పచ్చటి ప్రకృతి మధ్య అద్భుతమైన విజువల్ వండర్!
6300 చదరపు అడుగుల విశాలమైన స్థలంలో ఇల్లు రూపుదిద్దుకుంది. కొచ్చి నగరంలోని హడావిడికి దూరంగా.. ప్రశాంతమైన వాతావరణంలో ఇంటిని నిర్మించారు.
By: Srikanth Kontham | 23 Oct 2026 6:00 AM ISTమలయాళ చిత్ర పరిశ్రమలో విలక్షణ నటుడిగా, దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సౌబిన్ షాహిర్ సినిమాలతోనే కాకుండా వ్యక్తిగత జీవితం తో తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా ఆయన కొచ్చిలో నిర్మించుకున్న లగ్జరీ ఇల్లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. సిమెంట్ గోడలు, హంగులతో కాకుండా ప్రకృతికి దగ్గరగా ఓ ఇంటిని డిజైన్ చేసుకున్న తీరు ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ అద్భుతమైన ఇంటికి సంబంధించిన విశేషాలు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి.
6300 చదరపు అడుగుల విశాలమైన స్థలంలో ఇల్లు రూపుదిద్దుకుంది. కొచ్చి నగరంలోని హడావిడికి దూరంగా.. ప్రశాంతమైన వాతావరణంలో ఇంటిని నిర్మించారు. ఇంటి చుట్టూ పరుచుకున్న పచ్చటి చెట్లు, అందమైన మొక్కలు ఈ ప్రాపర్టీకి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఇంటి లోపలికి అడుగుపెట్టగానే ఓ రిసార్ట్ ఫారెస్ట్ మధ్యలో ఉన్న అనుభూతి కలిగేలా ఆర్కిటెక్చర్ ఉండటం విశేషం. ఆధునిక సౌకర్యాలను, ప్రకృతి అందాలను మేళవించి దీన్ని తీర్చిదిద్దారు.
సౌబిన్ షాహిర్‌కు మొక్కలంటే ప్రేమ.. ఇష్టమట. దీని వెనుక ఆయన బాల్యానికి సంబంధించిన మధురమైన జ్ఞాపకాలు దాస ఉన్నాయని స్వయంగా వెల్లడించారు. చిన్నతనంలో తండ్రితో కలిసి గడిపిన రోజులు.. వారి చుట్టూ ఉన్న పచ్చదనం మనసులో బలంగా నాటుకుపోయాయి. అందుకే పెద్దయ్యాక తాను నిర్మించుకునే సొంతిల్లు ఎలా ఉండాలనే దానిపై స్పష్టమైన అవగాహనతో.. బాల్యపు జ్ఞాపకాలకు రూపం ఇస్తూ ఇంటి డిజైన్‌ను ప్లాన్ చేసుకున్నారు.
ఇంటి ఇంటీరియర్ డిజైన్ కూడా ఎంతో ప్రత్యేకంగా ఉంది. నేచురల్ లైటింగ్ పుష్కలంగా వచ్చేలా పెద్ద పెద్ద గ్లాస్ విండోస్ .. ఓపెన్ రూఫ్ కాన్సెప్ట్‌ను ఏర్పాటు చేశారు. ఇంట్లోని ప్రతీ మూలా గ్రీనరీ కనిపించేలా ప్రత్యేకమైన ఇండోర్ ప్లాంట్స్‌ను అమర్చారు. దీనివల్ల నగరంలోని కాలుష్యానికి దూరంగా.. ప్రశాంతమైన ఆక్సిజన్‌తో కూడిన వాతావరణం ఇంట ఆసాంతం నిండి ఉంటుంది. కుటుంబంతో కలిసి ప్రశాంతమైన సమయం గడపడానికి ఈ ఇల్లు సరైన వేదికగా నిలుస్తోంది.
సినిమా షూటింగ్స్‌తో నిత్యం బిజీగా ఉండే సౌబిన్ షాహిర్‌కు ఇల్లు గొప్ప మానసిక ప్రశాంతతను ఇస్తోందని సన్నిహితులు చెబుతుంటారు. సౌబిన్ ఎంత అలసిపోయి ఇంటికి వచ్చినా? పచ్చటి వాతావరణం తనలోని అలసటను ఇట్టే మాయం చేస్తుందన్నారు. విలాసవంతమైన జీవితం కంటే మానసిక ప్రశాంతతకు ప్రాధాన్యతనిస్తూ సెలబ్రిటీలు ఇలాంటి ఇళ్లను ఎంచుకోవడం నిజంగా అభినందనీయం.
ఈ ఇల్లు నివాసం మాత్రమే కాదు. ప్రకృతిపై సౌబిన్ కున్న ప్రేమకు సజీవ సాక్ష్యం. చిన్న నాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఆధునికతను హారతి పళ్లెంలో పెట్టినట్లుగా ఎంతో అందంగా ఇంటిని తీర్చిదిద్దిన తీరు ఆకట్టు కుంటోంది.
