సోనాక్షి మరోటి లైన్ లో పెట్టిందా?
ఇప్పటికే బాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సోనాక్షి ఇప్పుడు టాలీవుడ్ లో కూడా నటిగా తానేంటో ప్రూవ్ చేసుకుని సత్తా చాటాలని చూస్తున్నారు.
By: Sravani Lakshmi Srungarapu | 7 Aug 2025 3:00 PM ISTతెలుగు సినిమా ప్రపంచ స్థాయిలో సత్తా చాటుతున్న నేపథ్యంలో ఇతర భాషల్లోని అగ్ర తారలు సైతం తెలుగు సినిమాల్లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే పలువురు బాలీవుడ్ భామలు తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. బాలీవుడ్ లోని స్టార్ హీరోయిన్లంతా తెలుగు సినిమాల్లో నటించి, ఇక్కడ కూడా తమ సత్తా చాటాలని చూస్తున్నారు.
జటాధరతో టాలీవుడ్ ఎంట్రీ
ఇప్పటికే దీపికా పదుకొణె, అనన్య పాండే, జాన్వీ కపూర్ లాంటి హీరోయిన్లు టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వగా సోనాక్షి సిన్హా కూడా ఓ తెలుగు సినిమాకు సైన్ చేసిన విషయం తెలిసిందే. సుధీర్ బాబు హీరోగా వెంకట్ కళ్యాణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సూపర్ నేచురల్ థ్రిల్లర్ జటాధర సినిమా ద్వారా సోనాక్షి సిన్హా టాలీవుడ్ కు అరంగేట్రం చేయనున్నారు.
సోనాక్షి చేతిలో మరో తెలుగు ప్రాజెక్టు
ఇప్పటికే బాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సోనాక్షి ఇప్పుడు టాలీవుడ్ లో కూడా నటిగా తానేంటో ప్రూవ్ చేసుకుని సత్తా చాటాలని చూస్తున్నారు. అయితే జటాధర సినిమా ఇంకా రిలీజ్ కూడా కాలేదు. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే సోనాక్షి ఇప్పుడు మరో ఎగ్జైటింగ్ తెలుగు ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వార్తలు వినిపిస్తున్నాయి.
టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థతో కలిసి..
టాలీవుడ్ మోస్ట్ హ్యాపెనింగ్ హీరో సరసన సోనాక్షి సిన్హా నటించనున్నారని, ఆ సినిమాలో అమ్మడు పాత్ర ఎంతో కీలకంగా ఉండటంతో పాటూ ఎంతో పవర్‌ఫుల్ గా ఉండనుందని అంటున్నారు. ఈ సినిమాను టాలీవుడ్ లోని ఓ అగ్ర నిర్మాణ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మించనుందని సమాచారం. ఏదేమైనా ముందు సినిమా రిలీజవకుండానే సోనాక్షికి టాలీవుడ్ లో మరో ఆఫర్ రావడమంటే చిన్న విషయమేమీ కాదు.
