ఆ జాబితాలో చేరిపోయిన సర్దార్-2
ఫస్ట్ మూవీ గొప్ప ఫలితాన్నందుకున్నాక పెరిగే అంచనాలను ఇక్కడి ఫిలిం మేకర్స్ అందుకోవడంలో ఫెయిలైపోతున్నారు.
By: Garuda Media | 12 Sept 2026 6:00 AM ISTహాలీవుడ్లో సీక్వెల్స్, ఫ్రాంఛైజీ సినిమాలు దశాబ్దాల నుంచి వస్తున్నాయి. ఒక సినిమాకు ఐదారు సీక్వెల్స్ తీసిన ఫ్రాంఛైజీలు బోలెడు కనిపిస్తాయి. కానీ ఇండియాలో బాలీవుడ్‌ను మినహాయిస్తే సీక్వెల్స్ తీసే ఇండస్ట్రీలు చాలా తక్కువ. ముఖ్యంగా సౌత్ సినిమాలో సీక్వెల్స్, ఫ్రాంఛైజీ సినిమాల కల్చర్ చాలా లేటుగా మొదలైంది. అది కూడా బాహుబలి తర్వాతే కాస్త పెరిగింది. పుష్ప వల్ల కూడా ఈ సంస్కృతి కొంచెం ఊపందుకుంది. కానీ ఇలాంటి కొన్ని సినిమాలను పక్కన పెడితే.. దక్షిణాదిన సీక్వెల్స్ కలిసొచ్చిన దాఖలాలు తక్కువ.
ఫస్ట్ మూవీ గొప్ప ఫలితాన్నందుకున్నాక పెరిగే అంచనాలను ఇక్కడి ఫిలిం మేకర్స్ అందుకోవడంలో ఫెయిలైపోతున్నారు. కొన్ని సీక్వెల్స్ అయితే పార్ట్-1ను ఏమాత్రం మ్యాచ్ చేయలేక.. ఫస్ట్ డే ఫస్ట్ షో పడగానే డిజాస్టర్లుగా తేలిపోతున్నాయి. ఎంతో ఆశించిన వచ్చిన ప్రేక్షకులకు కళ్లు బైర్లు కమ్మేలా చేసిన సీక్వెల్స్ తెలుగు, తమిళ భాషల్లో చాలానే ఉన్నాయి. కిక్-2, నాగవల్లి, సర్దార్ గబ్బర్ సింగ్ లాంటి సినిమాల ఫలితాల గురించి తెలిసిందే. ఒక్క షోకే వీటి ఫలితాలేంటో అర్థమైపోయింది.
ఇక తమిళంలో కూడా ఇలాంటి సినిమాలు చాలానే ఉన్నాయి. విశ్వరూపం, సామి, ఇండియన్ లాంటి కల్ట్ మూవీస్‌కు సీక్వెల్స్ తీస్తే దారుణాతి దారుణమైన ఫలితాన్నందుకున్నాయి. తాజాగా ‘సర్దార్-2’ సినిమా కూడా ఈ జాబితాలోకే చేరింది. కార్తి, పి.ఎస్.మిత్రన్ కలయికలో నాలుగేళ్ల ముందు వచ్చిన సినిమాకు సీక్వెల్ చేయగా.. ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. దీని ప్రోమోలు చూస్తే బాగానే అనిపించాయి. కానీ నిన్న రిలీజైన సినిమాకు మామూలు నెగెటివ్ టాక్ రాలేదు. ఒక షో పడేసరికి.. సినిమాను ఔట్‌రైట్‌గా డిజాస్టర్ అని తేల్చేశారు. పైన చెప్పుకున్న టార్చర్ సీక్వెల్స్ జాబితాలోకి దీన్ని చేర్చేశారు. ఇండియన్ సినిమాలకు.. ముఖ్యంగా సౌత్ చిత్రాకల సీక్వెల్స్ కలిసి రావని ఈ చిత్రంతో మరోసారి రుజువైంది.
