పెయింటింగ్ చీరలో కాయాదు స్టన్నింగ్ లుక్స్
అస్సాం నుంచి వచ్చి సౌత్ ఇండియాను తన నటనతో పలుకరిస్తున్న యంగ్ బ్యూటీ కాయాదు లోహర్, తాజాగా షేర్ చేసిన ఫోటోలతో నెట్టింట మంటలు పుట్టిస్తోంది.
By: Madhu Reddy | 16 April 2026 5:30 PM ISTఅస్సాం నుంచి వచ్చి సౌత్ ఇండియాను తన నటనతో పలుకరిస్తున్న యంగ్ బ్యూటీ కాయాదు లోహర్, తాజాగా షేర్ చేసిన ఫోటోలతో నెట్టింట మంటలు పుట్టిస్తోంది. షీర్ ఆర్గాంజా చీరలో, చేతితో గీసిన బొటానికల్ ప్రింట్స్ మెరుస్తుంటే, ఒక అందమైన పెయింటింగ్ లా కనిపిస్తున్న కాయాదును చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఒకవైపు గ్లామర్ ఒలికిస్తూనే, మరోవైపు నటనకు ఆస్కారం ఉన్న పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న కాయదు లేటెస్ట్ లుక్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆ వివరాలు చూద్దాం..

అస్సాం నుంచి వెండితెరకు.. కాయాదు జర్నీ:
తేజ్‌పూర్ కు చెందిన కాయాదు లోహర్, తన అందం మరియు అభినయంతో చాలా తక్కువ సమయంలోనే మల్టీ లాంగ్వేజ్ యాక్ట్రెస్‌గా పేరు తెచ్చుకుంది. 2021లో 'ముగిల్ పేట' అనే కన్నడ సినిమాతో కెరీర్ ప్రారంభించిన ఈమె, ఆ తర్వాత మలయాళ, మరాఠీ చిత్రాల్లో నటించి మెప్పించింది. ముఖ్యంగా 2025లో విడుదలైన 'డ్రాగన్' అనే తమిళ సినిమా ఆమె కెరీర్‌ను మలుపు తిప్పింది. ఈ సినిమా తెచ్చిన గుర్తింపుతో ఇప్పుడు సౌత్ ఇండియన్ సినిమా అంతా కాయదు వైపు చూస్తోంది.

హ్యాండ్ పెయింటెడ్ చీరలో అదిరిపోయే అందం:
తాజాగా సోషల్ మీడియాలో కాయాదు పోస్ట్ చేసిన ఫోటోలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.రంగు రంగులతో కూడిన హ్యాండ్ పెయింటెడ్ బొటానికల్ ప్రింట్స్ ఉన్న షీర్ ఆర్గాంజా చీరలో ఆమె ఎంతో హుందాగా కనిపిస్తోంది. దీనికి కాంబినేషన్‌గా సేజ్ గ్రీన్ కలర్ బ్లౌజ్ ధరించి, మోడ్రన్ అండ్ ట్రెడిషనల్ లుక్‌ను పర్ఫెక్ట్‌గా మేనేజ్ చేసింది. మినిమల్ మేకప్ మరియు సింపుల్ హెయిర్ స్టైల్‌తో కాయాదు నిజంగా ఒక అందమైన కావ్యంలా ఉందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

తెలుగు సినిమాల్లో బిజీ - వరుస ప్రాజెక్టులు:
తెలుగు ప్రేక్షకులకు 'అల్లూరి' సినిమాతో పరిచయమైన కాయాదు, ఇప్పుడు టాలీవుడ్‌లో కూడా బిజీ అవుతోంది. ఇటీవల విశ్వక్ సేన్ సరసన 'ఫంకీ' అనే కామెడీ మూవీ తో మన ముందుకు వచ్చింది.ఇక నేచురల్ స్టార్ నాని నటిస్తున్న 'ది పారడైజ్' లో కూడా ఒక కీలక పాత్ర పోషిస్తోంది. అంతేకాకుండా, మలయాళంలో టొవినో థామస్ సరసన 'పల్లిచట్టంబి' వంటి క్రేజీ మూవీ లో నటిస్తుంది. నటనకు ఆస్కారమున్న వైవిధ్యమైన పాత్రలను ఎంచుకోవడమే ఆమె సక్సెస్ సీక్రెట్ అనిపిస్తోంది.

ఒకప్పుడు మోడలింగ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్న కాయదు, ఇప్పుడు సౌత్ ఇండియాలో బిజీయెస్ట్ నటిగా మారుతోంది. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, ప్రతి సినిమాలో తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకుంటోంది. తాజాగా విడుదలైన ఫోటోలు చూస్తుంటే, ఆమె ఫ్యాషన్ సెన్స్ కూడా నెక్స్ట్ లెవల్‌లో ఉందని అర్థమవుతోంది. మరిన్ని వైవిధ్యమైన సినిమాలతో కాయదు బాక్సాఫీస్ వద్ద కూడా తన సత్తా చాటాలని ఆశిద్దాం.
