Begin typing your search above and press return to search.

యూట్యూబర్ 'సినీ' సక్సెస్.. SM పవర్ ఏ రేంజ్‌ లో ఉందంటే?

అంతేకాదు, పెట్టిన బడ్జెట్ కు దాదాపు పది రెట్ల వరకు లాభాలు తెచ్చిపెట్టినట్లు టాక్ వినిపిస్తోంది.

By:  M Prashanth   |   18 Jun 2026 7:00 PM IST
యూట్యూబర్ సినీ సక్సెస్.. SM పవర్ ఏ రేంజ్‌ లో ఉందంటే?
X

సోషల్ మీడియా ఎఫెక్ట్ ప్రస్తుతం ఎంత పెరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదేమో. ఒకప్పుడు సినిమా హీరోలు, స్పోర్ట్స్ ప్లేయర్లు, పొలిటికల్ లీడర్లకు పరిమితమైన సెలబ్రిటీ హోదా ఇప్పుడు యూట్యూబర్లు, ఇన్‌ స్టాగ్రామ్ ఇన్‌ ఫ్లుయెన్సర్లకూ దక్కుతోంది. లక్షలు, కోట్లలో ఫాలోవర్లను సంపాదించుకున్న కంటెంట్ క్రియేటర్లు ఎక్కడికి వెళ్లినా అభిమానులు చుట్టూ చేరే పరిస్థితి కనిపిస్తోంది. వారి పోస్టులు, వీడియోలు నిమిషాల్లో వైరల్ అవుతున్నాయి.

అయితే సోషల్ మీడియాలో ఉన్న రెస్పాన్స్ సిల్వర్ స్క్రీన్ పై కూడా పనిచేస్తుందా? యూట్యూబ్‌ లో సక్సెస్ అయిన పర్సన్ సినిమా తీస్తే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా? అనే ప్రశ్న చాలా కాలంగా చర్చనీయాంశంగా ఉంది. ఆ క్వశ్చన్లకు ఇప్పుడు అమెరికన్ యూట్యూబర్ మార్కిఫ్లయర్ తన సక్సెస్ తో ఆన్సర్ చెప్పినట్లు ఇప్పుడు అంతా మాట్లాడుకుంటున్నారు.

వరల్డ్ వైడ్ గా కోట్లాది మంది సబ్‌ స్క్రైబర్లు ఉన్న మార్కిఫ్లయర్ అనే యూట్యూబర్ ఇటీవల ఐరన్ లంగ్ అనే మూవీని తెరకెక్కించారు. ఆ సినిమాకు నిర్మాత, దర్శకుడు, లీడ్ రోల్ అన్నీ ఆయనే కావడం విశేషం. దాదాపు 2 గంటల 7 నిమిషాల రన్ టైమ్ తో రూపొందిన ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద అంచనాలకు మించి విజయాన్ని అందుకుంది.

అంతేకాదు, పెట్టిన బడ్జెట్ కు దాదాపు పది రెట్ల వరకు లాభాలు తెచ్చిపెట్టినట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో ఒక యూట్యూబర్ కూడా సరైన ప్లాన్, ప్రేక్షకులను ఆకట్టుకునే కథతో పెద్ద విజయాన్ని సాధించగలరని ప్రూవ్ అయినట్లే ఆ సినిమా కథ కూడా ఇంట్రెస్టింగ్ బ్యాక్ డ్రాప్ తో సాగుతుంది. క్వైట్ ర్యాప్చర్ అనే డిజాస్టర్ తర్వాత నక్షత్రాలు, గ్రహాలు మాయమైన ఫ్యూచర్ వరల్డ్ లో కథ జరుగుతుంది.

సబ్ మెరైన్ లో ఒక వ్యక్తిని పంపించే మిషన్ చుట్టూ కథ తిరుగుతుంది. సైన్స్ ఫిక్షన్, థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఆ సినిమా ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. అయితే ఆ విజయంలో సోషల్ మీడియా రోల్ ఎంత అనే అంశం కూడా చర్చకు వస్తోంది. మార్కిఫ్లయర్‌ కు ఉన్న భారీ ఫాలోయింగ్ సినిమా ప్రమోషన్స్ కూడా గట్టిగా ఉపయోగపడింది. ఆయన అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు, వీడియోలు, రివ్యూల ద్వారా చిత్రాన్ని ఫుల్ గా ప్రమోట్ చేశారు. దీంతో సినిమా గురించి పెద్ద ఎత్తున అవగాహన ఏర్పడింది.

కానీ కేవలం ఫాలోవర్స్ ఉన్నారనే కారణంతో మాత్రమే సినిమా సక్సెస్ కాలేదని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ప్రేక్షకులను థియేటర్లకు తీసుకురావడంలో సోషల్ మీడియా హెల్ప్ చేసినా, చివరికి కంటెంట్ బాగుంటేనే సినిమా నిలబడుతుందనే విషయం మరోసారి స్పష్టమైంది. మంచి కథ, ఇంట్రెస్టింగ్ రైటింగ్, ప్రేక్షకులను

ఆకట్టుకునే యాక్టింగ్ ఉండటం వల్లే ఐరన్ లంగ్ విజయాన్ని అందుకుందని భావిస్తున్నారు.

ఏదేమైనా సోషల్ మీడియా పవర్ సినీ ఇండస్ట్రీలోఎంత కీలకంగా మారిందో మార్కిఫ్లయర్ ఎగ్జాంపుల్ చూపించింది. అభిమానుల సపోర్ట్ సినిమా స్టార్టింగ్ సక్సెస్ కు హెల్ప్ అయినా.. లాంగ్ రన్ సక్సెస్ ను నిర్ణయించేది మాత్రం కంటెంట్ అనే విషయాన్ని ఆ చిత్రం మరోసారి గుర్తు చేసింది. సోషల్ మీడియా పవర్ సరైన కథతో కలిస్తే ఎంతటి రిజల్ట్స్ సాధించవచ్చో మార్కిఫ్లయర్ సక్సెస్ స్టోరీ చెబుతోంది.