ఒకేరోజు 100 సిగరెట్లు కాల్చాను.. సంచలన నిజం బయటపెట్టిన అలియా తల్లి!
1993లో ‘గుమ్రా’ సినిమా షూటింగ్ సమయంలో ఆలియా భట్ తన కడుపులో ఉన్న విషయం సోనీ రజ్దాన్‌కు తెలియదట. ఓ స్మోకింగ్ సీన్ కోసం ఒకే రోజులో దాదాపు 100 సిగరెట్లు తాగినట్లు తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఐదు నెలల విరామం తర్వాత షూటింగ్‌కు వచ్చేసరికి బేబీ బంప్ కనిపించడంతో కాస్ట్యూమ్స్ మార్చాల్సి వచ్చిందని గుర్తుచేసుకున్నారు.
By: Madhu Reddy | 16 Nov 2026 1:24 PM ISTబాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ ప్రెగ్నెన్సీ టైమ్‌లో కూడా యాక్షన్ సీన్లు చేస్తూ సినిమాల్లో నటించిన విషయం మనందరికీ తెలుసు. అయితే, ఆ డెడికేషన్ ఆలియాకు తన తల్లి సోనీ రజ్దాన్ నుంచే వచ్చిందట! తాజాగా ఓ ఇంటర్వ్యూలో సోనీ రజ్దాన్ తన పాత జ్ఞాపకాలను పంచుకుంటూ ఒక షాకింగ్ విషయం చెప్పారు. ఆలియా కడుపులో ఉన్నప్పుడు, తెలియకుండానే తాను ఒకే రోజులో దాదాపు 100 సిగరెట్లు తాగానని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆ విశేషాలు చూద్దాం..
‘గుమ్రా’ షూటింగ్లో ఏం జరిగిందంటే? :
ఇక 1993లో మహేశ్ భట్ డైరెక్షన్లో వచ్చిన ‘గుమ్రా’ సినిమా షూటింగ్ టైమ్‌లో సోనీ రజ్దాన్ రెండోసారి ప్రెగ్నెంట్ అయ్యారు. ఆ సినిమాలో ఒక స్మోకింగ్ సీన్ షూట్ చేయాల్సి వచ్చింది. ఆ సీన్ సరిగ్గా రావడం కోసం సోనీ ఒకే రోజులో దాదాపు 100 సిగరెట్లు తాగారట, నిజానికి అప్పటికి ఆలియా తన కడుపులో ఉన్న విషయం ఆమెకు అస్సలు తెలియదట. ఆ తర్వాత తనకు సిగరెట్లు తాగాలనే కోరిక బాగా పెరిగిపోయిందని సోనీ నవ్వుతూ గుర్తుచేసుకున్నారు.
కాస్ట్యూమ్స్ టైట్ అవ్వడంతో మార్పులు:
అంతేకాదు, ఆలియా కడుపులో ఉన్నప్పుడే ‘గుమ్రా’ సినిమాలోని ఫేమస్ ఉరితీత సీన్లో కూడా సోనీ నటించారట. ఆ తర్వాత షూటింగ్‌కు ఐదు నెలలు గ్యాప్ వచ్చింది. మళ్లీ సెట్స్‌లోకి వెళ్లేసరికి బేబీ బంప్ కనిపించడం మొదలైంది. దాంతో పాత కాస్ట్యూమ్స్ పట్టకపోవడంతో, వాటిని మళ్లీ ఆల్టర్ చేయాల్సి వచ్చిందని ఆమె చెప్పారు.
అప్పటి రోజుల్లో తల్లుల కష్టాలు వేరు:
తను మొదటిసారి ప్రెగ్నెంట్ అయినప్పుడు ‘బునియాద్’ సీరియల్ చేస్తున్నానని, అప్పుడు రమేశ్ సిప్పీ గారు తనకు కారు పంపి ఎంతో సపోర్ట్ చేశారని సోనీ తెలిపారు. కానీ అప్పట్లో హీరోయిన్లకు పిల్లలు ఉన్నారంటే ప్రొడ్యూసర్లు టెన్షన్ పడేవారట. పిల్లలకు ఒంట్లో బాగోలేకపోతే షూటింగ్ ఆపేసి వెళ్లిపోతారేమో అని భయపడేవారని ఆమె చెప్పారు. ఒకసారి తన ఇద్దరు కూతుళ్లు షహీన్, ఆలియా ఇంటి బయట వుండాలిసివచ్చిందని ఆ టైం లో తను సెట్లో ఎంత టెన్షన్ పడ్డారో గుర్తుచేసుకున్నారు.
ఇప్పటి ఇండస్ట్రీ తీరుపై హ్యాపీ:
ఇక మహేశ్ భట్‌ను పెళ్లి చేసుకున్నాక తనకు పని అవసరం లేదనుకుని చాలామంది అవకాశాలు ఇవ్వలేదని, ఆ టైమ్‌లో ‘సినీవిస్టాస్’ సంస్థ తనకు వరుస సీరియల్స్ ఇచ్చి ఆదుకుందని సోనీ చెప్పారు. అయితే, ఇప్పుడు ఇండస్ట్రీలో ఆలోచనలు పూర్తిగా మారిపోయాయని ఆమె ఆనందం వ్యక్తం చేశారు. ఆలియా తన మాతృత్వాన్ని దాచుకోవాల్సిన అవసరం లేకుండా, ఎంతో ఫ్రీగా షూటింగ్స్ చేసుకోవడం చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని అన్నారు.
ఇక తల్లి కష్టాన్ని, పని పట్ల ఆమెకున్న ఇష్టాన్ని చూసి పెరిగింది కాబట్టే ఆలియా భట్ కూడా ఇవాళ ఇంత గొప్ప స్థాయిలో ఉంది. అప్పటి రోజుల్లో సోనీ రజ్దాన్ పడిన కష్టాలు నిజంగా ఎంతో మందికి స్ఫూర్తి.
