సల్మాన్ ఖాన్- మాధురి దీక్షిత్ మంచం విరిగే సీన్ వెనుక నిజం!
సల్మాన్ ఖాన్, మాధురి దీక్షిత్ నటించిన 1994 క్లాసిక్ ‘హమ్ ఆప్కే హై కౌన్’లో మంచం విరిగిపోయే కామెడీ సీన్ వెనుక నిజ జీవిత సంఘటన ఉందని దర్శకుడు సూరజ్ బర్జాత్యా వెల్లడించారు. తన 13వ ఏట ఓ పెళ్లిలో చూసిన ఘటనను గుర్తుపెట్టుకుని, సినిమా స్క్రిప్ట్‌లో ఈ సన్నివేశాన్ని చేర్చినట్లు ఓ టాక్ షోలో తెలిపారు.
By: Srikanth Kontham | 16 Nov 2026 1:28 PM ISTబాలీవుడ్ చరిత్రలో ఆల్ టైమ్ క్లాసికల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా నిలిచిన చిత్రం `హమ్ ఆ.ప్కే హై కౌన్`. సల్మాన్ ఖాన్, మాధురి దీక్షిత్ జంటగా సూరజ్ బర్జాత్యా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలోని ప్రతి సన్నివేశం ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ముఖ్యంగా చిత్రంలో సల్మాన్- మాధురిల మధ్య వచ్చే సరదా సన్ని వేశాలు ఇప్పటికీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయి. అలాంటి మెమరబుల్ సన్నివేశాల్లో ఇదొకటి.
ఇద్దరూ ఒకరినొకరు ఆటపట్టించుకుంటూ చెప్పుల కోసం పరుగెత్తుతూ అకస్మాత్తుగా మంచంపై పడిపోవడం.. ఆ బరువుకి మంచం విరిగిపోవడం. ఈ సరదా సీక్వెన్స్ అప్పటి ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. అయితే ఈ ఐకానిక్ సీన్ సినిమా కోసం రాసుకున్న కల్పిత సన్నివేశం కాదని సూరజ్ బర్జాత్యా నిజ జీవితంలో జరిగిన ఓ సంఘటన ఆధారంగానే తెరకెక్కించినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఓ టాక్ షోలో సూరజ్ బర్జాత్యా ఈ ఆసక్తికర విషయాన్ని రివీల్ చేసారు. `నేను 13 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ముంబైలో జరిగిన ఒక వివాహ వేడుకకు హాజరయ్యాను. ఆ పెళ్లి వేడుకలో ఒక అమ్మాయి తన కజిన్‌ను కొట్టడంతో..కోపంతో అతడు ఆ అమ్మాయి వెనుక పరుగెత్తాడు. ఆ సరదా పరుగులాటలో ఇద్దరూ ఊహించని విధంగా అక్కడున్న ఒక మంచంపై పడిపోయారు. ఆ దెబ్బకు ఆ మంచం ఒక్కసారిగా విరిగిపోయింది.
చిన్నతనంలో చూసిన ఆ రియల్ లైఫ్ సంఘటన నా మనసులో బలంగా నాటుకుపోయింది. సంవత్సరాల తరువాత `హమ్ ఆప్కే హై కౌన్` సినిమా స్క్రిప్ట్ రాస్తున్న సమయంలో మళ్లీ ఆ నాటి ఘటన గుర్తుకొచ్చింది. దాంతో అదే సీన్‌ను సల్మాన్ ఖాన్- మాధురి దీక్షిత్ లపై వినోదాత్మకంగా మలచగా అది థియేటర్లలో రికార్డ్ స్థాయి విజయాన్ని సాధించిందన్నారు
1994లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలు నమోదు చేసింది. ఈ సినిమా భారతీయ సినిమా కుటుంబ విలువలకు కొత్త నిర్వచనం చెప్పింది. సినిమాలో పాటలు.. సన్నివేశాలు ఇన్నేళ్లయినా ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోవడానికి ఇలాంటి రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ కూడా ఓ కారణమని చెప్పొచ్చు. దర్శకుడు పంచుకున్న క్యూట్ అండ్ ఇంట్రెస్టింగ్ బ్యాక్‌స్టోరీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పాత సినిమాల్లో సన్నివేశాల్లో ఎంతో రియలిస్టిక్ గా ఉండేవనడంలో ఎలాంటి సందేహం లేదు. యాక్షన్..రొమాన్స్ ఏదైనా పెద్దగా టెక్నాలజీ అందుబాటులో లేకపోయినా? ఆ సన్నివేశాలను ఎంతో వాస్తవికంగా చిత్రీకరించి ప్రేక్షకుల్ని మెప్పించేవారు. కానీ నేడు టెక్నాలజీ అందుబాటులో ఉన్నా? అంత రియలిస్టిక్ గా సన్నివేశాలు అనిపించడం లేదన్నది కాదనలేని నిజం.
