్న బ్రాండ్ వాల్యూ పక్క ఇండస్ట్రీకి ప్లస్ అవుతుంది. పైగా సరికొత్త కాంబినేషన్లను కోరుకునే కోలీవుడ్ డైరెక్టర్లకు టాలీవుడ్ స్టార్ భామలు బెస్ట్ ఆప్షన్‌గా కనిపిస్తున్నారు. భారీ క్రేజ్ ఉన్న హీరోయిన్లు రీజనబుల్ రెమ్యునరేషన్‌కే దొరుకుతుండటం కూడా అక్కడి నిర్మాతలకు కలిసొస్తుంది.