అన్నా వదినా విడిపోయాక అయోమయంలో నటి
సైఫ్ అలీ ఖాన్ -అమృతా సింగ్ దంపతులు 13ఏళ్ల కాపురం తర్వాత 2004లో విడిపోయినప్పుడు సైఫ్ సోదరి సోహా అలీఖాన్ మానసిక స్థితి ఎలా ఉందో తాజా పాడ్ కాస్ట్‌లో వివరించింది.
By: Sivaji Kontham | 6 Oct 2025 5:00 AM ISTఇంట్లో తోబుట్టువు కాపురం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కుటుంబ సభ్యులలో అలజడి సహజం. సోదర సోదరీమణుల మానసిక పరిస్థితులు ఎలా ఉంటాయో ఊహించగలిగేవే.. అలజడి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులను క్రియేట్ చేస్తుంది. సర్ధుకోవడానికి చాలా సమయం పడుతుంది. సైఫ్ అలీ ఖాన్ -అమృతా సింగ్ దంపతులు 13ఏళ్ల కాపురం తర్వాత 2004లో విడిపోయినప్పుడు సైఫ్ సోదరి సోహా అలీఖాన్ మానసిక స్థితి ఎలా ఉందో తాజా పాడ్ కాస్ట్‌లో వివరించింది.
సైఫ్ - అమృత జంట తమ మధ్య వ్యక్తిత్వ వ్యత్యాసాలు, జీవనశైలి విభేదాలు, ఆర్థిక ఇబ్బందుల కారణంగా విడిపోయారని సోహా తెలిపారు. బ్రేకప్ తర్వాత సైఫ్ అమృతకు రూ.5 కోట్లు జీవనభృతిగా చెల్లించడమే గాక, కుమారుడు ఇబ్రహీం, సారా అలీఖాన్‌లకు 18 ఏళ్లు నిండే వరకు నెలకు రూ.1 లక్ష చొప్పున సంరక్షణ కోసం చెల్లించడానికి అంగీకరించారు. చాలా కాలానికి ఇప్పుడు సోహా అలీఖాన్ తన సోదరుడి విడాకుల సమయంలో తమ మనోవేదన గురించి ప్రస్థావించారు.
వ్యక్తిగతంగా తాను ఆ క్లిష్ఠ సమయంలో చాలా ప్రభావితం అయ్యానని, తాను చాలా మారానని కూడా తెలిపింది. ఇలాంటివాటిని ఎవరూ ఊహించరు. అవి జరిగినప్పుడు సర్ధుబాటు కోసం ప్రయత్నిస్తారు. కొన్నాళ్లకు ఎవరి జీవితం వారిది. ఎవరికి వారు ఎలా జీవించాలో కాలం నేర్పిస్తుందని సోహా అన్నారు. తన వదిన గారైన అమృతతో తనకు మంచి అనుబంధం ఉందని, ఒకే ఇంట్లో కలిసి నివశించామని తెలిపారు. తనను ఆమె బాగా చూసుకుంది. ఫోటోషూట్లకు తిప్పింది. చాలా చేసింది. కలిసి ఆటలు కూడా ఆడాము. కానీ అన్నా వదినా విడిపోయారు అని తెలియగానే ఏం చేయాలో పాలుపోలేదని సోహా తెలిపింది.
ఇప్పటికి వారి జీవితాల్లో ఒక స్థిరత్వం ఉంది. విడిపోయిన తర్వాత ఆ ఇద్దరూ సాధారణ స్థితికి చేరుకోవడానికి సమయం పట్టిందని కూడా సోహా తెలిపారు. ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్లయ్యారు. సారా అలీ ఖాన్ - ఇబ్రహీం అలీ ఖాన్ సంతోషంగా కెరీర్ సాగిస్తున్నారు. సైఫ్ 2012లో కరీనా కపూర్‌ను వివాహం చేసుకున్నారు. వారు తైమూర్ - జెహ్‌లకు తల్లిదండ్రులు. సోహా అలీఖాన్ తను ప్రేమించిన కునాల్ ఖీముని పెళ్లాడిన సంగతి తెలిసిందే.
