Begin typing your search above and press return to search.

స‌క్సెస్ లేని క్రేజ్ ఎందుకు ప‌నికిరాదు!

దీంతో సోషల్ మీడియాలో ట్రెండింగ్ బ్యూటీగా నిలిచింది. ప్ర‌త్యేకించి తెలుగు మీడియా అటెన్ష‌న్ డ్రా చేసింది. దీంతో అమ్మ‌డికి ఫాలోయింగ్ అంత‌కంత‌కు రెట్టింపు అయింది.

By:  Srikanth Kontham   |   6 March 2026 6:00 PM IST
స‌క్సెస్ లేని క్రేజ్ ఎందుకు ప‌నికిరాదు!
X

స‌క్సెస్ లేని క్రేజ్ ఎందుకు ప‌నికిరాదా? పేరు గొప్ప ఊరు దిబ్బ ? అన్న‌ట్లే వ్య‌వ‌హారం ఉంటుందా? అంటే కొంత మంది భామ‌ల విష‌యంలో స‌న్నివేశం అలాగే క‌నిపిస్తుంది. కోలీవుడ్ చిత్రం `డ్రాగ‌న్` తో ఒక్కసారిగా వెలుగులోకి వ‌చ్చింది క‌యాదు లోహార్. అమ్మ‌డు అందులో పోషించింది సెకెండ్ లీడ్ అయినా? గ్లామ‌ర్ అప్పిరియ‌న్స్ తో యువ‌త‌కు రీచ్ అయింది. దీంతో సోషల్ మీడియాలో ట్రెండింగ్ బ్యూటీగా నిలిచింది. ప్ర‌త్యేకించి తెలుగు మీడియా అటెన్ష‌న్ డ్రా చేసింది. దీంతో అమ్మ‌డికి ఫాలోయింగ్ అంత‌కంత‌కు రెట్టింపు అయింది.

ఆక్రేజ్ తో క‌యాదు టాలీవుడ్ సాధించింది ఏమైనా ఉందా? అంటే ఓ రెండు చిత్రాల్లో అవ‌కాశాలు అందుకోవ‌డం వ‌ర‌కే ప‌రిమిత‌మైంది. వాటిలో ఓ చిత్రం `ఫంకీ` ఇటీవ‌లే రిలీజ్ అయింది. కానీ ఆశించిన ఫ‌లితం సాధించ‌లేదు. ప్ర‌స్తుతం `ది ప్యార‌డైజ్` లో హీరోయిన్ గా న‌టిస్తుంది. ఈ సినిమా విజ‌యం సాధిస్తే త‌ప్ప టాలీవుడ్ లో కొత్త అవ‌కాశాలు అందుకోవ‌డం క‌ష్టంగానే క‌నిపిస్తుంది. కేర‌ళ కుట్టి మాళ‌వికా మోహ‌న‌న్ `ది రాజాసాబ్` తో టాలీవుడ్ లో లాంచ్ అయింది. ఆ సినిమా రిలీజ్ కు ముందే టాలీవుడ్ లో ఫేమ‌స్ అయిపోయింది. సోష‌ల్ మీడియాలో ఫాలోవ‌ర్ల‌ను పెంచుకుంది.

రాజాసాబ్ రిలీజ్ కు ముందే ప్ర‌త్యేక క‌థ‌నాలు వైర‌ల్ అయ్యాయి. గ్లామ‌రస్ బ్యూటీగా సంచ‌ల‌నం అయింది. కానీ ఆ క్రేజ్ తో మాళ‌విక సాధించిందేంటి? మ‌రో తెలుగు సినిమా ఛాన్స్ అందుకుందా? అంటే లేద‌నే చెప్పాలి. అమ్మ‌డిపై ఇప్పుడు గాసిప్స్ కూడా రావ‌డం లేదు. వీళ్లిద్ద‌రికంటే క్రేజ్ ను ఎన్ క్యాష్ చేసుకోవ‌డంలో భాగ్య శ్రీ బోర్సే కొంత వ‌ర‌కూ స‌క్సెస్ అయింది. తొలి సినిమా `మిస్ట‌ర్ బ‌చ్చ‌న్` ప్లాప్ అయింది. కానీ ఆ త‌ర్వాత వ‌రుస‌గా మూడు నాలుగు సినిమాల్లో ఛాన్సులు అందుకుంది. అవి కూడా ప్లాప్ అయ్యాయి. ప్ర‌స్తుతం అఖిల్ కి జోడీగా `లెనిన్` లో న‌టిస్తుంది.

ఈ సినిమా గ‌నుక హిట్ అవ్వ‌క‌పోతే? భాగ్య శ్రీ క్రేజ్ క్లోజ్ అయిన‌ట్లే. ఇప్ప‌టికే అమ్మ‌డిపై ఐరెన్ లెగ్ అనే ముద్ర ప‌డిపోయింది. తాను న‌టించిన ప్రతీ సినిమా ఫెయిల‌వ్వ‌డంతో ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు ప‌రిశీలించే ప‌రిస్థితుల్లో లేరు.

తెలుగు హీరోయిన్ శ్రీలీల అంటే ఎంతో మంది అభిమానిస్తారు. త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన ఇమేజ్ , క్రేజ్ ఉన్నాయి. వాటితో శ్రీలీల సాధించింది పెద్ద‌గా లేదు. చాలా సినిమాల్లో సెకెండ్ లీడ్ కే ప‌రిమిత‌మైంది త‌ప్ప మెయిన్ లీడ్ లో ఛాన్స్ అందుకుంది లేదు. అవ‌కాశాలు వ‌స్తున్నాయి అనుకున్న స‌మ‌యంలో? అమ్మ‌డు బాలీవుడ్ పై ఫోక‌స్ పెట్టింది. ఇలా న‌లుగురు భామ‌ల్లో ముగ్గురు క్రేజ్ వ‌ర‌కే ప‌రిమితం అయ్యారు.