Begin typing your search above and press return to search.

ఆ హీరోయిన్స్ కు వరుస ఛాన్సులు.. అదెలా?

ఒకప్పుడు హీరోయిన్ల కెరీర్‌ లో ఒక్కటి, రెండు ఫ్లాపులు పడితే అవకాశాలు తగ్గిపోవడం కనిపించేది. కొత్త హీరోయిన్లు వరుసగా వస్తుండటంతో నిర్మాతలు వెంటనే మరో ఆప్షన్ వైపు వెళ్లేవారు.

By:  M Prashanth   |   3 July 2026 11:20 AM IST
ఆ హీరోయిన్స్ కు వరుస ఛాన్సులు.. అదెలా?
X

ఒకప్పుడు హీరోయిన్ల కెరీర్‌ లో ఒక్కటి, రెండు ఫ్లాపులు పడితే అవకాశాలు తగ్గిపోవడం కనిపించేది. కొత్త హీరోయిన్లు వరుసగా వస్తుండటంతో నిర్మాతలు వెంటనే మరో ఆప్షన్ వైపు వెళ్లేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. సినిమాలు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోయినా కొందరు హీరోయిన్లు మాత్రం అవకాశాలను అందుకుంటున్నారు. దీంతో ఫ్లాప్‌ లు వచ్చినా ఛాన్సులు ఎలా వస్తున్నాయినే చర్చ సాగుతోంది.

ముఖ్యంగా పాన్ ఇండియా ట్రెండ్ కూడా హీరోయిన్లకు కలిసి వస్తోంది. ఒక భాషలో సినిమా ఆశించిన ఫలితం ఇవ్వకపోయినా మరో భాషలో అదే హీరోయిన్‌ కు మంచి గుర్తింపు ఉండొచ్చు. అందుకే తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ మార్కెట్లను దృష్టిలో పెట్టుకుని దర్శకులు, నిర్మాతలు నటీమణులను ఎంపిక చేస్తున్నారు. దీంతో ఒకే భాషలోని హిట్లు, ఫ్లాపులుకే కెరీర్ పరిమితం కావడం లేదు.

సోషల్ మీడియా ఎఫెక్ట్ కూడా కీలకంగా మారింది. ఇన్‌ స్టాగ్రామ్, ఎక్స్ వంటి వేదికల్లో హీరోయిన్లకు ఉండే ఫాలోయింగ్, అభిమానులతో వారి రిలేషన్, ప్రమోషన్లలో చురుకుగా పాల్గొనే తీరు నిర్మాతలకు ఎక్స్ట్రా సపోర్ట్ గా కనిపిస్తోంది. సినిమా విడుదలకు ముందే ప్రమోషన్స్ లో హీరోయిన్ పాత్ర కూడా కీలకంగా ఉండటంతో ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. అలాగే కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ రోల్ రన్ టైమ్ తక్కువగా ఉండే సందర్భాలు ఎక్కువ.

అలాంటి సినిమాల్లో యాక్టింగ్ కంటే స్క్రీన్ ప్రెజెన్స్, గ్లామర్, జోడీ బాగుండటం వంటి అంశాలకే ప్రాధాన్యం పెరుగుతోంది. అందుకే గత సినిమా రిజల్ట్ కంటే, కొత్త ప్రాజెక్టుకు ఆమె ఎంతవరకు సూట్ అవుతుందనే యాంగిల్ లోనే సెలెక్షన్స్ జరుగుతున్నాయి. మరోవైపు ఓటీటీల ప్రభావం కూడా హీరోయిన్లకు ఉపయోగపడుతోంది. థియేటర్లలో ఆశించిన విజయం రాకపోయినా, డిజిటల్ ప్లాట్ ఫామ్స్ ద్వారా వారి నటనకు గుర్తింపు లభిస్తోంది.

దీంతో దర్శకులు కొత్త కథలకు వారిని మళ్లీ ఎంపిక చేయడానికి వెనుకాడటం లేదు. ఒకప్పుడు ఫ్లాప్ అంటే కెరీర్‌ కు పెద్ద దెబ్బగా భావించేవారు. ఇప్పుడు మాత్రం మంచి రోల్ వస్తే తిరిగి నిలబడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే అవకాశాలు రావడం ఒక విషయం అయితే, వాటిని హిట్లుగా మార్చుకోవడం మరో విషయం. వరుస సినిమాలు చేస్తున్నంత మాత్రాన కెరీర్ సేఫ్ అని చెప్పలేం. ప్రేక్షకులను ఆకట్టుకునే పాత్రలు, హిట్లు ఉంటేనే నిలదొక్కుకోవడం సాధ్యమవుతుంది. అందుకే ప్రతి సినిమా హీరోయిన్లకు కీలక పరీక్షగానే మారుతోంది.

ఇదే పరిస్థితి ప్రస్తుతం కొందరు యంగ్ హీరోయిన్ల విషయంలో కనిపిస్తోంది. కయాదు లోహర్, భాగ్యశ్రీ బోర్సే ప్రస్తుతం పలు తెలుగు చిత్రాల్లో అవకాశాలు అందుకుంటూ బిజీగా ఉన్నారు. కృతి శెట్టి, నభా నటేశ్ కూడా వరుస తెలుగు ప్రాజెక్టుల్లో కనిపిస్తున్నారు. ఆ హీరోయిన్లకు వచ్చిన అవకాశాలు ఒక విషయం స్పష్టం చేస్తున్నాయి. నేటి సినీ ఇండస్ట్రీలో ఒక్క ఫ్లాప్‌ తో కెరీర్ ముగిసే పరిస్థితి లేదు. కానీ వచ్చిన ఛాన్సులు సక్సెస్ లుగా మార్చుకోవడమే వారి ఫ్యూచర్ ను డిసైడ్ చేయనుంది.