మరోసారి తల్లి కాబోతున్న బాలీవుడ్ హీరోయిన్?
సినిమాలు చేస్తున్నప్పుడే సోనమ్ 2022 ఆగస్ట్ లో తన మొదటి బిడ్డ వాయుకు జన్మనిచ్చారు.
By: Sravani Lakshmi Srungarapu | 2 Oct 2025 3:00 AM ISTబాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సోనమ్ కపూర్ ఆ తర్వాత తక్కువ టైమ్ లోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. బాలీవుడ్ లో పలువురు స్టార్ల సరసన నటించిన సోనమ్ కపూర్ 2018 మేలో తన ప్రియుడు ఆనంద్ అహుజాను సాంప్రదాయ బద్ధంగా ఇరు కుటుంబీకుల సమక్షంలో పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు.
సెకండ్ ట్రైమిస్టర్ లో సోనమ్
పెళ్లి చేసుకున్న తర్వాత కూడా సోనమ్ పలు సినిమాల్లో నటించారు. సినిమాలు చేస్తున్నప్పుడే సోనమ్ 2022 ఆగస్ట్ లో తన మొదటి బిడ్డ వాయుకు జన్మనిచ్చారు. ఇప్పుడు వాయుకి మూడేళ్లు. అయితే సోనమ్ ఇప్పుడు మరోసారి తల్లి కాబోతుందని బాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ మీడియా కథనాల ప్రకారం సోనమ్ కపూర్ ప్రస్తుతం సెకండ్ ట్రైమిస్టర్ లో ఉందని తెలుస్తోంది.
తల్లయ్యాక ఓపిక పెరిగింది
సోనమ్ ప్రెగ్నెన్సీ వార్త ఇరు కుటుంబాలకు ఎంతో ఆనందాన్ని కలిగించగా, త్వరలోనే ఈ విషయంపై సోనమ్ జంట నుంచి అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చే అవకాశముంది. కాగా గతంలో తల్లి కావడంపై సోనమ్ మాట్లాడుతూ, మాతృత్వం తనను చాలా మార్చేసిందని, తల్లిగా మారాక తాను చాలా స్ట్రాంగ్ గా అవడంతో పాటూ ఓపిక చాలా పెరిగిందని చెప్పారు.
బ్లైండ్ సినిమాలో ఆఖరిగా కనిపించిన సోనమ్
ఇక సోనమ్ కపూర్ కెరీర్ విషయానికొస్తే ఆమె ఆఖరిగా బ్లైండ్ అనే సినిమలో 2023లో కనిపించింది. 2011లో వచ్చిన బ్లైండ్ అనే కొరియన్ మూవీకి రీమేక్ గా ఆ సినిమా తెరకెక్కింది. ప్రస్తుతం ఆమె చేతిలో బ్యాటిల్ ఆఫ్ బిట్టోరా ఉంది. ఈ మూవీ అనుజా చౌహాన్ రాసిన నవల ఆధారంగా రూపొందించబడిందని తెలుస్తోంది. బ్యాటిల్ ఆఫ్ బిట్టోరా కాకుండా సోనమ్ చేతిలో మరో సినిమా లేదు.
