సన్ ఆఫ్ సర్దార్ 2.. మళ్ళీ అదే రోత?
దీనికి ఇటీవలే వచ్చిన హౌస్ ఫుల్ 5 చిత్రం ఒక ప్రధాన ఉదాహరణ. విమర్శకులను కూడా అసౌకర్యానికి గురిచేసే పసలేని కంటెంట్‌తో ఉందీ సినిమా.
By: M Prashanth | 3 Aug 2025 11:50 AM ISTప్రేక్షకులను నవ్వించాలన్న ఉద్దేశంతో బాలీవుడ్ మేకర్స్ అసలు కథను గాలికొదిలేస్తున్నారు. కాసిన్ని కామెడీ సీన్స్ ఉంటే సినిమా హిట్టైపోతుందనుకుంటున్న దర్శకులు ఇటీవల కాలంలో బాలీవుడ్ లో ఎక్కువైపోయారు. కేవలం కామెడీ పైన దృష్టి పెట్టి ప్రేక్షకులను ఎక్కువగా నవ్వించాలనే ప్రయత్నంలో క్రింజ్ కామెడీపై ఆధారపడుతున్నారు. దీని కోసం పెద్ద హీరోలు సైతం తమ ఇమేజ్ పక్కనపెట్టేస్తున్నారు. కానీ ఈ రకమైన క్రింజ్ కామెడీ మిస్ ఫైర్ అవుతుంది.
దీనికి ఇటీవలే వచ్చిన హౌస్ ఫుల్ 5 చిత్రం ఒక ప్రధాన ఉదాహరణ. విమర్శకులను కూడా అసౌకర్యానికి గురిచేసే పసలేని కంటెంట్‌తో ఉందీ సినిమా. ఇది కలెక్షన్స్ సంపాదించినప్పటికీ, మితిమీరిన డబుల్ మీనింగ్ జోకులను ప్రేక్షకులు ఆస్వాదించలేకపోయారు. ఫలితందా హౌస్ ఫుల్ ఫ్రాంచైజీ రెప్యుటేషన్ దెబ్బతింది.
తాజాగా బాలీవుడ్ బడా స్టార్ అజయ్ దేవగన్ నటించిన సన్ ఆఫ్ సర్దార్ 2 వచ్చింది. ఈ సినిమా కూడా ప్రేక్షకులకు కొత్తగా ఏమీ అందించలేకపోయింది. ముందే ఊహించదగిన కథాంశం. ఇందులో అజయ్ దేవగన్ జెస్సీ పాత్రలో కనిపిస్తారు. ఇందులో జెస్సీ తన భార్య డింపుల్ ను తిరిగి తీసుకొచ్చేందకు స్కాట్లాండ్ కు వెళ్తాడు. కానీ ఆమె అక్కడ విడాకులు డిమాండ్ చేసి, వేరొకరిని తను ప్రేమిస్తున్నట్లు చెప్పగానే జెస్సీ షాక్ అవుతాడు. జెస్సీ దానిని అంగీకరించడు.
ఇంతలో, అతను పాకిస్తాన్ కు చెందిన రూబియా, ఇంకా మరో ముగ్గురు మహిళలను కలుస్తాడు. వారిలో ఒకరైన సబాకు తన ప్రేమ విషయంలో ఆమె తండ్రిని ఒప్పించడానికి ఓ సహాయం కావాలి. జెస్సీ.. సబాకు సహాయం చేసేందుకు ఈ సవాలును స్వీకరించి తండ్రి ఇంటికి వెళ్తాడు. అక్కడ స్టోరీ అబద్ధాలు, నాటకీయతతో సాగిపోతుంది.
కానీ, దర్శకుడు విజయ్ కుమార్ అరోరా.. ఈ స్టోరీ టైమ్ క్యాప్సూల్ లో ఇరుక్కుపోయినట్లు అనిపించేలా తెరకెక్కించాడు. ఫస్ట్ హాఫ్ మొత్తం పాత్రల పరిచయాలు, అనవసరమైన కథలతో సాగుతుంది. అందులో అక్కడక్కాడా కొన్ని జోకులు వస్తాయి. కానీ కథను నడిపించడానికి అవి సరిపోలేదు. సెకండ్ హాఫ్ లో.. క్యారెక్టర్స్ అన్ని రవి కిషన్ ఇంటికి చేరుకున్న తర్వాత కామెడీ పూర్తి స్థాయిలోకి మారుతుంది. ఇదంతా కాలం చెల్లిన కామెండీలా అనిపిస్తుంది.
ఓవరాల్ గా ప్రేక్షకుడికి సహనాన్ని ఈ సినిమా పరీక్షిస్తుంది. భయంకరమైన క్రింజ్ కామెడీ, అనవసరపు డ్యాన్స్ లు, ట్రోలింగ్ సీన్స్ ఇవన్నీ కావాలని స్టోరీలో చొప్పించినట్లు అనిపిస్తుంది. ఈ సినిమా తొలి పార్ట్ ను గతంలో మర్యాద రామన్న రీమేక్‌గా ప్రశంసలు అందుకుంది. కానీ, తాజా సీక్వెల్ సన్ ఆఫ్ సర్దార్ ఆ ఫ్రాంచైజీని దెబ్బతీసింది.
