Begin typing your search above and press return to search.

సెట్స్ లో ఎలాంటి ఎఫైర్ పెట్టుకోలేదు!

అయితే వీటి గురించి సోన‌మ్ ఏ రోజు ఎక్క‌డా ఓపెన్ అయింది లేదు. ఈ నేప‌థ్యంలో తాజాగా నాటి ప్ర‌చారంపై స్పందించి షాక్ ఇచ్చారు.

By:  Srikanth Kontham   |   22 Jun 2026 12:00 AM IST
సెట్స్ లో ఎలాంటి ఎఫైర్ పెట్టుకోలేదు!
X

'త్రిదేవ్' లోని `ఓయే ఓయే.. తిర్చి టోపి వాలే` పాట తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటి సోనమ్ ఖాన్. 1980- 90ల కాలంలోనే తన గ్లామర్, నటనతో కుర్రకారును ఊపేసిన బ్యూటీ. అయితే కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే చిత్ర పరిశ్రమకు దూరమయ్యారు. ఆ సమయంలో సోన‌మ్ ఆ చిత్ర దర్శకుడు రాజీవ్ రాయ్‌కు మధ్య ఉన్న సంబంధంపై బాలీవుడ్ మీడియాలో అనేక రూమర్లు ప్రచారంలో ఉండేవి. అయితే వీటి గురించి సోన‌మ్ ఏ రోజు ఎక్క‌డా ఓపెన్ అయింది లేదు. ఈ నేప‌థ్యంలో తాజాగా నాటి ప్ర‌చారంపై స్పందించి షాక్ ఇచ్చారు.

`త్రిదేవ్` సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో తమ మధ్య ఎలాంటి ప్రేమాయణం లేద‌న్నారు.

ఆ సమయంలో ఇద్ద‌రం వృత్తిపరమైన సంబంధాన్ని మాత్రమే కొనసాగించామన్నారు. నేను నటినైతే? ఆయ‌న‌ ద‌ర్శ‌కుడిగా మాత్ర‌మే కొనసాగాం ఎలాంటి సంబంధాల‌కు దారి తీయ‌లేద‌న్నారు. ముఖ్యంగా చిత్ర పరిశ్రమలో తరచూ వినిపించే డైరెక్టర్ ప్రివిలేజ్ అనే అంశాన్ని సోనమ్ పూర్తిగా తోసిపుచ్చారు. షూటింగ్ సమయంలో రాజీవ్ రాయ్ నుండి తనకు ఎలాంటి ప్రత్యేక రాయితీలు లభించలేదని.. అలాగే ఆయన కూడా తన అధికార పరిధిని దుర్వినియోగం చేయలేదని పేర్కొన్నారు.

మిగ‌తా న‌టీన‌టుల త‌ర‌హాలోనే తాను కూడా కూడా సెట్స్‌పై కష్టపడి పని చేశానని, క్రమశిక్షణతో వ్యవహరించానని గుర్తు చేసుకున్నారు. అయితే `త్రిదేవ్` విడుదలైన చాలా కాలానికి ఒకరినొకరు అర్థం చేసుకున్న తర్వాతే తాము వివాహం చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు సోన‌మ్ ఖాన్ తెలిపారు. షూటింగ్ రోజుల్లో కేవలం పనిపైనే దృష్టి పెట్టామని వ్యక్తిగత జీవితా నికి, వృత్తిపరమైన బాధ్యతలకు స్పష్టమైన సరిహద్దులు ఉండేవని స్పష్టం చేశారు.

ఆ రోజుల్లో ఒక సినిమా హిట్ అయినా? లేదా? నటి వరుసగా ఒకే దర్శకుడితో పనిచేసినా వారిద్దరి మధ్య ఏదో ఉందనే ముద్ర వేసేవారని అభిప్రాయ‌ప‌డ్డారు. ఇలాంటి ఊహాగానాలు మహిళా నటి పడే కష్టాన్ని, ప్రతిభను తక్కువ చేసి చూపేలా ఉంటాయన్నారు. సోన‌మ్ ఖాన్- రాజీవ్ రాయ్ 1991 లో వివాహం చేసుకున్నారు. కానీ ఆ బంధం కొం త‌కాల‌మే కొన‌సాగింది. 2016 లో విడాకుల‌తో వేర‌య్యారు. ఆ మాజీ దంప‌తుల‌కు ఓ బిడ్డ క‌ల‌రు. ఇక సోన‌మ్ ఖాన్ చాలా కాలంగా సినిమాలు చేయ‌లేదు. రాజీవ్ రాయ్ కూడా కెరీర్ లో ప‌ది ప‌న్నెండు సినిమాలు చేసారు. అయితే ఇప్ప‌టికీ ద‌ర్శ‌కుడిగా యాక్టివ్ గా ఉన్నారు. గ‌త ఏడాది `జోరా` అనే చిత్రాన్ని తెర‌కెక్కించారు. ప్ర‌స్తుతం జోరా `జోరావార్` అనే మ‌రో చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు.