Begin typing your search above and press return to search.

బేబి బంప్‌తో ఫ్యాష‌నిస్టా స్ట‌న్నింగ్ ఫోజ్

సోనమ్ కపూర్ - ఆనంద్ అహుజా దంపతులకు ఇప్పటికే `వాయు` అనే కుమారుడు ఉన్న సంగతి తెలిసిందే.

By:  Sivaji Kontham   |   4 Feb 2026 10:43 PM IST
బేబి బంప్‌తో ఫ్యాష‌నిస్టా స్ట‌న్నింగ్ ఫోజ్
X

క‌పూర్ ఫ్యాష‌నిస్టా సోనమ్ కపూర్ తన ఫ్యాషన్ సెన్స్‌తో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంది. ఇటీవ‌ల సినిమాల‌కు దూరంగా ఉంటూ, త‌న వ్య‌క్తిగ‌త జీవితాన్ని సెల‌బ్రేట్ చేయ‌డంపై శ్ర‌ద్ధ పెడుతోంది. ఇప్పుడు తన రెండవ బిడ్డ కోసం ఎదురుచూస్తున్న ఈ భామ తాజా ఫోటోషూట్ ఇంట‌ర్నెట్ లో సెన్సేష‌న్‌గా మారింది. ఫ్యాష‌నిస్టా సోన‌మ్ త‌న బేబి బంప్ ని ప్రద‌ర్శించినా కానీ ఎంతో స్టైలిష్‌గా కనిపిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు.

ముంబైలో సోన‌మ్ ఈ ఫోటోషూట్‌లో పాల్గొంది. `ఆల్ వైట్ లుక్` డిజైన‌ర్ ఫ్రాక్ లో సోన‌మ్ త‌న గ‌ర్భ‌ధార‌ణ‌ను ప్ర‌ద‌ర్శించిన తీరు ఎంతో ప్ర‌త్యేకంగా అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. ఫ్యాష‌న్ సెన్స్ ప‌రంగా.. సౌక‌ర్యం ప‌రంగా సోనమ్ ఆల్వేస్ ది బెస్ట్ అని నిరూపిస్తోంది. త‌న‌ సోదరి రియా కపూర్ - సాన్యా కపూర్ ఈ లుక్‌ను డిజైన్ చేశారు. సోనమ్ ఎప్పుడూ తన ప్రెగ్నెన్సీ సమయంలో కూడా ఫ్యాషన్‌ను సౌకర్యంతో ఎలా మేళవించాలో చూపించిన తీరు ఆక‌ట్టుకుంటోంది. ధ్రువ్ కపూర్ కస్టమ్ వైట్ షర్ట్, మ్యాక్సీ స్కర్ట్ త‌న హుందాత‌నాన్ని పెంచ‌డ‌మే గాక‌, ఎంతో సౌక‌ర్యంగా కుదిరింది. దీనికి తోడు మినిమ‌ల్ మేకప్, పరిమిత‌ యాక్సెసరీస్ తో సహజమైన గ్లో కనిపించేలా ప్లాన్ చేశారు.

సోనమ్ కపూర్ - ఆనంద్ అహుజా దంపతులకు ఇప్పటికే `వాయు` అనే కుమారుడు ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు రెండవ సారి తల్లి కాబోతున్న సోనమ్ ఈ ప్రయాణాన్ని చాలా ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నారు. సోన‌మ్ బేబి బంప్ ఫోటోషూట్ వైర‌ల్ గా దూసుకెళుతోంది. ఫ్యాష‌నిస్టా క‌ళ్ల జోడు స్టైల్ సంథింగ్ స్పెష‌ల్ గా ఉందంటూ అభిమానులు ప్ర‌శంసిస్తున్నారు.

సోన‌మ్ తిరిగి సినిమాల్లోకి ఎప్పుడు వ‌స్తుంది?

సోనమ్ కపూర్ సినిమాల్లోకి తిరిగి రావడానికి ఇంకా చాలా స‌మ‌యం ప‌డుతుంది. రెండవ ప్రెగ్నెన్సీ కారణంగా ఈ భామ‌ సినిమాలకు విరామం ఇచ్చారు. సోన‌మ్ పోస్టుల ప్ర‌కారం... 2026 వసంత కాలం లో తన రెండవ బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు ధృవీకరించారు. కాబట్టి 2026లో పూర్తిగా తన వ్యక్తిగత జీవితానికే సమయం కేటాయించాల్సి ఉంటుంది ..బిడ్డ‌కు ఆల‌నా పాల‌నా చూడాలి గ‌నుక న‌ట‌న‌లోకి రావ‌డానికి కుద‌ర‌క‌పోవ‌చ్చు.

అయితే ఫ్రెగ్నెన్సీ మ్యాట‌ర్ రివీల్ కాక ముందు, వాస్త‌వంగా తాను ఒక ప్రాజెక్టును ప్రారంభించాల‌ని సోన‌మ్ భావించారు. కానీ అనూహ్యంగా గ‌ర్భ‌ధార‌ణ క‌న్ఫామ్ అయింది. ఇప్పుడు ప్రెగ్నెన్సీ కారణంగా ఈ ప్రాజెక్టులు కొంచెం ముందుకు జరిగే అవకాశం ఉంది. ఫ్యాష‌నిస్టా సోన‌మ్ కంబ్యాక్ లో వినూత్న‌మైన న‌వ్య‌పంథా క‌థ‌ల్ని ఎంపిక చేసుకోవాలంటున్న‌ట్టు తెలుస్తోంది. ముఖ్యంగా నాయికా ప్రధాన పాత్రలు ఉన్న సినిమాలే చేయాలని నిశ్చయించుకున్నారు. స్త్రీ పాత్రకు ఒక లేయర్ ఉండి, కథకు అత్యంత కీల‌కంగా ఉంటుంది ఈ పాత్ర‌.

నిజానికి సోన‌మ్ 2023లో బ్లైండ్ అనే రీమేక్ చిత్రంలో న‌టించారు. ఈ క్రైమ్ థ్రిల్ల‌ర్ నేరుగా ఓటీటీ లో విడుదలయ్యింది. మ‌రో కొత్త సినిమా ప్రారంభించ‌డానికి ఇంకో ఏడాది ప‌ట్టొచ్చ‌ని అంచ‌నా వేస్తున్నారు.