వారి వివాహంపై కావాలనే సీన్ చేసారా?
బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా- రైటర్ జహీర్ ఇక్బాల్ ను ప్రేమ వివాహం చేసుకోవడం అప్పట్లో ఎంత సంచలనమైందో తెలిసిందే.
By: Srikanth Kontham | 5 Nov 2025 12:21 PM ISTబాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా- రైటర్ జహీర్ ఇక్బాల్ ను ప్రేమ వివాహం చేసుకోవడం అప్పట్లో ఎంత సంచలనమైందో తెలిసిందే. ఇరువురి మతాలు వేర్వేరు కావడంతో? ప్రత్యేక వివాహ చట్టం కింద వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లి ఎంతో నిరాడంబరంగా జరిగింది. కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో సింపుల్ గా జరిగింది. అయితే మతాంతర వివాహం కావడంతో సోషల్ మీడియాలో ఆ దంపతులు చాలా విమర్శలు ఎదుర్కున్నారు. ట్రోలింగ్ బారిన పడ్డారు. మొల్లగా ఇప్పుడవన్నీ ఓ కొలిక్కి వచ్చాయి. విమర్శలు ..ట్రోలింగ్ అంతా కామ్ అయింది.
తప్పేముందన్నదే ఆలోచిస్తా:
తాజాగా అప్పటి విమర్శలపై సోనాక్షి సిన్హా ఇప్పుడు స్పందించింది. ప్రేమ ముందు ద్వేషం ఓడిపోతుందని అభిప్రాయపడింది. ఎన్ని జరిగినా అంతిమంగా గెలిచేది ప్రేమ మాత్రమే అన్నారు. సమాజంలో ఓ సెక్షన్ ఎంత ద్వేషం చూపించినా? నిజమైన ప్రేమ ఆ ద్వేశాన్ని అధిగమిస్తుందంది. చాలా మంది `నువ్వు ధైర్యంగా నీ మనసు చెప్పినట్టు చేశావు` అన్నారు. కానీ ఇది నాకు చాలా సింపుల్ విషయంలా అనిపించింది. `నేను ప్రేమించిన వ్యక్తిని మాత్రమే పెళ్లి చేసుకున్నాను. అందులో తప్పేముంది? అన్నది మాత్రమే తాను ఆలోచించానంది.
అలాగని అధ్యయనాలే చెబుతున్నాయి:
అంతేకానీ మతాంతర వివాహం చేసుకున్న మొదటి మహిళను కాదు..చివరి మహిళను కాను అంది. పెళ్లి తర్వాత తమ మధ్య ఉన్న బాండింగ్ ఎలా ఉంది? అన్నది ప్రజలకు కూడా అర్దమైందన్నారు. అందుకే విమర్శించిన నోళ్లే ఆ తర్వాత మూగబోయాయంది. సంతోషంగా ఉంటే? ఆ సంతోషం ఇతరులకు పంచడగలమని అలా ఉండటం అంటేనే తనకు ఇష్టమంది. ఒక్కోసారి బాధలో కూడా సంతోషాన్ని వెతుక్కోవడం అన్నది కొందరికే సాధ్యమ వుతుందంది. అలాగే పెళ్లి తర్వాత బరువు పెరిగిందంటూ వచ్చిన కామెంట్స్ పై కూడా స్పందించింది.
టాలీవుడ్ లో బిజీ అయ్యేనా?
ఇది అనవసరమైచర్చ అని నవ్వేసింది. `పెళ్లై ఏడాదిన్నరవుతుంది. జీవితాన్ని ఎంతో ఆస్వాదిస్తున్నాను. కొత్తగా పెళ్లి అయిన ఎవరైనా బరువు పెరుగుతారు. గొప్ప వైవాహిక జీవితానికి సంకేతమది. ఇది నేను చెప్పింది కాదు. కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. దీన్ని కూడా సోషల్ మీడియాలో డిబేట్ కు తీసుకు రావడం ఏంటి? అని నవ్వే సింది. సోనాక్షి సిన్హా టాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే. సుధీర్ బాబు హీరోగా నటిస్తోన్న 'జఠాదర' సినిమాలో కీలక పాత్ర పోషిస్తుంది. మరి ఈ సినిమా తర్వాత అమ్మడు తెలుగులో బిజీ అవుతుందేమో చూడాలి.
