శోభిత ముంబైలో ఉంటే అలా వైజాగ్‌లో ఉంటే ఇలా
చైతన్యతో తెలుగులో మాట్లాడుతుంటే సొంత ఇంట్లో ఉన్న భావన కలుగుతుందని శోభిత అన్నారు.
By: Sivaji Kontham | 9 Nov 2025 10:00 PM ISTశోభిత తెలుగు మాట్లాడే విధానం, తెలుగు భాషలో పరిపూర్ణత తనను ఆశ్చర్యపరుస్తాయని అన్నారు అక్కినేని నాగచైతన్య. ఈ అచ్చ తెలుగమ్మాయి నిజానికి అక్కినేని ఇంట కోడలుగా అడుగుపెట్టినప్పటి నుంచి అక్కడ సంతోషం వెల్లివిరిసింది. నాగార్జున- అమల దంపతులు తమ కోడలు పిల్లపై ప్రశంసలు కురిపిస్తూనే ఉన్నారు. నాగచైతన్య ఎప్పుడూ శోభితను ఆటపట్టిస్తూ సరదాగా గడిపేస్తాడు. ఇదంతా చూస్తుండగానే మొదటి వివాహ వార్షికోత్సవానికి సమయమాసన్నమవుతోంది. 4డిసెంబర్ డేట్ లాక్ అయింది.
ఈ శుభ సందర్భాన శోభితలోని తెలుగు భాషా పరిజ్ఞానాన్ని నాగచైతన్య విపరీతంగా పొగిడేస్తున్నాడు. స్పష్ఠంగా పరిపూర్ణంగా తెలుగు మాట్లాడుతుందని తన భార్యకు కితాబిచ్చేసాడు చైతూ. తనకు కూడా తెలుగు నేర్పిస్తుందని కూడా అన్నాడు. శోభిత మాట్లాడే స్పష్ఠమైన తెలుగు నన్ను ఆశ్చర్యపరుస్తుందని చైతన్య గతంలో పలుమార్లు అన్నారు. శోభిత మోడ్రన్ అమ్మాయి.. అదే సమయంలో సాంప్రదాయాలు విలువలను బ్యాలెన్స్ చేస్తుందని అన్నాడు. ముంబైలో ఉన్నంత సేపు సిటీ గాళ్.. వైజాగ్ లో ఉంటే తన మూలాలను వదులుకోదు! అని కాంప్లిమెంట్ ఇచ్చాడు చై. ఇక తెలుగు భాషతో తన అనుబంధం గురించి శోభిత స్వయంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.
ముంబైలో చాలా ఏళ్లు గడిపాక నా తల్లిదండ్రులతో తప్ప ఇంకెవరితోను తెలుగు మాట్లాడటం మర్చిపోయాను. చైతన్యతో తెలుగులో మాట్లాడుతుంటే సొంత ఇంట్లో ఉన్న భావన కలుగుతుందని శోభిత అన్నారు. ఇలా ఉండటం అత్యంత సంతోషకరమైన భావోద్వేగ క్షణం అని కూడా శోభిత ఆనందం వ్యక్తం చేసారు. తెలుగు తనను ఎమోషనల్ గా టచ్ చేసే సహజమైన భాష.. సంతోషం, వ్యామోహం లేదా కలతకు గురైన సందర్భాలలో కచ్ఛితంగా తెలుగులోనే నా భావోద్వేగం బయటకు వస్తుందని కూడా శోభిత అన్నారు.
ప్రస్తుతం నాగచైతన్య తండేల్ తర్వాత తదుపరి చిత్రం NC24 లో నటిస్తున్నాడు. విరూపాక్ష ఫేమ్ కార్తీక్ వర్మ దండు ఈ ప్రాజెక్టుకు దర్శకత్వం వహిస్తున్నారు. మీనాక్షి చౌదరి కథానాయిక. ఈ చిత్రం పౌరాణిక థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతోందని, ఇందులో చైతన్య నిధి వేటగాడి పాత్రను పోషిస్తున్నాడని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఫస్ట్ లుక్ పోస్టర్లు, తెరవెనుక విజువల్స్ ఇప్పటికే ఆకట్టుకున్నాయి. చైతూ ఈ చిత్రంలో పూర్తిగా కొత్త అవతారంలో కనిపిస్తాడు. అతడి కెరీర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ చిత్రాలలో ఇది ఒకటి. సుకుమార్ ఈ సినిమాకు కథను అందించారు. బివిఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్, బాపినీడు తదితరులు నిర్మిస్తున్నారు.
