పిక్ టాక్ : అందమైన చీర కట్టులో 50 ఏళ్ల సోనాలి
50 ఏళ్ల సోనాలి బింద్రే రెగ్యులర్‌గా తన అందమైన ఫోటోలను షేర్ చేస్తారు, ఎప్పటికప్పుడు ఆ ఫోటోలు అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటాయి
By: Ramesh Palla | 30 July 2025 11:43 AM ISTఇండస్ట్రీకి ఎంతో మంది హీరోయిన్స్ వస్తుంటారు.. పోతుంటారు. కానీ కొద్ది మంది హీరోయిన్స్ మాత్రమే ఎప్పటికీ గుర్తుండి పోతారు. కొందరు హీరోయిన్స్ ఇండస్ట్రీలో అడుగు పెట్టి రెండు మూడు దశాబ్దాలు అవుతున్నా ఇప్పటికీ ప్రేక్షకులను మెప్పిస్తూనే ఉంటారు. వారిలో సోనాలి బింద్రే ఒకరు అనడంలో సందేహం లేదు. ఈమె మధ్యలో సినిమాలను మానేసినా కూడా జనాలు ఈమెను మర్చి పోలేదు. ఈమె గురించిన వార్తలు ఎప్పుడూ వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా సోనాలి క్యాన్సర్‌తో పోరాటం చేసి గెలిచి నిలిచింది. దాంతో ఆమెను ఎంతో మంది ఆదర్శంగా తీసుకుని ఆరాధిస్తూ ఉంటారు, వయసు మీద పడ్డా కూడా క్యాన్సర్‌తో పోరాటం చేసి, తిరిగి సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన అరుదైన స్టార్ అంటూ ఈమె గురించి ఆమె సన్నిహితులు, అభిమానులు చెబుతూ ఉంటారు.
సోనాలి బింద్రే అందమైన ఫోటో షూట్
అందమైన సోనాలి బింద్రే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో రెగ్యులర్‌గా తన అందమైన ఫోటోలను షేర్ చేస్తూ వస్తోంది. సాధారణంగా హీరోయిన్స్ సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేయడం కామన్‌గా చూస్తూ ఉంటాం. యంగ్ హీరోయిన్స్ స్కిన్ షో చేస్తే, నడుము అందం చూపిస్తే ఖచ్చితంగా వైరల్ అవుతాయి. యంగ్ హీరోయిన్స్ చీర కట్టి నడుము అందం చూపించి, నాభి అందాలను చూపిస్తే నెటిజన్స్ ఆ ఫోటోలను తెగ వైరల్ చేయడం మనం చూస్తూ ఉంటాం. సీనియర్ హీరోయిన్స్ అలా స్కిన్ షో చేస్తే ఎబెట్టుగా ఉంటుంది. అలా చూపించినా కూడా చూసేందుకు ఆసక్తి చూపించరు. వారి వయసు తగ్గట్లుగా, వారి అందాన్ని చూపించినప్పుడు మాత్రమే ఆ ఫోటోలు వైరల్ అవుతూ ఉంటాయి.
50 ఏళ్ల వయసులోనూ అదే అందం
సోనాలి బింద్రే ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటారు. 50 ఏళ్ల సోనాలి బింద్రే రెగ్యులర్‌గా తన అందమైన ఫోటోలను షేర్ చేస్తారు, ఎప్పటికప్పుడు ఆ ఫోటోలు అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటాయి. శృతి మించకుండా అందమైన ఫోటోలను, అందంగా కనిపిస్తూ సోనాలి షేర్ చేయడం మనం చూస్తూ ఉంటాం. తాజాగా మరోసారి సోనాలి బింద్రే తన చీర కట్టు ఫోటోలతో సర్ ప్రైజ్ చేసింది. పింక్ చీర కట్టులో సోనాలి అందమైన ఫోటోలను షేర్ చేశారు. 50 ఏళ్ల వయసులోనూ సోనాలి చాలా అందంగా ఉన్నారు అంటూ అభిమానులతో పాటు అంతా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ సీనియర్ హీరోలకు జోడీగా హీరోయిన్‌గా నటించేంత అందం సోనాలి సొంతం అనే అభిప్రాయం ను కొందరు వ్యక్తం చేస్తున్నారు.
మహేష్ బాబు మురారితో ఎంట్రీ
తెలుగు ప్రేక్షకులకు 2001లో మొదటి సారి మురారి సినిమాలో మహేష్ బాబుకు జోడీగా నటించడం ద్వారా పరిచయం అయింది. తెలుగులో బ్యాక్ టు బ్యాక్ పెద్ద హీరోల సినిమాల్లో నటించే అవకాశంను దక్కించుకుంది. తెలుగులో ఈమె చేసిన సినిమాల్లో ఎక్కువ శాతం మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. మురారి, ఇంద్ర, ఖడ్గం, మన్మధుడు, శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలు ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకున్నాయో చెప్పనక్కర్లేదు. ఈమె నటించిన బాలకృష్ణ పల్నాటి బ్రహ్మనాయుడు సినిమా మాత్రమే నిరాశ పరిచింది. తెలుగులో ఈమె శంకర్ దాదా ఎంబీబీఎస్ తర్వాత సినిమాలు చేయలేదు. తిరిగి ఈమె తెలుగు సినిమాలు చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.
ఈ ఏడాదిలో ఈమె 'బి హ్యాపీ' అనే హిందీ సినిమాలో గెస్ట్‌గా నటించింది. ముందు ముందు మరిన్ని సినిమాల్లో నటించాలని కోరుకుంటున్నట్లుగా సోనాలి చెప్పకనే చెప్పింది. ప్రస్తుతం ఒకటి రెండు హిందీ సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. వచ్చే ఏడాదిలో సోనాలి నుంచి ఫుల్ లెంగ్త్ పాత్ర సినిమా వచ్చే అవకాశాలు ఉన్నాయని బాలీవుడ్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. అదే సమయంలో తెలుగు సినిమాల్లోనూ సోనాలి నటిస్తే చూడాలని తెలుగు ప్రేక్షకులు కోరుకుంటున్నారు.
