Begin typing your search above and press return to search.

రజనీకాంత్ - కమలహాసన్ మల్టీస్టారర్ పై ఐశ్వర్య కీలక కామెంట్స్!

అసలు విషయంలోకి వెళ్తే.. కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ సీనియర్ హీరోలుగా గుర్తింపు తెచ్చుకున్న రజినీకాంత్, కమలహాసన్ మధ్య ఎప్పటినుంచో గొడవలు ఉన్నాయనే వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.

By:  Madhu Reddy   |   24 Oct 2025 5:00 PM IST
రజనీకాంత్ - కమలహాసన్ మల్టీస్టారర్ పై ఐశ్వర్య కీలక కామెంట్స్!
X

ప్రతి భాష ఇండస్ట్రీలో కూడా స్టార్ హీరోల మధ్య సఖ్యత ఉన్నప్పటికీ.. ఆ హీరోల అభిమానుల మధ్య గొడవలు ఎప్పటికప్పుడు అందర్నీ ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి.. అంతే కాదు ఆ స్టార్ హీరోలు బహిరంగంగా తాము మంచి స్నేహితులం అని ఎంత ప్రకటించినా అభిమానులు మాత్రం ఏదో ఒక సందర్భంలో సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తూ ఉంటారు. ఇదిలా ఉండగా ఇప్పుడు అదే స్టార్ హీరోలు కలసి మల్టీస్టారర్ సినిమా చేస్తున్నారని తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

అసలు విషయంలోకి వెళ్తే.. కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ సీనియర్ హీరోలుగా గుర్తింపు తెచ్చుకున్న రజినీకాంత్, కమలహాసన్ మధ్య ఎప్పటినుంచో గొడవలు ఉన్నాయనే వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. తమ మధ్య ఎలాంటి గొడవలు లేవు అని డైరెక్ట్ గా కమలహాసన్ చెప్పినా రూమర్స్ మాత్రం ఆగడం లేదు. అందుకే ఆ రూమర్స్ కి చెక్ పెట్టడానికి ఇప్పుడు వీరిద్దరూ కలిసి లోకేష్ కనగరాజు దర్శకత్వంలో మల్టీస్టారర్ మూవీ చేస్తున్నట్లు ప్రకటించారు. సినిమా అయితే ప్రకటించారు కానీ అప్డేట్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్న నేపథ్యంలో తాజాగా రజనీకాంత్ కూతురు ఐశ్వర్య ఊహించని కామెంట్లు చేసింది.

ఐశ్వర్య మాట్లాడుతూ.. "నాన్న రజనీకాంత్ , మామయ్య కమలహాసన్ కలిసి ఇప్పుడు మల్టీ స్టారర్ సినిమా చేస్తున్నారు. అయితే కమలహాసన్ మామ బ్యానర్ పైనే ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది . ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి . త్వరలోనే నాన్న అన్ని విషయాలు సరైన సమయంలో వెల్లడిస్తారు" అంటూ ఐశ్వర్య చెప్పుకొచ్చింది. ఇకపోతే ఐశ్వర్య చేసిన ఈ కామెంట్లతో ఈ మల్టీస్టారర్ మూవీలో ఎవరెవరు నటించబోతున్నారు? కథ ఎలాంటిది? అనే విషయంపై అభిమానులలో ఊహాగానాలు మొదలయ్యాయి.

మరోవైపు సౌందర్యతో పాటు శృతిహాసన్ కూడా తన ఉత్సాహాన్ని వ్యక్తం చేసింది." మనమందరం వారిద్దరిని కలిసి చూడాలని కలలు కన్నాము. ఆ ఒక్క సినిమా కోసం అందరిలాగే నేను కూడా ఎదురు చూస్తున్నాను. నాకు ఇష్టమైన రజినీ సార్ సినిమా పడయప్ప. (తెలుగులో నరసింహ). ఇక ఆయనతో కలిసి పనిచేయడం నాకు మరింత ఇష్టం" అంటూ శృతిహాసన్ చెప్పుకొచ్చింది. మొత్తానికైతే ఈ మల్టీ స్టారర్ సినిమా కోసం అభిమానులే కాదు వారి వారసురులు కూడా ఎదురుచూస్తున్నారు అని తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఇకపోతే 46 ఏళ్ల తర్వాత కలిసి స్క్రీన్ పై కమలహాసన్, రజనీకాంత్ కనిపించబోతున్నారు. ఈ విషయాన్ని సైమా అవార్డుల వేడుకల్లో కమలహాసన్ స్పష్టం చేశారు." మీరు, రజినీకాంత్ కాంబినేషన్లో ఒక సినిమా ఆశించవచ్చా?" అని వ్యాఖ్యాత ప్రశ్నించగా.. కమలహాసన్ మాట్లాడుతూ.." ప్రేక్షకులు మా కాంబినేషన్ ను ఇష్టపడితే మంచిదే కదా.. వారు సంతోషంగా ఉంటే మాకు కూడా ఆనందమే. మేము కూడా కలిసి నటించాలని ఎన్నో ఏళ్లుగా ప్రయత్నిస్తున్నాం. కానీ కుదరలేదు. త్వరలోనే మేమిద్దరం మీ ముందుకు రాబోతున్నాము. అది మిమ్మల్ని సర్ప్రైజ్ చేస్తుంది" అంటూ మల్టీస్టారర్ పై క్లారిటీ ఇచ్చారు.

లోకేష్ కనగరాజు దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా గ్యాంగ్స్టర్ డ్రామాగా రాబోతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే 46 ఏళ్ల తర్వాత రజనీకాంత్ , కమల్ హాసన్ మళ్లీ కలిసి కెమెరా ముందుకు వచ్చినట్లు అవుతుంది. ఇక ఇద్దరు కలిసి దాదాపు 5 భాషల్లో 20 చిత్రాలలో నటించారు. అయితే ఇదంతా 1970 వ దశకంలోనే జరిగిపోయింది. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత లోకేష్ రాసిన కథతో వీళ్లిద్దరు ఒక్కటి కాబోతున్నట్లు తెలుస్తోంది.