Begin typing your search above and press return to search.

పిక్‌టాక్‌ : బ్లాక్‌ అండ్‌ గోల్డ్‌ లో అందాల సోనమ్‌

బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ వారసురాలు సోనమ్ కపూర్ హీరోయిన్‌గా సావరియాతో 2007లో హీరోయిన్‌గా ఇండస్ట్రీలో అడుగు పెట్టింది.

By:  Ramesh Palla   |   20 Aug 2026 9:00 PM IST
పిక్‌టాక్‌ : బ్లాక్‌ అండ్‌ గోల్డ్‌ లో అందాల సోనమ్‌
X

బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ వారసురాలు సోనమ్ కపూర్ హీరోయిన్‌గా సావరియాతో 2007లో హీరోయిన్‌గా ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. అంతకు ముందు సంజయ్‌ లీలా భన్సాలీ చిత్రం బ్లాక్‌ కి సహాయ దర్శకురాలిగా వర్క్‌ చేయడం ద్వారా 2005లోనే ఇండస్ట్రీకి పరిచయం అయింది. స్టార్‌ కూతురు అయినప్పటికీ ఇండస్ట్రీలో కింది స్థాయి నుంచి వచ్చే ఉద్దేశంతో సోనమ్‌ కపూర్‌ ఇలా కెరీర్‌ ఆరంభంలో సహాయ దర్శకురాలిగా వర్క్‌ చేసిందని అంటారు. సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వంలో వచ్చిన సావరియా సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. అనిల్‌ కపూర్ వారసురాలు అయినా కూడా ఇండస్ట్రీలో పెద్దగా పట్టించుకోలేదు. సోనమ్‌ కష్టపడి ఇండస్ట్రీలో ఆఫర్లు దక్కించుకుంటూ తనకంటూ గుర్తింపు దక్కించుకునే ప్రయత్నం చేసింది. 2010లో ఐ హేట్‌ లవ్‌ స్టోరీస్‌ సినిమాతో మొదటి కమర్షియల్‌ హిట్‌ను ఈ అమ్మడు దక్కించుకుంది.




బాలీవుడ్‌లో బ్యాక్‌ టు బ్యాక్‌ హిట్స్‌...

2010 నుంచి సోనమ్‌ కపూర్‌ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. బాలీవుడ్‌లో బ్యాక్ టు బ్యాక్‌ బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌ చిత్రాల్లో నటించింది. అంతే కాకుండా బాలీవుడ్‌ స్టార్స్‌ అందరితోనూ కలిసి నటించే అవకాశాలు దక్కించుకుంది. తక్కువ సమయంలోనే సోనమ్‌ కపూర్‌కి స్టార్‌ హీరోయిన్స్ రేంజ్‌ దక్కింది. ఎన్నో అవార్డ్‌లు, గుర్తింపు, ప్రముఖ మ్యాగజైన్స్‌ పై కవర్‌ పేజ్‌ ఫోటోలు ఇలా హాలీవుడ్‌ రేంజ్‌ హీరోయిన్స్‌ స్థాయిలో గుర్తింపు దక్కించుకుంది. వరుసగా సినిమాలు చేస్తున్న సమయంలోనే ప్రేమించిన ఆనంద్‌ ఆహుజా ను 2018 లో వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి కాస్త దూరంగా ఉంటూ వస్తోంది. అప్పుడప్పుడు సినిమాల్లో కనిపిస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో సోనమ్‌ కపూర్‌ హీరోగా సినిమాలు చేయడం లేదని చెప్పాలి. 2023లో బ్లైండ్‌ అనే సినిమాలో నటించింది. ఆ తర్వాత మళ్లీ ఈ అమ్మడు కనిపించలేదు.




సోనమ్‌ కపూర్‌ సోషల్‌ మీడియా...

సోనమ్‌ కపూర్ సినిమాలకు దూరంగా ఉంటున్నప్పటికీ సోషల్‌ మీడియాను మాత్రం వీడటం లేదు. రెగ్యులర్‌గా ఈమె ఫోటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడం చూస్తూనే ఉంటాం. ఈమె సినిమా ఈవెంట్స్‌కు హాజరు కావడం, అవార్డ్‌ ఫంక్షన్స్‌లో సందడి చేయడం, ఇంకా పబ్లిక్‌, ప్రైవేట్‌ ఈవెంట్స్‌కి వరుసగా హాజరు కావడం వల్ల అందరూ సోనమ్‌ ఇప్పటికీ స్టార్‌ హీరోయిన్‌ అనే అభిప్రాయంతో ఉంటారు. పైగా సోనమ్‌ కపూర్‌ ఇప్పటికీ అందం విషయంలో ఏమాత్రం తగ్గకుండా యంగ్‌ హీరోయిన్స్‌కి పోటీ అన్నట్లుగా ఉంటుంది. తాజాగా ఫిల్మ్‌ ఫేర్‌ అఫిషియల్‌ సోషల్‌ మీడియా పేజ్‌ల్లో షేర్‌ చేసిన ఫోటోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈసారి అంతకు మించి అన్నట్లుగా సోనమ్‌ కపూర్‌ అందంగా కనిపించడంతో సోషల్‌ మీడియాలో ఆమె గురించి ప్రముఖంగా చర్చ జరుగుతోంది. ఇంత అందంగా ఉన్న సోనమ్‌ సినిమాలకు దూరం ఎందుకు ఉందంటూ ప్రశ్నిస్తున్నారు.

అందాల ఆరబోతతో సోనమ్‌ కపూర్‌...

బ్లాక్ అండ్‌ గోల్డ్‌ కలర్‌ థీమ్‌లో సోనమ్‌ కపూర్‌ ధరించిన ఈ ఔట్‌ ఫిట్‌ చూపు తిప్పనివ్వడం లేదు. సాధారణంగా హీరోయిన్స్‌ గ్లామర్‌ ఫోటోలు షేర్‌ చేస్తే మాత్రమే నెటిజన్స్‌ తెగ షేర్‌ చేస్తూ ఉంటారు. కానీ సోనమ్‌ కపూర్‌ టాప్‌ టు బాటమ్ వరకు మొత్తం కవర్‌ చేసినప్పటికీ ఈ ఫోటోలను తెగ షేర్‌ చేస్తున్నారంటే ఆమె అందంతో ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇండస్ట్రీలో అడుగు పెట్టి రెండు దశాబ్దాలు అయినా, వయసు నాలుగు దశాబ్దాలు దాటినా కూడా ఇప్పటికీ సోనమ్‌ కపూర్‌ పాతికేళ్ల పడుచు అమ్మాయి మాదిరిగానే చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉందంటూ ఈ ఫోటోలు చూస్తే అనిపిస్తుందని నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ ఫోటోలకు చాలా మంది సోనమ్‌ తిరిగి హీరోయిన్‌గా వరుస సినిమాలు చేయాలని కోరుకుంటూ కామెంట్‌ చేస్తున్నారు. మరి సోనమ్‌ తిరిగి హీరోయిన్‌గా బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయా అనేది చూడాలి.