హిట్ అయితే స్టార్ లీగ్‌లోకి ఎంట్రీ.. ‘దాదా’తో ఆ హీరో పై భారీ అంచనాలు!
2002లో ఇంగ్లాండ్‌తో జరిగిన నెట్‌వెస్ట్ సిరీస్ ఫైనల్ మ్యాచ్‌లో ఇండియా గెలిచిన ఆనందంలో, గంగూలీ లార్డ్స్ బాల్కనీలో నిలబడి తన జెర్సీ తీసి గాల్లో విదిల్చడం ఒక చారిత్రాత్మిక ఘట్టం.
By: Madhu Reddy | 8 July 2026 3:12 PM ISTభారతదేశంలో క్రికెట్ అంటే కేవలం ఒక ఆట కాదు, అదొక పెద్ద ఎమోషన్, అలాంటి ఇండియన్ క్రికెట్ హిస్టరీలోనే మోస్ట్ సక్సెస్‌ఫుల్ అండ్ అగ్రెసివ్ కెప్టెన్‌గా పేరు తెచ్చుకున్న ‘దాదా’ సౌరవ్ గంగూలీ బయోపిక్ ‘దాదా ది సౌరవ్ గంగూలీ స్టోరీ’ ఫస్ట్ లుక్ విడుదలైంది. గంగూలీ పుట్టినరోజు కానుకగా వచ్చిన ఈ పోస్టర్ ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. బాలీవుడ్ టాలెంటెడ్ నటుడు రాజ్‌కుమార్ రావు లార్డ్స్ బాల్కనీలో జెర్సీ విదిల్చిన ఐకానిక్ సీన్‌ను రీక్రియేట్ చేస్తూ కనిపించిన లుక్, సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. ఆ విశేషాలు చూద్దాం..
ఐకానిక్ లార్డ్స్ మూమెంట్‌తో వైరల్ పోస్టర్:
2002లో ఇంగ్లాండ్‌తో జరిగిన నెట్‌వెస్ట్ సిరీస్ ఫైనల్ మ్యాచ్‌లో ఇండియా గెలిచిన ఆనందంలో, గంగూలీ లార్డ్స్ బాల్కనీలో నిలబడి తన జెర్సీ తీసి గాల్లో విదిల్చడం ఒక చారిత్రాత్మిక ఘట్టం. క్రికెట్ హిస్టరీలోనే నిలిచిపోయిన ఆ క్రేజీ మూమెంట్‌తోనే ఇప్పుడు రాజ్‌కుమార్ రావు ఫస్ట్ లుక్‌ను డిజైన్ చేశారు. ఇక ఈ పోస్టర్ చూస్తుంటే గంగూలీగా రాజ్‌కుమార్ రావు పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోయాడని, థియేటర్లలో ఫ్యాన్స్‌కు పూనకాలు రావడం ఖాయమని అర్థమవుతోంది.
రాజ్‌కుమార్ రావు కెరీర్‌కు బిగ్గెస్ట్ మైలురాయి:
ఇప్పటివరకు వైవిధ్యమైన, కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలతో బెస్ట్ యాక్టర్‌గా పేరు తెచ్చుకున్న రాజ్‌కుమార్ రావుకు ఇలాంటి ఒక భారీ స్థాయి బయోపిక్‌లో నటించడం ఇదే మొదటిసారి. గంగూలీ లాంటి మాస్ లీడర్ పాత్రను మెప్పించడం మామూలు విషయం కాదు. ఇక ఈ సినిమా గనుక బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టిస్తే, రాజ్‌కుమార్ రావు కేవలం 'యాక్టర్' అనే ట్యాగ్ దాటి కమర్షియల్ 'స్టార్' లీగ్‌లోకి అడుగుపెట్టడం గ్యారెంటీ.
'ధోని' రేంజ్ కమర్షియల్ బ్లాక్‌బస్టర్ అవుతుందా?:
మనదగ్గర క్రికెట్ బయోపిక్స్‌లో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నటించిన ‘MS ధోని’ సినిమా కమర్షియల్‌గా అతిపెద్ద హిట్‌గా నిలిచింది. రణవీర్ సింగ్ నటించిన ‘83’ మెప్పించినా కలెక్షన్లు రాబట్టలేకపోయింది. అయితే గంగూలీ జీవితంలో ఉన్న అగ్రెసివ్ డ్రామా, టీమ్ సెలక్షన్ వివాదాలు, గ్రెగ్ చాపెల్ కాంట్రవర్సీ మళ్లీ జట్టులోకి ఇచ్చిన కంబ్యాక్ స్టోరీ వంటి అంశాలు ‘ధోని’ సినిమా తరహాలోనే పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్‌గా మారే అవకాశం ఉంది. ఇక దీంతో ఈ సినిమా 'ధోని' రికార్డులను టార్గెట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
భారీ కాంబినేషన్.. రిలీజ్ ఎప్పుడంటే?:
‘అతను ఆట ఆడలేదు.. ఆటనే మార్చేశాడు’ అనే పవర్‌ఫుల్ క్యాప్షన్‌తో వస్తున్న ఈ చిత్రాన్ని టాలెంటెడ్ డైరెక్టర్ విక్రమాదిత్య మోత్వానే తెరకెక్కిస్తున్నారు. లవ్ రంజన్, అంకుర్ గార్గ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని టీ సిరీస్ మరియు డిబిఎల్ సంస్థలు సమర్పిస్తున్నాయి. ఇక ఈ సినిమాను వచ్చే ఏడాది మే 14న పాన్ ఇండియా లెవెల్లో తెలుగుతో పాటు పలు భాషల్లో గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ కన్ఫర్మ్ చేశారు.
సౌరవ్ గంగూలీ బయోపిక్ అంటే కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, ఒక తరం క్రికెట్ లవర్స్ కలల ప్రయాణం. రాజ్‌కుమార్ రావు నటన, విక్రమాదిత్య మోత్వానే టేకింగ్ తోడైతే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కొత్త రికార్డులు సృష్టించడం ఖాయం. మరి క్రికెట్ బయోపిక్ సినిమాల్లో 'దాదా' ఎలాంటి రెస్పాన్స్ అందుకోబోతుందో చూడాలి
