అందాల నటి బేబి బంప్ ఫోటోషూట్ వైరల్
తెలుగు, హిందీ చిత్రాలలో సుపరిచితురాలైన నటి సోనారికా భడోరియా. బుల్లితెరపైనా ఈ భామ పాపులర్. దేవోన్ కే దేవ్ మహాదేవ్ లో `పార్వతి` పాత్ర పోషించిన సోనారికా భడోరియా అత్యంత గుర్తింపు పొందింది.
By: Sivaji Kontham | 2 Dec 2025 9:00 AM ISTతెలుగు, హిందీ చిత్రాలలో సుపరిచితురాలైన నటి సోనారికా భడోరియా. బుల్లితెరపైనా ఈ భామ పాపులర్. దేవోన్ కే దేవ్ మహాదేవ్ లో `పార్వతి` పాత్ర పోషించిన సోనారికా భడోరియా అత్యంత గుర్తింపు పొందింది. 2024 ఫిబ్రవరిలో ఈ భామ వికాస్ పరాశర్‌ను వివాహం చేసుకుంది. ఇప్పుడు తన మొదటి బిడ్డకు జన్మనివ్వడానికి సోనారిక సిద్ధంగా ఉంది.
తాజాగా సోనారికా భడోరియా తన ఇన్‌స్టా ఖాతాలో ప్రసూతి షూట్ నుండి పలు ఫోటోలను పోస్ట్ చేసింది. బేబి బంప్ తో ఎంతో ఆనందంగా కనిపించిన సోనారిక తన జీవితంలో అత్యంత ఆనంద క్షణాలను ఆస్వాధిస్తోంది. ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో, సోనారికా - వికాస్ దంపతులు గర్భధారణను ప్రకటించారు. ఇప్పుడు స్పెషల్ ఫోటోషూట్ తో ప్రజల్లోకి మరింతగా చేరువైంది ఈ వార్త.
సోనారికా భడోరియా ఫిబ్రవరి 18న రాజస్థాన్‌లోని సవాయి మాధోపూర్‌లో వికాస్ పరాశర్‌ను వివాహం చేసుకుంది. సోనారికా తన సోదరుడి స్నేహితుడు వికాస్‌ను ఒక జిమ్‌లో కలిసింది. ఆ తర్వాత ఇద్దరి మధ్యా ప్రేమ వికసించింది.
సోనారిక ఇంతకుముందు ఓ ఇంటర్వ్యూలో ఒక నటుడిన పెళ్లాడనని, ఇండస్ట్రి బయటి వ్యక్తిని పెళ్లాడతానని ప్రకటించింది. అందుకు తగ్గట్టే జిమ్ లో సహచరుడిని పెళ్లాడింది.
దేవోన్ కే దేవ్ మహదేవ్, పృథ్వీ వల్లభ్ -ఇతిహాస్ భీ, రహస్య భీ, దస్తాన్-ఎ-మొహబ్బత్ సలీం అనార్కలి, ఇష్క్ మే మార్జావాన్ వంటి సీరియల్స్ లో సోనారిక నటించింది. టీవీ రంగంలో నటిగా విజయం తర్వాత జాదూగాడు, ఈడో రకం ఆడో రకం వంటి చిత్రాలతో సోనారికా తెలుగు సినీరంగంలోను ప్రవేశించింది.
