మామ్ అయిన తర్వాత మొదటి చిత్రం!
బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్ ధాంపత్య జీవితంలోకి అడుగు పెట్టిన తర్వాత మునుపటి లా స్పీడ్ గా సినిమాలు చేయని సంగతి తెలిసిందే.
By: Srikanth Kontham | 23 Sept 2025 2:00 PM ISTబాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్ ధాంపత్య జీవితంలోకి అడుగు పెట్టిన తర్వాత మునుపటి లా స్పీడ్ గా సినిమాలు చేయని సంగతి తెలిసిందే. అటుపై బేబి జన్మించడంతో పాపాయికే ఎక్కువ సమయం కేటాయించింది. వెండి తెరపై సోనమ్ కపూర్ కనిపించి రెండేళ్లు అవుతుంది.` బ్లైండ్` తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైంది. క్యామియో పాత్రల్లో కూడా కనిపించలేదు. పూర్తిగా ఫ్యామిలీ లైఫ్ కే బాండ్ అయింది. మరి ఇక అమ్మడు సినిమాలు చేయదా? నటనకు రిటైర్మెంట్ ఇచ్చేసిందా? అంటే అబ్బేం అలాంటిదేమీ లేదంటూ తాజా అప్ డేట్ అందించింది.
కుమారుడి కోసమే సమయమంతా:
ఈ గ్యాప్ కి గల కారణాన్ని రివీల్ చేసింది. బలమైన పాత్రల్లో మాత్రమే కనిపించాలనే కారణంగానే దూరంగా ఉన్నట్లు తెలిపింది. కొంత కాలం విరామం వచ్చినంత మాత్రాన ఎంపికల్లో ఎలాంటి తేడా ఉండదని స్పష్టం చేసింది. తల్లిగా వీలైనంనంత సమయాన్ని కుమారుడి కోసం కేటాయించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. జీవితంలో అవి ఎంతో ఆద్భుతమైన క్షణాలుగా భావించానంది. సినిమాలకు దూరమైనా ఈ అనుభూతి మాత్రం ఎంతో గొప్పగా ఉందంది. ఈ దశ తనని మరింత బలంగా మార్చిందన్నారు.
సినిమా వివరాలు గోప్యంగా:
`సహనంతో ఉండటం నేర్పించింది. నాలో బలహీనతలు తెలుసుకోవడానికి ఇది సరైన సమయంగా అనిపించింది. మళ్లీ కెమెరా ముందుకు రావడానికి సిద్దంగా ఉన్నాను. అమ్మ అయిన తర్వాత నా తొలి చిత్రం ఇదే ఏడాది ఆఖర్లో ప్రారంభమవుతుందని వెల్లడించింది. దీంతో సోనమ్ కపూర్ కంబ్యాక్ అధికారికంగా కన్పమ్ అయింది. అయితే ఆ సినిమా ఏంటి? ఏ హీరో సరసన నటిస్తుంది? దర్శకుడు ఎవరు? నిర్మాణ సంస్థ ఇలాంటి వివరాలేవి రివీల్ చేయలేదు. వాటి ప్రకటనకు ఇది సరైన సమయం గా భావించలేదు. అతి త్వరలోనే ఆ వివరాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది.
తండ్రికి తగ్గ తనయగా:
అనీల్ కపూర్ వారసురాలిగా సోనమ్ కపూర్ బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. `సవారియా`తో బ్లాక్ బస్టర్ అందుకుంది. అటుపై `ఢిల్లీ6`, `రాంజానా`, `నీర్జా`, `ప్రేమ్ రనత్ ధన్ పాయో`, `వీర్ ది వెడ్డింగ్`, `ప్యాడ్ మాన్` లాంటి ఎన్నో చిత్రాల్లో నటించి హిట్లు అందుకుంది. నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకుంది. కెరీర్ పీక్స్ లో ఉండగానే వివాహం చేసుకుంది. అటుపై బిడ్డ పుట్టడం అన్నీ అమ్మడి కెరీర్ లో వేగంగా జరిగిపోయాయి.
