మళ్ళీ మళ్ళీ మళ్ళీ లేవండి… ఎప్పుడూ కుంగిపోవద్దు!
పంజాబీ చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయికగా ఒక వెలుగు వెలిగిన సోనమ్ బజ్వా.. ఇప్పుడు బాలీవుడ్‌లోనూ తనదైన ముద్ర వేస్తూ దూసుకెళుతున్నారు.
By: Sivaji Kontham | 8 May 2026 6:00 PM ISTపంజాబీ చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయికగా ఒక వెలుగు వెలిగిన సోనమ్ బజ్వా.. ఇప్పుడు బాలీవుడ్‌లోనూ తనదైన ముద్ర వేస్తూ దూసుకెళుతున్నారు. అయితే గ్లామర్ ప్రపంచంలో తన ప్రయాణం అనుకున్నంత సులభంగా సాగలేదు. ముఖ్యంగా బాలీవుడ్ అరంగేట్రం సమయంలో హిందీ నిర్మాతలు తనపై చూపిన అపనమ్మకాన్ని బజ్వా ధైర్యంగా గుర్తు చేసుకున్నారు. ''పంజాబీ సినిమా చిన్న ఇండస్ట్రీ కావడం వల్ల నేను హిందీ మాట్లాడగలనా లేదా అనే సందేహం వారిలో ఉండేది. కానీ అన్నిటికీ నా ప్రతిభతో సమాధానం ఇవ్వాలని నిర్ణయించుకున్నాను'' అని బజ్వా పేర్కొన్నారు.
సోనమ్ బజ్వా కేవలం నటనలోనే కాకుండా... సోషల్ మీడియా వేదికగా తన గ్లామర్ ఫోటోషూట్లతో ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉంటారు. తాజాగా ఈ ట్యాలెంటెడ్ బ్యూటీ ధరించిన ట్రెండీ మిడీ డ్రెస్ యువతరం హృదయాలను గెలుచుకుంటోంది. అద్భుతమైన అందచందాల ఎలివేషన్ తో సోనమ్ ఇచ్చిన ఫోజులు ఇప్పుడు ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. గ్లామర్ - పర్ఫామెన్స్ రెండింటినీ బ్యాలెన్స్ చేయడంలో బజ్వా శైలి ప్రత్యేకం. ఈ క్రమంలోనే ''మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉండాలి.. ఎప్పుడూ కుంగిపోకూడదు'' అనే తన జీవిత సూత్రాన్ని అభిమానులతో షేర్ చేసుకున్నారు.
కెరీర్ విషయానికి వస్తే.. ఎప్పుడూ సోలో హీరోయిన్ పాత్రలకే ప్రాధాన్యతనిచ్చే సోనమ్.. బాలీవుడ్‌లో `హౌస్‌ఫుల్ 5`వంటి మల్టీస్టారర్ చిత్రాన్ని ఎంచుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. దీనిపై బజ్వా స్పందిస్తూ.. ''రిస్క్ తీసుకోకపోతే నటుడి ప్రయాణంలో ఉత్సాహం ఉండదు. స్క్రీన్ టైమ్ ఎంత ఉన్నా.. నాకు దక్కిన కొన్ని సీన్లలోనే నా సత్తా చాటగలననే నమ్మకం నాకుంది! అని తన ఆత్మవిశ్వాసాన్ని చాటుకున్నారు. పంజాబీలో తాను స్టార్ అయినా... హిందీ మార్కెట్ కోసం అంచెలంచెలుగా ఎదుగుతూ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.
అభిమానుల ఒత్తిడి గురించి ప్రస్తావిస్తూ.. ఫ్యాన్స్ మన నుంచి ఎక్కువ ఆశిస్తారు.. ఆ అంచనాలే మనకు భయాన్ని, బాధ్యతను కలిగిస్తాయి! అని సోనమ్ తెలిపారు. అందుకే కొన్ని సినిమాలు ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరువ కావడానికి.. మరికొన్ని విభిన్నమైన పాత్రల కోసం ఎంచుకుంటానని బజ్వా వివరించారు. తన అంతరాత్మ ప్రబోధాన్ని నమ్ముతూ.. విజ్ఞతతో ప్రాధాన్యతలను ఎంచుకోవడం వల్లే తాను ఇంతవరకు రాగలిగానని వెల్లడించారు.
వృత్తిపరంగా చూస్తే.. సోనమ్ బజ్వా నటించిన మల్టీస్టారర్ బార్డర్ 2 సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. తదుపరి `పిట్ సియాపా` అనే వినూత్నమైన పంజాబీ కామెడీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాలో `నిమ్మి` అనే పాత్రలో కనిపించారు. ఎన్ఆర్ఐల కోసం వర్చువల్ అంత్యక్రియలు నిర్వహించే ఒక వినూత్నమైన బిజినెస్ నేపథ్యంలో ఈ కథ సాగుతుందని కథనాలొచ్చాయి.
