Begin typing your search above and press return to search.

లండ‌న్ న‌డిబొడ్డున ప‌ని మ‌నుషుల కోసం ప్లాట్లు!

బాలీవుడ్ నటి, ఫ్యాషన్ ఐకాన్ సోనమ్ కపూర్ - ఆనంద్ అహూజా విలాసవంతమైన జీవనశైలితో తరచూ అంతర్జాతీయంగా వార్తల్లో నిలుస్తుంటారు.

By:  Srikanth Kontham   |   24 May 2026 5:00 PM IST
లండ‌న్ న‌డిబొడ్డున ప‌ని మ‌నుషుల కోసం ప్లాట్లు!
X

బాలీవుడ్ నటి, ఫ్యాషన్ ఐకాన్ సోనమ్ కపూర్ - ఆనంద్ అహూజా విలాసవంతమైన జీవనశైలితో తరచూ అంతర్జాతీయంగా వార్తల్లో నిలుస్తుంటారు. పెళ్లయినప్పటి నుండి లండన్, ముంబై నగరాల మధ్య జీవితాన్ని సమతుల్యం చేసుకుంటున్న జంట ఇది. యూకే రాజధాని లండన్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాంతంలో నివసిస్తున్నారు. అక్కడ వారికి సుమారు 270 కోట్ల భారీ విలువైన ఓ అద్భుతమైన మాన్షన్ ఉంది. విలాసానికి, వింటేజ్ కళాత్మకతకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే ఈ ఇల్లు సామాజిక మాధ్యమాలలో ఎప్పుడూ చర్చనీయాంశంగానే ఉంటుంది.

తాజాగా ఈ జంట విలాసవంతమైన భవనానికి సమీపంలోనే మరో భారీ రియల్ ఎస్టేట్ పెట్టుబడి పెట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు. త‌మ లండన్ మాన్షన్‌కు దగ్గరలోనే ఏకంగా ఐదు కొత్త ఫ్లాట్లను కొనుగోలు చేశారు. సాధారణంగా సెలబ్రిటీలు తమ వ్యక్తిగత అవసరాల కోసమో? కుటుంబ సభ్యుల కోసమో ?లేదా వ్యాపార పెట్టుబడి రూపంలోనో అదనపు ఆస్తులను కొనుగోలు చేస్తుంటారు. కానీ సోనమ్- ఆనంద్‌లు ఐదు ఫ్లాట్లను తమ ఇంట్లో పనిచేసే సిబ్బంది , గృహ సహాయకులకు ప్రత్యేకంగా వసతి సౌకర్యం కల్పించడం కోసం కొనుగోలు చేయడం విశేషం.

లండన్ వంటి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరంలో ప్రైమ్ లొకేషన్లలో నివాస గృహాల ధరలు ఆకాశాన్ని తాకుతుంటాయి. అలాంటి చోట సాధారణ సిబ్బంది కోసం ప్రత్యేకంగా ఐదు ఫ్లాట్లను కేటాయించడం అనేది అంతర్జాతీయంగా అరుదైన విషయం. తమ భద్రతతో పాటు, తమకు నిరంతరం సేవలు అందించే సిబ్బందికి కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతోనే వారు తమ నివాసానికి అతి సమీపంలోనే ఈ అదనపు వసతి గృహాలను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. సోనమ్ కపూర్ తండ్రి, సీనియర్ నటుడు అనిల్ కపూర్ కూడా కుమార్తె - అల్లుడి జీవనశైలిని వారి ఉన్నతమైన ఆలోచనలను పలు సందర్భాల్లో అభినందించారు.

ఆనంద్ అహూజా భారతదేశపు అతిపెద్ద టెక్స్‌టైల్ ఎగుమతి సంస్థలలో ఒకటైన షాహీ ఎక్స్‌పోర్ట్స్‌కు వారసుడు కావడంతో పాటు, అంతర్జాతీయంగా పలు ఫ్యాషన్, లైఫ్‌స్టైల్ బ్రాండ్స్ , వ్యాపారాలను విజయవంతంగా నడుపుతున్నారు. ఈ బలమైన ఆర్థిక నేపథ్యం , సోనమ్ కపూర్ సెలబ్రిటీ హోదా కలిసి లండన్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో ఇలాంటి ఓ అసాధారణమైన నిర్ణయం తీసుకోవడానికి దోహదపడ్డాయి. తాజా కొనుగోలుతో బిలియనీర్ల జీవన ప్రమాణాలు , వారి సిబ్బంది సంక్షేమంపై సరికొత్త చర్చ మొదలైంది.

అంతర్జాతీయ ప్రముఖులు తమ వ్యక్తిగత సహాయకులకు విలాసవంతమైన కార్లు, విమాన ప్రయాణ సౌకర్యాలు కల్పించడం సాధారణమే అయినా? లండన్ నడిబొడ్డున కోట్లాది రూపాయల విలువైన ప్రాపర్టీలను నివాసాల కోసం కొనివ్వడం అనేది కార్పొరేట్ సంస్థల ఉన్నత ఉద్యోగుల ప్రయోజనాలను తలపిస్తోంది. తమ కోసం నిరంతరం శ్రమించే వారి పట్ల ఈ స్టార్ దంపతులు చూపిస్తున్న బాధ్యతాయుతమైన వైఖరిని నెటిజన్లు సైతం ప్రశంసిస్తున్నారు.