Begin typing your search above and press return to search.

తమన్నా తరహాలోనే ఆభరణాల వ్యాపారంలో టాప్-5 సౌత్ స్టార్లు

గ్లామర్ ప్రపంచంలో మెరిసే కథానాయికలు కేవలం నటనకే పరిమితం కాకుండా వ్యాపార రంగంలోకి అడుగుపెడుతుండటం ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో ఒక ప్రధాన ట్రెండ్‌గా మారింది.

By:  Sivaji Kontham   |   31 Oct 2026 4:00 AM IST
తమన్నా తరహాలోనే ఆభరణాల వ్యాపారంలో టాప్-5 సౌత్ స్టార్లు
X

గ్లామర్ ప్రపంచంలో మెరిసే కథానాయికలు కేవలం నటనకే పరిమితం కాకుండా వ్యాపార రంగంలోకి అడుగుపెడుతుండటం ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో ఒక ప్రధాన ట్రెండ్‌గా మారింది. ఇటీవల నటి తమన్నా భాటియా ఇండోర్‌లోని `ది మ్యారియట్` వేదికగా తన సొంత జ్యువెలరీ బ్రాండ్ `తమన్నా ఫైన్ జ్యువెలరీ` (TFJ) ప్రత్యేక ప్రదర్శనను నిర్వహించారు. తమన్నా అలా నవ్వులు చిందిస్తూ తన డిజైన్లను ప్రదర్శించడంతో ఈ షోకేస్‌కు అభిమానులు, ఫ్యాషన్ ప్రియుల నుంచి విశేష స్పందన లభించింది. ఇండోర్ పర్యటనలో ప్రజల నుంచి వచ్చిన ఆదరణ.. వారి స్టోరీస్ ని షేర్ చేయ‌డం ఈ ఈవెంట్‌ను అత్యంత విజయవంతం చేయగా.. రెడ్ అవుట్‌ఫిట్‌లో మెరిసిన తమన్నా సోషల్ మీడియా పోస్టులు సైతం నెట్టింట తెగ వైరల్ అయ్యాయి.





తమన్నా తరహాలోనే ఆభరణాల వ్యాపారంలో - ఫ్యాషన్ రంగంలో బిజినెస్ ఉమెన్‌గా రాణిస్తున్న సౌత్ స్టార్లలో మొదటి స్థానంలో నిలుస్తారు సమంత రూత్ ప్రభు. సమంత పర్యావరణహిత లాబ్-గ్రోన్ డైమండ్స్ బ్రాండ్ అయిన `మోవిసాని`లో భారీగా పెట్టుబడులు పెట్టడమే కాకుండా.. దానికి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. దీనితో పాటు `సాకీ` అనే ఫ్యాషన్ అపారెల్ బ్రాండ్‌ను విజయవంతంగా నడుపుతూ.. ట్రెండీ డిజైన్లతో ప్లాట్‌ఫామ్‌పై తనదైన ముద్ర వేశారు.





రెండో స్థానంలో కాజల్ అగర్వాల్ జ్యువెలరీ బిజినెస్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కాజల్ తన సోదరి నిషా అగర్వాల్‌తో కలిసి `మార్సాలా జ్యువెలరీ` అనే ఫైన్ జ్యువెలరీ లైన్‌ను ప్రారంభించారు. చేతితో తయారుచేసిన వెండి- బంగారు ఆభరణాలను విక్రయించే ఈ బ్రాండ్ ద్వారా కాజల్ ఫ్యాషన్ లవర్స్‌ను ఆకట్టుకుంటున్నారు. ఇక లేడీ సూపర్ స్టార్ నయనతార నేరుగా ఆభరణాల తయారీలో లేకపోయినా.. జ్యువెలరీ ప్రమోషన్స్ - ఇతర లైఫ్‌స్టైల్, కాస్మోటిక్స్ వ్యాపారాల్లో టాప్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా దూసుకుపోతున్నారు.





మూడో స్థానంలో సీనియర్ నటి శ్రియా శరన్ ఆభరణాల డిజైనింగ్ రంగంలో సందడి చేస్తున్నారు. ఫ్యాషన్ - డిజైనింగ్‌పై ఉన్న ప్రత్యేక ఆసక్తితో ఈ బ్యూటీ `శ్రియాస్ కలెక్షన్`తో పాటు పలు హ్యాండ్‌క్రాఫ్టెడ్ ఆర్టిసానల్ జ్యువెలరీ ప్రమోషన్లలో భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు నటి శృతి హాసన్ తన ఆర్టిస్టిక్ ఆలోచనలతో కొన్ని స్వతంత్ర జ్యువెలరీ బ్రాండ్లతో కలసి ప్రత్యేకమైన ఆర్టిస్టిక్ కొలాబరేషన్స్ చేస్తూ ట్రెండీ ఆభరణాలను ప్రమోట్ చేస్తున్నారు.





నాలుగో స్థానంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కుటుంబం ఆభరణాల రంగంలో బిజినెస్ పార్ట్‌నర్లుగా దూసుకుపోతోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు .. ఆయన సతిమణి నమ్రతా శిరోద్కర్ ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ `AMB జ్యువెల్ క్రాఫ్ట్` ను సుప్రసిద్ధ వ్యాపారవేత్తలతో కలిసి ప్రారంభించడంలో కీలక భాగస్వాములుగా వ్యవహరిస్తున్నారు.

తమిళ చిత్రసీమలో నటుడిగా మెప్పిస్తూనే ఆభరణాల వ్యాపారంలో భారీగా ఆర్జించిన అగ్రనటుల్లో ప్రశాంత్ అగ్రస్థానంలో నిలుస్తారు. 90ల నాటి `జీన్స్` సినిమా ఫేమ్ ప్రశాంత్.. చెన్నైలోని అత్యంత రద్దీ ప్రాంతమైన పనగల్ పార్క్ (త్యాగరాయ నగర్)లో మల్టీ-స్టోరీ జ్యువెలరీ షాపింగ్ కాంప్లెక్స్‌ను స్థాపించి వ్యాపార రంగంలో భారీ విజయం సాధించారు. తన తండ్రి, నటుడు-దర్శకుడు త్యాగరాజన్‌తో కలిసి నిర్మించిన ఈ ఆభరణాల సామ్రాజ్యం ద్వారా ఆయన కోట్లాది రూపాయల ఆదాయాన్ని అర్జిస్తూ.. తమిళ పరిశ్రమలో అత్యంత ధనిక వ్యాపారవేత్త కం నటులలో ఒకరిగా నిలిచారు.

ఇలా వెండితెరపై నటనతో అలరించే సౌత్ స్టార్లు, వ్యాపార రంగంలోనూ తమ సత్తా చాటుతూ తోటి మహిళలకు, అభిమానులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.