Begin typing your search above and press return to search.

దీపావ‌ళి లుక్‌తో క‌ట్టి ప‌డేసిన న‌టి కం గాయ‌ని

నటి, గాయని సోఫీ చౌదరి తన దీపావళి ఫొటోషూట్‌తో ఆకట్టుకున్నారు. ప్రముఖ డిజైనర్ రూపొందించిన నలుపు రంగు రాయల్ చీరలో మెరిశారు. భారీ ఆభరణాలు, ప్రత్యేక మేకప్‌తో చేసిన ఈ లుక్‌పై నర్గీస్ ఫక్రీ సహా పలువురు ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

By:  Sivaji Kontham   |   10 Nov 2026 4:00 AM IST
దీపావ‌ళి లుక్‌తో క‌ట్టి ప‌డేసిన న‌టి కం గాయ‌ని
X

దీపావళి పండుగ సందర్భంగా సెలబ్రిటీల సోష‌ల్ మీడియా సంద‌డి మామూలుగా లేదు. పార్టీ వైబ్ ని సృష్టిస్తూ, నిరంత‌ర ఫోటోలు, వీడియోల‌ను షేర్ చేస్తుంటే అవి అంత‌ర్జాలంలో జోరుగా వైర‌ల్ అవుతున్నాయి. ప్రముఖ నటి, గాయని సోఫీ చౌదరి దీపావ‌ళి లుక్ ఇప్పుడు ట్రెండింగ్ గా మారింది. అంద‌మైన‌ నలుపు రంగు రాయల్ చీరలో మెరిసి అభిమానులను ఆకట్టుకున్నారు.





``దీపావళికి సిద్ధమై చిన్నపాటి అలజడి సృష్టించాను`` అంటూ సోషల్ మీడియాలో షేర్ చేసిన తాజా ఫొటోలు ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ట్రెడిషనల్ చీరకట్టుకు గ్లామరస్ టచ్ ఇస్తూ సోఫీ చైద‌రి చేసిన ఈ ఫొటోషూట్ అభిమానులను గొప్ప‌గా ఆకట్టుకుంటోంది.





ఈ ప్రత్యేక లుక్ కోసం సోఫీ చౌదరి ప్రముఖ డిజైనర్ లేబుల్ రూపొందించిన న‌లుపు రంగు చీర‌ను ఎంచుకోగా, ఫ్యాషన్ స్టైలిస్ట్ మోహిత్ రాయ్ దీనికి రూపకల్పన చేశారు. ఫరా ఖాన్ వరల్డ్ బ్రాండ్‌కు చెందిన గ్రాండ్ జ్యువెలరీ, భారీ ఇయర్ రింగ్స్ ఈ అవుట్‌ఫిట్‌కు మరింత రాయల్ లుక్‌ను తీసుకొచ్చాయి. అంబరీన్ యూసుఫ్ మేకప్, హ్యారీ రాజ్‌పుత్ హెయిర్ స్టైలింగ్ ఈ గ్లామరస్ లుక్‌ను మరింత పర్ఫెక్ట్‌గా తీర్చిదిద్దాయి.





సోఫీ చౌదరి షేర్ చేసిన ఈ ఫొటోలపై బాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. నటి నర్గీస్ ఫక్రీతో పాటు పలువురు సినీ ప్రముఖులు సోఫీ స్టైలిష్ అప్పియరెన్స్‌ను మెచ్చుకుంటూ కామెంట్లు చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ లేటెస్ట్ లుక్.. ఈ దీపావళి సీజన్‌లో అత్యంత ఆకర్షణీయమైన పండుగ లుక్స్‌లో ఒకటిగా నిలిచింది. సోఫీ ఇంత‌కుముందు మ‌హేష్ 1- నేనొక్క‌డినే చిత్రంలో ఐటమ్ పాట‌లో మెరిసిన సంగ‌తి తెలిసిందే. హిందీ చిత్ర‌సీమ‌లో రెగ్యుల‌ర్ గా సినిమాలు చేయ‌క‌పోయినా.. సెల‌బ్రిటీ షోల‌తో మెరుస్తోంది.