Begin typing your search above and press return to search.

దివాళీ వైబ్స్.. గులాబీ పువ్వులా ఆకట్టుకుంటున్న సోఫీ చౌదరి!

ఇదిలా ఉండగా తాజాగా గ్లామర్ అందాలతో ఆడియన్స్ ను కట్టిపడేస్తూ దీపావళి వైబ్స్ అంటూ గులాబీ పువ్వలా.. తన మేనిఛాయతో అందరినీ ఆకట్టుకుంది సోఫీ చౌదరి.

By:  Madhu Reddy   |   21 Oct 2025 4:00 PM IST
దివాళీ వైబ్స్.. గులాబీ పువ్వులా ఆకట్టుకుంటున్న సోఫీ చౌదరి!
X

సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సెలబ్రిటీల దీపావళి వేడుకకు సంబంధించిన ఫోటోలు దర్శనమిస్తున్నాయి. టాలీవుడ్ మొదలుకొని బాలీవుడ్ వరకు ప్రతి ఒక్కరూ ఈ దీపావళి వేడుకలను అత్యంత ఘనంగా సంబరంగా జరుపుకున్నట్లు తెలుస్తోంది. ఒక్కొక్కరు ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకుంటున్నారు.




ఈ క్రమంలోనే అటు సింగిల్స్ ఇటు ఫ్యామిలీలు ఫోటోలు షేర్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా గ్లామర్ అందాలతో ఆడియన్స్ ను కట్టిపడేస్తూ దీపావళి వైబ్స్ అంటూ గులాబీ పువ్వలా.. తన మేనిఛాయతో అందరినీ ఆకట్టుకుంది సోఫీ చౌదరి. సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ఇంస్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫోటోలు పంచుకుంది ఈ ముద్దుగుమ్మ. అందులో భాగంగానే సోఫీ చౌదరి షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఈ ఫోటోల విషయానికి వస్తే.. సాఫ్ట్ సిల్క్ లైట్ పింక్ కలర్ చీర కట్టుకున్న ఈమె.. అందుకు కాంబినేషన్ లో స్లీవ్ లెస్ బ్లౌజ్ ధరించి అందాలతో మెస్మరైజ్ చేసింది. పోనీటైల్ వేసి పువ్వులు చుట్టి తన మేకోవర్ను ఫుల్ ఫిల్ చేసింది. సింపుల్ జువెలరీతో తన అందాన్ని రెట్టింపు చేసిందని చెప్పవచ్చు.




గులాబీ రంగు చీరలో తన మేనిఛాయను రెట్టింపు చేసుకున్న సోఫీ చౌదరి చిన్నగా స్మైల్ ఇస్తూ ఆ ఫోటోలకు ప్రాణం పోసింది అని చెప్పవచ్చు. ప్రస్తుతం అమ్మడి అందాలు దీపావళి వేళ సరికొత్త కాంతులను నింపుతున్నాయని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సోఫి చౌదరి విషయానికి వస్తే.. తన అందంతో నటనతో ఎప్పటికప్పుడు ఆకట్టుకునే ఈమె బాలీవుడ్ తో పాటూ తెలుగులో కూడా నటించింది.




మాంచెస్టర్ ఇంగ్లాండ్ లో 1982 ఫిబ్రవరి 8న జన్మించిన ఈమె ఇండియాలోనే నివసిస్తోంది. బ్రిటిష్ గాయనిగా, నటిగా పేరు సొంతం చేసుకున్న సోఫీ చౌదరి ప్రధానంగా బాలీవుడ్ చిత్రాలలో నటిస్తోంది. అంతేకాదు MTV ఇండియా VJ గా కూడా పని చేసింది. మోడల్ గా కెరియర్ ను ఆరంభించిన సోఫీ చౌదరి టెలివిజన్ ప్రజెంటర్ గా కూడా పనిచేసింది.




ఈమె సినీ రంగ ప్రవేశం విషయానికి వస్తే 2005 లో డేవిడ్ ధావన్ నటించిన షాది నంబర్ వన్ అనే సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత 2006లో ప్యార్ కే సైడ్ ఎఫెక్ట్స్ సినిమాతో మంచి పాపులారిటీ అందుకున్న ఈమె.. ఆ తర్వాత 2013లో వన్స్ అపాన్ ఏ టైం ఇన్ ముంబై దోబారా సినిమాలో గెస్ట్ పాత్ర పోషించింది. అలాగే షూట్ అవుట్ ఎట్ వాడాలా చిత్రంలో నృత్య ప్రదర్శనలో కనిపించి ఆకట్టుకుంది.




అంతేకాదండోయ్ ఈమె తెలుగు చిత్రాలలో కూడా కనిపించింది. 2014లో సుకుమార్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వచ్చిన 1: నేనొక్కడినే సినిమాలో స్పెషల్ సాంగ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. హిందీ తో పాటు తెలుగులో కూడా నటించి ప్రేక్షకులకు దగ్గరై .. ఇప్పుడు సోషల్ మీడియాలో దీపావళి సందర్భంగా ప్రత్యేకమైన ఫోటోలను అభిమానులతో పంచుకుంది.