Begin typing your search above and press return to search.

అవకాశాల వేటలో హీరోయిన్ల ఫోటోషూట్ల పర్వం!

ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ వెండితెరపై వారు చేసే సినిమాల మీద మాత్రమే ఆధారపడి ఉండేది. కానీ సోషల్ మీడియా యుగం రావడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది.

By:  Srikanth Kontham   |   9 May 2026 6:00 PM IST
అవకాశాల వేటలో హీరోయిన్ల ఫోటోషూట్ల పర్వం!
X

ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ వెండితెరపై వారు చేసే సినిమాల మీద మాత్రమే ఆధారపడి ఉండేది. కానీ సోషల్ మీడియా యుగం రావడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు హీరోయిన్లు సినిమాల మధ్య విరామం దొరికినప్పుడు ఖాళీగా కూర్చోవడం లేదు. తమ క్రేజ్ తగ్గకుండా చూసుకోవడానికి నిరంతరం వార్తల్లో ఉండటానికి ఫోటోషూట్లను ప్రధాన అస్త్రంగా వాడుకుంటున్నారు. ఇన్ స్టాగ్రామ్ వంటి వేదికలపై సరికొత్త ఫ్యాషన్ ట్రెండ్స్ సెట్ చేస్తూ మేకర్స్ దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.

ఈ క్రమంలోనే యువ నటీమణులు రుక్మిణి వసంత్, సారా అర్జున్ వంటి వారు సోషల్ మీడియాలో విపరీతమైన సందడి చేస్తున్నారు. `సప్త సాగరదాచే ఎల్లో` అనే త‌మిళ‌ చిత్రంతో గుర్తింపు ద‌క్కించుకున్న‌ రుక్మిణి వసంత్ సహజమైన అందంతో పాటు గ్లామరస్ ఫోటోషూట్లతో టాలీవుడ్ మేకర్ల దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తోంది. అలాగే చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించి హీరోయిన్‌గా మారిన‌ సారా అర్జున్ కూడా తనలోని కొత్త కోణాన్ని ఫోటోషూట్ల ద్వారా ఆవిష్కరిస్తోంది. ఈ కొత్త భామలు కేవలం నటనపైనే కాకుండా తమ సోషల్ మీడియా ప్రెజెన్స్ ద్వారా కూడా అవకాశాలను దక్కించుకోవచ్చని నమ్ముతున్నారు.

మరోవైపు సీనియర్ నటీమణులు సమంత, తమన్నా కూడా ఇదే బాటలో పయనిస్తుండటం గమనార్హం. దాదాపు దశాబ్ద కాలానికి పైగా పరిశ్రమలో ఉన్న భామ‌లు మారుతోన్న ట్రెండ్‌కు అనుగుణంగా తమను తాము మలచు కుంటున్నారు. మ్యాగజైన్ కవర్ పేజీల కోసం ఇచ్చే బోల్డ్ , స్టైలిష్ పోజులు ఇంటర్నెట్‌లో సెన్సేషన్ సృష్టి స్తున్నాయి. ముఖ్యంగా సమంత ఫిట్‌నెస్‌తో కూడిన గ్లామర్ షోతో ఫ్యాషన్ ఐకాన్‌గా మారుతుండగా మిల్కీ బ్యూటీ తమన్నా అందచందాలతో నేటి తరం కుర్ర హీరోయిన్లకు గట్టి పోటీనిస్తోంది.

ఈ సీనియర్ల ఫోటోషూట్లు వారికి సినిమా అవకాశాలే కాకుండా భారీ బ్రాండ్ ఎండార్స్‌మెంట్లను కూడా తెచ్చిపెడుతున్నాయి. ఫోటోషూట్లు అనేవి ఇప్పుడు ఫ్యాషన్ కోసం చేసేవి మాత్రమే కాదు. అవి కూడా మార్కెటింగ్ స్ట్రాటజీ గా మారాయి. సినిమాల్లో నటించే అవకాశం లేని సమయంలో లేదా ఒక ప్రాజెక్ట్ పూర్తయ్యాక మరో ప్రాజెక్ట్ సైన్ చేయ‌డానికి మధ్య ఉండే గ్యాప్‌లో ప్రేక్షకులు తమను మర్చిపోకుండా ఉండేందుకు హీరోయిన్లు ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఒక్క‌ వైరల్ ఫోటోషూట్ ద్వారా రాత్రికి రాత్రే సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెంచుకోవడం తద్వారా దర్శక,నిర్మాతలు తమ లుక్ , గ్లామర్ గురించి సంకేతాన్ని పంపడం ఈ ప్రక్రియలో ముఖ్య ఉద్దేశం.

గ్లామర్ షో మాత్రమే కాకుండా విభిన్నమైన కాన్సెప్ట్ ఫోటోషూట్ల ద్వారా అన్ని రకాల పాత్రలకు సరిపోతామని నిరూపించుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. పీరియాడిక్ డ్రామాలకు సెట్ అయ్యేలా ట్రెడిషనల్ లుక్స్, యాక్షన్ సినిమాలకు సరిపోయేలా ఫిట్ లుక్స్ , మోడ్రన్ కథల కోసం బోల్డ్ లుక్స్ ఇలా రకరకాలుగా ఫోటోషూట్లు నిర్వహిస్తున్నారు. ఇలాంటివి నిజంగానే కొత్త అవకాశాలకు దారి తీస్తున్నాయి. సోషల్ మీడియాలో ఎక్కువ ఎంగేజ్‌మెంట్ ఉన్న హీరోయిన్లకే ద‌ర్శ‌క‌, నిర్మాతలు కూడా మొగ్గు చూపుతున్నారు.

సినీ పరిశ్రమలో మనుగడ సాగించడానికి ప్రతిభతో పాటు నిరంతరం వెలుగులో ఉండటం కూడా అంతే అవస రమని హీరోయిన్లు గ్రహించారు. అందుకే గ్లామర్ ఫోటోషూట్లను కెరీర్ ఎదుగుదలకు తెలివిగా వినియోగించుకుం టున్నారు. ఈ ట్రెండ్ వల్ల ఫ్యాషన్ ఇండస్ట్రీకి , ఫోటోగ్రాఫర్లకు పని దొరుకుతున్నా? చివరగా నటనలో ప్రతిభ ఉంటేనే ఫోటోషూట్ల ద్వారా వచ్చే అవకాశాలు నిలబడతాయన్న‌ది అంతే వాస్త‌వం.