అక్కడ పరిస్థితులు మారేదెప్పుడు? మార్చేదెవరు?
బాలీవుడ్ కి సరైన సక్సస్ లు పడి చాలా కాలమవుతోంది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతున్న చిత్రాలన్నీ ఊహించని ఫలితాలు సాధిస్తున్నాయి.
By: Srikanth Kontham | 9 Oct 2025 12:00 AM ISTబాలీవుడ్ కి సరైన సక్సస్ లు పడి చాలా కాలమవుతోంది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతున్న చిత్రాలన్నీ ఊహించని ఫలితాలు సాధిస్తున్నాయి. దీంతో బాలీవుడ్ అంతకంతకు వెనుకబడుతుంది అన్నది కాదని లేని నిజం. టాలీవుడ్, శాండిల్వుడ్ పాన్ ఇండియా కంటెంట్ తో షేక్ చేస్తుంటే? బాలీవుడ్ పాన్ ఇండియా ప్రయత్నా లేవి ఫలించడం లేదు. `వార్ 2` తో సౌత్ లో ఫేమస్ అవ్వాలని హృతిక్ రోషన్ ఎంతో ప్లాన్ చేసాడు. అదీ బెడిసి కొట్టింది. రొటీన్ కంటెంట్ కావడంతో దర్శకుడు ఆయాన్ ముఖర్జీ ట్రోలర్స్ కి టార్గెట్ అయ్యాడు.
బాలీవుడ్ లో సౌత్ డైరెక్టర్ల హవా:
వాటికంటే బాలీవుడ్ నుంచి రిలీజ్ అవుతున్న చిన్న చిత్రాలే ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న వైనం కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. ఇదే క్రమంలో సౌత్ డైరెక్టర్లు కూడా బాలీవుడ్ లో పాగా వేసే ప్రయత్నాలు జోరుగా చేస్తున్నారు.ఇప్పటికే కొంత మంది సౌత్ డైరెక్టర్లు బాలీవుడ్ హీరోలతో కొన్ని సినిమాలు చేసారు. గత డిసెంబ ర్‌లో విడుదలైన వరుణ్ ధావన్ నటించిన `బేబి జాన్` చిత్రాన్ని తమిళ దర్శకుడు కలీస్ తెరకెక్కించాడు. `జవాన్` కి అసిస్టెంగా పని చేసిన దర్శకుడతను. అటుపై ఫిబ్రవరిలో విడుదలైన షాహిద్ కపూర్ నటించిన `దేవా` సినిమాకు దర్శకత్వం వహించింది మలయాళం ఫిల్మ్ మేకర్ రోజ్షాన్ ఆండ్రూస్.
పాత పరిస్థితికి భిన్నంగా:
అలాగే సన్ని డియోల్ హీరోగా నటించిన `జాట్` సినిమా రూపొందించింది టాలీవుడ్ మేకర్ గోపీచంద్ మలినేని. ఇంకా ముందుకెళ్తే సెప్టెంబర్‌లో విడుదలైన టైగర్ శ్రాఫ్ చిత్రం `బాఘీ 4` ని డైరెక్ట్ చేసింది కన్నడ దర్శకుడు హర్ష. అలాగే సల్మాన్ ఖాన్ నటించిన `సికిందర్` కు దర్శకత్వం వహించింది మురగదాస్ అన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫలితాల సంగతి పక్కన బెడితే బాలీవుడ్ హీరోలు సౌత్ డైరెక్టర్లకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు? అనడానికి ఈ సన్నివేశమే మంచి ఉదాహారణ. ఒకప్పుడు బాలీవుడ్ స్టార్లు అంతా అక్కడి డైరెక్టర్లతోనే పని చేయడానికే అమితాసక్తి చూపించారు.
క్లాస్ పీకినా మార్పు రాలేదా?
కానీ వైఫల్యాల నేపథ్యంలో పర భాషా దర్శకులపై ఆధారపడాల్సిన సన్నివేశం ఎదురైంది. పాన్ ఇండియాలో సౌత్ కంటెంట్ సక్సెస్ అవ్వడంతో? ఇక్కడ దర్శకులే కావాలంటున్నారు. ఈ సన్నివేశాన్ని ఉదహరించి అమితా బచ్చన్, సల్మాన్ ఖాన్ లాంటి స్టార్లు బాలీవుడ్ రైటర్లు..దర్శకులు మరింత సృజనాత్మకంగా పనిచేయాలని హితవు పలికారు. తమ కంటెంట్ వీక్ గా ఉండటంతోనే బాక్సాఫీస్ వద్ద రాణించలేకపోతున్నామని ఓపెన్ గానే అనేసారు.సౌత్ దర్శకు లను, రచయి తలను చూసి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని చిన్నపాటి క్లాస్ పీకారు. మరి ఈ పరిణమయాఆలు..పరిస్థితులు బాలీవుడ్ లో ఎలాంటి మార్పులు తీసుకొస్తాయో చూడాలి.
