వాళ్లిద్దరి బాండింగ్ ఎంత స్ట్రాంగ్ అంటే?
ఏ విషయాన్ని ఎలా ట్రీట్ చేయాలి? అని తెలిసినా కొన్ని క్షణాలు పాజిటివ్ గా ఆలోచించడం కంటే నెగిటివిటీనే బ్రెయిన్ కోరుకునేదంది.
By: Srikanth Kontham | 7 Dec 2025 1:00 AM ISTబాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా-రైటర్ జహీర్ ఇక్బాల్ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ జంట ధాంపత్య జీవితం సంతోషంగా సాగిపో తుంది. అయితే సోనాక్షి...జహీర్ ని పెళ్లి చేసుకోవడం ఇంట్లో ఇష్టం లేదనే కథనాలు తెరపైకి వచ్చాయి. కొన్ని రకాల అసమానతలు కారణంగా సోనాక్షి కుటుంబ సభ్యులకు ఇష్టం లేనట్లు వార్తలొచ్చాయి. ఈ వివాహం ఎంతో నిరాడం బరంగా జరిగింది. ఇరు పెద్దల సమక్షంలోనే వివాహం జరిగింది. ఈ వేడుకలో సోనాక్షి సోదరుడు కనిపించలేదు. దీంతో సోనాక్షి పెళ్లికి తల్లిదండ్రులు అంగీక రించినా? సోదరుడికి ఇష్టం లేదన్నది ప్రధానంగా హైలైట్ అయింది.
ప్రేమలో ఉన్నప్పుడే కలహాలు:
ఇదంతా పక్కన బెడితే ఆ జంట ఇప్పుడు ఎంతో అన్యోన్యంగా ఉంది. అయితే ఈ జోడీ ప్రేమలో ఉన్న సమయంలోనే అన్నిరకాల ఎడబాట్లు చూసేసింది. మూడేళ్ల ప్రేమలో ఎన్నో గొడవలు జరిగినట్లు సోనాక్షి గుర్తు చేసుకుంది. ఒకర్ని ఒకరు తిట్టు కోవడం నుంచి కొట్టు కోవడం వరకూ మనస్పర్దల వరకూ వెళ్లారు. కానీ విడిపోవాలి అనే ఆలోచన రానివ్వలేదంది. ఆ సమయంలో కపుల్స్ థెరపీకి వెళ్దామని జహీర్ సలహా ఇవ్వడంతో రెండు సిట్టింగ్స్ లోనే ఇద్దరి మధ్య తలెత్తిన అన్ని వివాదాలకు పుల్ స్టాప్ పడిందంది. అన్ని విషయాలను నెగిటివ్ గా చూడకూడదన్నది అర్దమైందంది.
ఆ రెండింటినీ బ్యాలెన్స్ చేయాలి:
ఏ విషయాన్ని ఎలా ట్రీట్ చేయాలి? అని తెలిసినా కొన్ని క్షణాలు పాజిటివ్ గా ఆలోచించడం కంటే నెగిటివిటీనే బ్రెయిన్ కోరుకునేదంది. అప్పుడే సరైన నిర్ణయా లు తీసుకున్నామంది. నెగిటివ్..పాజిటివిటీని రెండింటిని బ్యాలెన్స్ చేసినప్పుడే జీవితం సంతోషంగా ఉంటుందని తన అనుభవాన్ని చెప్పుకొచ్చింది. దీంతో సోనా క్షి-జహీర్ ల బాండింగ్ ఎంత బలంగా మారిందన్నది ఈ సన్నివేశంతో తేటతెల్ల మవుతోంది. ప్రేమ పేరుతో లివ్ ఇన్ రిలేషన్ షిప్స్ లో ఉండటం..కొన్నాళ్ల తర్వాత విడిపోవడం ఎంతో మంది జీవితాల్లో చూసినదే.
టాలీవుడ్ లోనూ లాంచ్ అయింది:
పెళ్లి అయిన తర్వాత కూడా విడిపోవడం అన్నది సెలబ్రిటీ లైఫ్ లో సహజంగా మారిపోయింది. చిన్న చిన్న కారణాలతోనే బంధాలు వీగిపోతున్నాయి. మనస్ప ర్దలు, సరైన సఖ్యత లేకపోవడం వంటివి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. వీటన్నింటిని సోనాక్షి-జహీర్ దంపతులు దాటుకుని వచ్చిన నేపథ్యంలో? ఆ బంధం మరింత బలంగానూ మారుతుందన్నది విశ్లేషకుల మాట. ఇక సోనాక్షి కెరీర్ సంగతి చూస్తే? అమ్మడు బాలీవుడ్ లో ఇంకా స్టార్ లీగ్ లో చేరలేదు. నటిగా అనుకున్నంత గుర్తింపు దక్కలేదు. ఇటీవలే `జఠాధర` సినిమాతో తెలుగులోనూ లాంచ్ అయిన సంగతి తెలిసిందే.
